పాక్‌ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చి బాంబులు జారవిడిచి వెళ్లాయి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది. పాక్‌ యుద్ధవిమానాల కదలికలపై ముందు నుంచే ఒక కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది. భారత్‌కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకొనేందుకు వెళ్లాయి. భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాక్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ వెల్లడించారు. పాక్‌ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

army 26022019 2

వీటిలో ఒక విమానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్‌లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రవీకరించాల్సి ఉంది. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ సైన్యానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీటైన జవాబిస్తోంది. పాక్ యుద్ధ విమానాలపై వైమానికి దళం ఎదురుదాడికి దిగింది. ఈ దాడుల్లో పాక్‌కు చెందిన ఎఫ్ - 16 యుద్ధ విమానం నేల కూలింది. లాంబ్ లోయలో నేలకూలినట్టు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. అయితే కొంతమంది పైలట్లు ప్యారాచూట్ ద్వారా తప్పించుకున్నారని తెలుస్తోంది.

army 26022019 3

బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు పాక్ యుద్ధ విమానాలు.. ఇటు భారత వైమానిక దళం హోరాహోరిగా పోరాడుతున్నాయి. భారత్ భూభాగంలో పాక్ దాడుల నేపథ్యంలో.. పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా తిప్పి కొట్టేందుకు సైన్యం సిద్ధమవుతోంది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించింది. ఇక్కడి ఎయిర్ పోర్టులలో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేనకు చెందిన విమానాలు, ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్‌ను కేంద్రం సిద్ధం చేసింది. యుద్ధానికి సర్వం సిద్ధమన్నట్టుగా సంకేతాలు ఇస్తోంది. మరోవైపు అమృత్‌సర్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం ఎయిర్ పోర్టును మూసివేసినట్టు ఎయిర్ పోర్టు అధికారి ఏపీ ఆచార్య ఓ ప్రకటనలో తెలిపారు.

గత కొంత కాలంగా వైసీపీ పార్టీ ఒక దరిద్రమైన గేమ్ మొదలు పెట్టింది. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న ప్రత్యర్ధి పార్టీల వారిని కేసీఆర్ ద్వారా బెదిరించి, తమ పార్టీలో చేర్చుకుని, చంద్రబాబు పై విమర్శలు చెయ్యటం, అలాగే సోషల్ మీడియాలో బలంగా ఉన్న రాజకీయ నాయకుల పై తప్పుడు ప్రచారం, మైండ్ గేమ్ ఆడటం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ఇవి ఎక్కువై పోతున్నాయి. దాదపుగా అందరి నాయకుల పై, వైసీపీ పైడ్ బ్యాచ్, ప్రశాంత్ కిషోర్ ఫేక్ బ్యాచ్, ఇదే ప్రచారం చేస్తుంది. ఇదే క్రమంలో, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పై గేమ్ మొదలు పెట్టింది వైసీపీ. రాధా తెలుగుదేశం పార్టీ లో చేరనుండటంతో, వంశీని లాగటానికి ట్రై చేసింది. అయితే వంశీ మాత్రం, ఈ ప్రయత్నాలను ఆదిలోనే త్రుంచేసారు.

vamsi 27022019

అయినా వైసీపీ తన తప్పుడు ప్రచారం ఆపలేదు. ఈ నెల 28న తమ పార్టీలో వంశీ చేరుతున్నాడు అంటూ హడావిడి చేస్తూ వచ్చాయి. ఈ రోజు జగన్ గృహప్రవేశ వేడుకల్లో వంశీ కూడా పాల్గుంటారు అంటూ లీకులు ఇచ్చాయి. ఆ ప్రచారం చూసి, వంశీ టీడీపీకి గుడ్‌బై చెబుతారు..! వైసీపీలో చేరతారు..? అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, దీని పై చాలా పరుష పదజాలంతో క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే వల్లభనేని. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓ చెత్త పార్టీ అని, అన్నం తినేవాడు ఎవరైనా అటువంటి పార్టీలో చేరుతారా? అని ఎమ్మెల్యే వల్లభనేనివంశీమోహన్‌ ఘాటుగా విమర్శించారు.

vamsi 27022019

ఆయన పార్టీ మారుతున్నారని, వైసీపీలో చేరబోతున్నారని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హల్‌ చేస్తుండడంతో వంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నానని మీకు ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. అయినా తెలుగుదేశం పార్టీని వీడాల్సిన అవసరం ప్రస్తుతం తనకు ఏమొచ్చిందన్నారు. ఎవరో చేస్తున్న పిచ్చి ప్రచారానికి నేనెందుకు సమాధానం చెప్పాలన్నారు. అవన్నీ ఒట్టి ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఆ చెత్త పార్టీలో ఎవరు చేరతారు... అన్నం తినేవాడు ఆ పార్టీలోకి వెళ్తారా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకమని, అహం, భేషజాలు విడనాడి ప్రతి ఒక్కరూ ఓటర్లను ప్రభావితం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. టీడీపీ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు 54 నియోజకవర్గాలకు చెందిన పరీశీలకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓ నాయకుల కార్ఖానా.. నాయకత్వ సామర్థ్యాన్ని పెంచే రాజకీయ సంస్థ.. రాజకీయ నైపుణ్యాలను పెంచే కార్యశాల అని అభివర్ణించారు. చరిత్రలో భాగం కావడమా? చరిత్ర సృష్టించటమే అనేది ప్రధానమన్నారు. నిన్న అనేది ఓ చరిత్ర అని నేడు మనం చేసేది రేపటి చరిత్ర అన్నారు. ఈరోజు పార్టీ నాయకత్వం వల్లే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ నేషన్’ టీడీపీ నినాదమన్నారు. 2019 ఎన్నికలు ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుడతాయన్నారు. ప్రజలను ప్రభావితం చేయటమే ఎన్నికల వ్యూహమన్నారు. అన్ని చోట్ల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని నిర్దేశించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తానూ ఓ అభ్యర్థినని భావిస్తేనే విజయావకాశాలు ఉంటాయన్నారు. రాజకీయాల్లో సామాజిక సమతుల్యత అత్యంత కీలకమన్నారు. ఎన్నికలు నాయకత్వ సామర్థ్యానికి రాజకీయ నైపుణ్యానికి ఓ పరీక్ష లాంటివన్నారు.

నాయకుల మధ్య విభేదాలు, అంతరాలు తొలగించుకుని ప్రజలతో మమేకం కావాలన్నారు. సమయం ఉందని స్తబ్దతు వహిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. సానుకూల ఫలితాల సాధనే అందరి ధ్యేయమన్నారు. టీడీపీ ఓ అద్భుత బృందమనే భావన అందరిలో కలగాలన్నారు. రాజకీయాల్లో పొరపాట్లకు స్థానం లేదని చెప్తూ ఏ చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పార్టీ కోసం అస్తులు అమ్ముకుని అన్నీ వదిలేసుకుని వచ్చిన వారి త్యాగాలే పునాదులన్నారు. ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లో వ్యవస్థల నిర్మాణం జరగాలన్నారు. తనతో సహా అంతా వ్యవస్థకు బద్ధులై ఉండాలన్నారు. నాకు కావాల్సింది అద్భుతమైన బృందం.. రాగద్వేషాలకు అతీతంగా నా నిర్ణయాలు ఉంటాయి.. ప్రతి ఎన్నిక మనందరికీ ఓ పాఠ్యాంశం.. నిరంతరం మనం నేర్చుకోవాల్సి ఉందని హితోపదేశం చేశారు. ఐదు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నదాత- సుఖీభవ, పసుపు- కుంకుమ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ముఖ్యమంత్రి యువనేస్తం, ఎన్టీఆర్ వైద్యసేవతో పేదవర్గాలను ఆదుకుంటున్నామని తెలిపారు.

రూ 30వేల కోట్లతో మూడు పథకాలు, పసుపు- కుంకుమ కింద రూ 10వేల కోట్లు, పింఛన్ల కింద 12వేల కోట్లు, అన్నదాత- సుఖీభవకు రూ 8వేల కోట్లు, 5లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద రూ. 2వేల చొప్పున అందిస్తున్నామని, ఎన్టీఆర్ వైద్య సేవ ఖర్చులను రూ. 5లక్షలకు పెంచామని వీటన్నింటినీ ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమర్థులనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని ప్రకటించారు. సామర్థ్యం, ప్రజాదరణ, గెలుపు అవకాశాలే ప్రామాణికమని చెప్తూ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 55వేల మంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. నేటి అంచనాలే రేపటి వాస్తవికత అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అదనంగా వస్తాయి? నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పెరుగుతాయనే అంశాలను పరిశీలన జరుపుతూ నియోజకవర్గం, గ్రామం, వార్డులలో వచ్చే ఓట్లను అంచనా వేయాలని నిర్దేశించారు. ప్రతి నాయకుడి పనితీరును బేరీజు వేస్తామని ప్రజాదరణను ఓట్లుగా మలచుకోవాలని సూచించారు. పనితీరును బట్టే భవిష్యత్‌లో గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు 200 మందిని ఎంపిక చేస్తామని, మరో 200 మందికి నియోజకవర్గాల్లో గుర్తింపులో భాగంగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులలో పదవులలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం సమీక్షా సమావేశానికి టీడీపీ అధిష్టానం సరికొత్త పంథాను అనుసరించింది. ఇప్పటివరకు జరిగిన సమీక్షలకు అతీతంగా అసెంబ్లీ నియోజకవర్గాలలోని క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. అదే సమయంలో ముఖ్యమైన నాయకులు ముందుగా మాగుంటతో భేటీ కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ముందుగా మాగుంటతో భేటీ అయిన తర్వాతే సమీక్షా సమావేశానికి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం వ్యవహారం అనంతరం తిరిగి రాత్రి 10గంటల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో ముఖాముఖి భేటి కార్యక్రమానికి సీఎం ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాగుంటతో మంత్రులు, పార్టీ నాయకులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ఒంగోలు లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా మాగుంట పేరుని ముందుగానే చంద్రబాబు ప్రకటించటం, ఆ తర్వాత ఆయన ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై ఆవేదన చెందుతూ సీఎంకి ఫిర్యాదులు చేయటం, అదే సమయంలో మాగుంట తమ పార్టీలోకి వస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేయటం తెలిసిందే.

దీనికి తోడు టీడీపీలోనే ఉంటూ పోటీకి దూరంగా ఉండే ఆలోచన కూడా మాగుంట చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇంకోవైపు ఒంగోలు కాకుంటే నెల్లూరు నుంచైనా మాగుంటను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబుని కలిసిన మాగుంట ముఖ్యమంత్రితో భేటీ వివరాలను వెల్లడించకపోగా తన రాజకీయ వైఖరిపై కూడా విస్పష్టమైన ప్రకటన చేయలేదు. పైగా మీడియాకు 28వ తేదీ తర్వాత అందుబాటులోకి వస్తానంటూ సంకేతమిచ్చారు. దీంతో మాగుంట పయనంపై తీవ్రమైన చర్చ ఆరంభమైంది. తెలుగుదేశం నేతలు పలువురు ఆయన వద్దకు చేరి టీడీపీ నుంచే పోటీ చేయండి, ఖచ్చితంగా గెలుస్తారంటూ భరోసా నివ్వటం ప్రారంభించారు.

ఆయన రాకకు అనుగుణంగా ఈ సమీక్షా సమావేశాన్ని కూడా రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు సోమవారం సమావేశానికి మాగుంట హాజరుకావటంతో నాయకులు కొంతమేరకు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన సూచనకు అనుగుణంగానే సమీక్షా సమావేశానికి శ్రీకారం పలికారు. అలాగే తొలుత ఇన్‌ఛార్జ్‌ మంత్రి నారాయణ , జిల్లామంత్రి శిద్దా, మరోమంత్రి పరిటాల, నిన్న మొన్నటి వరకు ఒంగోలు లోక్‌సభ పార్టీ పరిశీలకునిగా ఉన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రస్తుత పరిశీలకుడు దివి శివరాం భేటి అయ్యారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన అధికారిక పనులు పూర్తి చేసుకుని సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందుగా మాగుంటతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఆ తర్వాతే ఆయన నియోజకవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర నాయకులు, ఏరియా కో ఆర్డినేటర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించి ప్రసంగించారు.

Advertisements

Latest Articles

Most Read