ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ రాలేదు... ఎన్నికల తేదీలు ఎప్పుడో తెలీదు! కానీ... ఇప్పుడే ప్రచార భేరీ మోగింది. తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆ వెంటనే వారు ప్రచార బరిలోకి దిగుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి షబానా అభ్యర్థిత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో... ఆదివారం ఆమె నగరంలో ప్రచారాన్ని ప్రారంభించేశారు. జిల్లా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఈ ప్రచార ప్రారంభ కార్యక్రమానికి హాజరై ఆమె అభ్యర్థిత్వానికి అధికార ముద్ర వేసేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో మోగిన ప్రచార భేరీకి ఇదొక ఉదాహరణ! అలాగే అనేక మంది అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు.

vij 26022019 1

గతానికి భిన్నంగా... టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు సుదీర్ఘంగా జరుగుతుంది. ఇతర పార్టీల అభ్యర్థులు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు వంటివన్నీ బేరీజు వేసుకొని ఆచితూచి అభ్యర్థులను ఖరారు చేస్తుంటారు. నామినేషన్ల దాఖలు మొదలైన తర్వాతే అభ్యర్థుల జాబితాలు వెలువడడం ఆ పార్టీలో ఆనవాయితీ. కానీ, ఈసారి అందుకు భిన్నంగా పార్టీ అధినేత చంద్రబాబు బాగా ముందే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆయన వేగం చూసి ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఏ వివాదాలూ లేకుండా అంతా బాగానే ఉందనుకొన్న వారికి పార్టీ అంతర్గత సమావేశాల్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. మీడియాకు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో పది సీట్లకు అభ్యర్థులను ఆయన ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ముందే ఖరారు చేయడం ఆ పార్టీలో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ను విరమింపచేసి ఆయన కుమార్తెకు ఆ సీటిచ్చారు.

vij 26022019 1

ప్రవాసాంధ్రురాలైన ఆమె రాజకీయాల్లో చేరేందుకు ఇక్కడకు తిరిగి వచ్చేశారు. నందిగామకు తిరిగి టికెట్‌ పొందిన సిటింగ్‌ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. విజయవాడ నగర ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బొండా ఉమా మహేశ్వరరావు చాలా రోజుల నుంచే విస్తృతంగా తిరుగుతున్నారు. ఇప్పుడు వారి తరఫున ప్రచార బృందాలు రంగంలోకి దిగాయి. పెనమలూరు, గన్నవరం ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, వల్లభనేని వంశీ కూడా ప్రచారం మొదలుపెట్టేశారు. కడప జిల్లాలో రాయచోటి అభ్యర్థి రమేశ్‌ కుమార్‌ రెడ్డి, రాజంపేట అభ్యర్థి చెంగల్రాయుడు కూడా ప్రచారం ప్రారంభించారు. మైదుకూరు అభ్యర్థిగా ఖరారైన టీటీడీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ మంచి ముహూర్తం చూసుకొని రెండు మూడు రోజుల్లో ప్రచారం మొదలు పెట్టబోతున్నారు.

 

 

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది. భారత వైమానిక బృందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌, పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలోని పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖావా ప్రావిన్సులోని బాలకట్ పట్టణం వద్ద ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసినట్లు సమాచారం.

army 26022019 2

ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. 2016లోనూ ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి అనంతరం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. బాలాకోట్, చాకోటి, ముజఫ్పరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతకు ముందు భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిందని.. పాకిస్థాన్ ఎయిర్‌‌ఫోర్స్ తక్షణమే తిప్పికొట్టడంతో వెనుదిరిగిందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి, మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్ సెక్టార్‌లో భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు ప్రవేశించాయనేది ఆసిఫ్ ఆరోపించారు.

army 26022019 3

పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకు పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ గతంలో విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది. 2016 సెప్టెంబర్‌ 29న నియంత్రణ రేఖను దాటి ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది. మరో పక్క, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసిన భారత వాయుసేనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసిన పైలెట్లకు శాల్యూట్ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం మామూలే. కానీ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తమ పార్టీ ఓట్లను తొలగించారని అధికార పార్టీ ఎమ్మెల్యే ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టే, కేసీఆర్, జగన్,మోడీ కలిసి తెలుగుదేశం ఓట్లు తొలగింపు చేస్తారని, తెలంగాణాలో లాగా, చేస్తారనే అనుమానాలు నిజం అయ్యాయి. ఆధారాలతో సహా దొరికిపోయారు. పొన్నూరు నియోజకవర్గంలో ఈ నెల 23, 24 తేదీలలో 5 వేల ఓట్లను తొలగించేలా వైసిపి నాయకులు అక్రమ మార్గంలో ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

narendra 25022019

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఇచ్చిన స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా.. ఈ నెల 23, 24 తేదీల్లో పోలింగ్‌ బూత్‌లలో ఓట్ల నమోదు, తొలగింపు, బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు అందజేయవలిసి ఉండగా... వైసిపి నాయకులు కుట్రలు, కుయుక్తులతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల 5 వేల ఓట్లను తొలగించేలా ఆన్‌లైన్‌లో బల్క్‌ దరఖాస్తులు దాఖలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌, టిడిపి నాయకులతో కలిసి పొన్నూరు నియోజకవర్గ ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసేందుకు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఎన్నికల అధికారి కొండయ్య, జిల్లా కలెక్టర్‌ తో సమావేశంలో ఉండటంతో.. ఎన్నికల అధికారితో ఫోన్లో సంప్రదించి ఆయన సూచనల మేరకు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌, సూపరింటెండెంట్లకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

narendra 25022019

ఆన్‌లైన్‌లో ఒకే ఐపి అడ్రస్‌ తో దాఖలు చేసిన బల్క్‌, ఇన్‌ బల్క్‌ దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోకూడదని టిడిపి నేతలు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. సాముహిక ఓట్ల తొలగింపుకు పాల్పడిన దోషులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. బూత్ లెవెల్ అధికారులకు వైసీపీ నాయకులు ఒక్క దరఖాస్తు చేయలేదు కానీ, సుమారు ఐదు వేల ఓట్లను తీసివేయాలని కోరుతూ ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారని ఆరోపించారు. ఎవరి పేరు మీద అయితే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయో వారిని విచారిస్తే, అసలు, తాము దరఖాస్తు చేయలేదని చెప్పారని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఓట్లు తొలగించాలన్న కుట్రలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై ధూళిపాళ్ల మండిపడ్డారు.

దేశంలోనే నాలుగో అతి పెద్ద సర్వీసెస్ కంపెనీ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ఆంద్రప్రదేశ్ లో తన బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే... అమరావతి రాజధాని ప్రాంతంలో, గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన ఇప్పటికే హిందుస్థాన్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) కు ప్రభుత్వం భూమి కూడా అప్పగించింది, శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టారు. తాత్కాలికంగా మేధా టవర్స్ లో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టులో హెచ్‌సీఎల్‌ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో ఈ నూతన భవంతుల్ని నిర్మించనున్నారు.

hcl 26022019 2

హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే హెచ్‌సీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. మారో పక్క శాశ్వత భవనాలు కోసం, కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి. 2019 చివరి నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది...

hcl 26022019 3

ఇది ఇలా ఉండగానే, హెచ్‌సీఎల్‌ అప్పుడే గన్నవరంలో నిర్మించే కంపనీలో ఉద్యోగాల ప్రకటనలు కూడా ఇచ్చింది.. ఇంజనీరింగ్, MCA చదివిన వారికి అర్హతగా, ఉద్యోగాల ప్రకటన ఇచ్చింది... ముఖ్యంగా గన్నవరంలో కంపెనీ సిద్ధం అయ్యే లోపు, కావలసిన వారిని తీసుకుని, ఇప్పటి నుంచే వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.. ఫ్రెషేర్స్ తో పాటు, ఎక్స్పీరియన్స్ కాండిడేట్ లకు కూడా ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చింది... పూర్తీ వివరాలు పైన ఉన్న ఇమేజ్ లో చూడవచ్చు. మార్చ్ 2 వ తేదిన, కానూరు సిద్ధార్థా ఇంజనీరింగ్ కాలేజీ లో , ఇంటర్వ్యూ లు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూ లు జరుగుతాయి.

Advertisements

Latest Articles

Most Read