ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్(ఐఎస్‍బీ) ఆవిర్భావ ముగింపు వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ ఐఎస్‍బీ ప్రారంబించి 20 ఏళ్ళు పూర్తవడంతో, వారు చేస్తున్న ఈ వేడుకల్లో చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా పోల్గోననున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదారాబాద్ లో ఐఎస్‍బీ క్యాంపస్‍లో 20 సంవత్సరాల ఆవిర్భావ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఐఎస్‍బీలోని  విద్యార్థులతో జరిగే  ముఖాముఖి చర్చలో చంద్రబాబు పాల్గొననున్నారు.

వచ్చే సంవత్సరం 2023కి సంభందించిన  పండుగలు, నేషనల్ హాలిడేస్ ను  ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది వచ్చే రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పండుగల  తేదీల్లో కొన్ని మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  జనవరి నెలలో  వచ్చే 14, 15, 16 తేదీన వచ్చే సంక్రాంతి సెలవులను  సాధారణ సెలవులగా ప్రభుత్వం పేర్కొంది. ఆ తరువాత  మార్చిలో  వచ్చే ఉగాది సెలవును  22తేదీన ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సారి వచ్చే  భోగీ, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి రెండో శనివారం, ఆదివారం వచ్చాయని  ఏపి ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఈ 2023 లో దాదాపు 23 రోజులను సాధారణ సెలవు రోజులుగా పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

జగన్ మోహన్ రెడ్డిని గెలిపించానని చంకలు గుద్దుకున్నాడు కేసీఆర్. ఇక ఏపీలోనూ టీఆర్ఎస్ దే అధికారం అన్నంతగా జగన్ మోహన్ రెడ్డి మొదట్లో వంగిపోయాడు. విందు వినోదాలలో పరస్పరం ప్రేమ చూపించుకున్నారు. తెలంగాణ నుంచి ప్రతిపాదన రావడమే తరువాయి ఏపీ సై అంటూ సంతకం పెట్టేయడమే. అన్నీ వదులుకున్న జగన్ మోహన్ రెడ్డికి సడెన్ గా ఏపీ ఆస్తుల విభజన గుర్తొచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,42,601 కోట్ల విలువైన ఆస్తులను విభజించకుండా తెలంగాణ కాలయాపన చేస్తోందని ఏపీ ఆరోపణ చేసింది. విభజన జరగాల్సిన 91 శాతం ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నాయని ఏపీ వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లయినా ఆస్తుల విభజనకు తెలంగాణ సహకరించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

kcr 15122022 2

ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని ఏపీ సర్కారు సుప్రీంకోర్టుని కోరడం కలకలం రేపుతోంది. ఎందుకంటే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి త్వరలో నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ కాలంలో ఏ ఒక్క రోజూ ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు గురించి నోరు ఎత్తి అడిగింది లేదు. ఏపీ వాటాగా వచ్చిన లక్షల కోట్ల భవనాలు తెలంగాణ సర్కారు అడిగిన వెంటనే ధారాదత్తం చేసేశాడు జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ వాటేసుకుని, స్వీట్లు పంచుకుని ప్రేమ కురిపించిన జగన్ మోహన్ రెడ్డి ఇంత సడెన్గా తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వెనుక ఏదో కుతంత్రం ఉంటుందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య అనేక వ్యూహాలు నడుస్తున్న వేళ, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం వెనుక, ఏమి స్కెచ్ ఉంది అనేది చూడాలి మరి. చూద్దాం ఏమి జరుగుతుందో..

పోయిన ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయండి, మీ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి అంటూ, తన మత ప్రసంగాలలో చెప్పిన బ్రదర్ అనిల్ కుమార్, ఇప్పుడు మారిన పరిస్థితితుల్లో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పక పోయినా, ఏపి ప్రభుత్వం అంటూ, తాను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గుంటున్న బ్రదర్ అనిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న విశాఖలో సభలో పాల్గున్నారు. రేపు గుడివాడలో కూడా ఒక సభ పెట్టుకున్నారు. ప్రార్ధన ప్రసంగంలో, రాజకీయం మిక్స్ చేసి, తన బావ ప్రభుత్వం పై, విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైసీపీ ప్రచారం చేసుకుంటున్న పధకాలను టార్గెట్ చేసారు. స్వార్ధం కోసం ఇచ్చే పధకాలకు ప్రజలు దూరం జరగాలని, దేవుడు మనకు వేరే పధకాలు ఇచ్చాడని, వీళ్ళు ఇచ్చే పధకాల కోసం కాకుండా, తమతమకు స్వశక్తితో ఎదగాలి అంటూ, వైసీపీని టార్గెట్ చేసారు.

anil 16122022 2

ఇది ఒక్కటే కాదు, మరో పెద్ద మాట కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బ్రతకటానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు, పక్క రాష్ట్రాలకు వెళ్లి బ్రతికితే ఎంతో బాగుటుంది అనే అభిప్రాయానికి వచ్చారని అన్నారు. ఇక అప్పులు గురించి కూడా మాట్లాడుతూ, మీ ప్రభుత్వం అప్పులు చేస్తుందా లేదా ? పుట్టబోయే మీ పిల్లల పేరిట కూడా అప్పు పెట్టేంత అప్పులు చేసారని దారుణంగా విమర్శించారు. అలాగే ప్రభుత్వాలు కక్షలతో వ్యవహరించకూడదని, ప్రత్యర్ధులతో కూడా ప్రేమగా ఉండాలని అనిల్ కుమార్ అన్నారు. ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తకపోయినా, వైసీపీ పేరు ఎత్తకపోయినా, ప్రభుత్వం ప్రభుత్వం అంటూ, తాను చెప్పాలని అనుకున్నది మొత్తం చెప్పేసారు. గతంలో జగన్ గెలుపుకు, బ్రదర్ అనిల్ ప్రసంగాలు కూడా ఉపయోగపడ్డాయని విశ్లేషకులు చెప్తూ ఉంటారు, తనకు ఉన్న పాస్టర్ నెట్వర్క్ ద్వారా అయన జగన్ గెలుపుకి సహకరించారు. ఇప్పుడు మాత్రం, నెమ్మదిగా జగన్ పాలన పై వ్యతిరేకంగా మాట్లాడుతూ, ప్రసంగాలు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read