జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన అవినీతి, అతని పై ఉన్న కేసులు, వీటి అన్నిటి నుంచి, జగన్ ను రక్షించాలి అంటే, ఎవరి తరం కాదు. కొన్ని రోజులు లేట్ చెయ్యచ్చు ఏమో కాని, ఎదో ఒక రోజు, జగన్ కచ్చితంగా జైలుకి వెళ్తాడు. అతన్ని రక్షించటం ఎవరి వల్లా కాదు అని, నిన్న హైకోర్ట్ వ్యాఖ్యలు చూస్తే అర్ధమువ్తుంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెన్నా గ్రూపు కంపెనీలకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తమపై సీబీఐ కేసులను కొట్టివేయాలంటూ పెన్నా గ్రూపు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అయితే ప్రతాప్‌రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 12 కింద నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఐపీసీ సెక్షన్‌ 120బి, 420 కింద విచారణ చేపట్టడానికి సీబీఐ కోర్టుకు అనుమతించింది. పెన్నా గ్రూపు ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డితోపాటు పెన్నా సిమెంట్స్‌, పి.ఆర్‌.ఎనర్జీ హోల్డింగ్స్‌, పయనీర్‌ హోల్డింగ్స్‌, పెన్నా తాండూర్‌ సిమెంట్స్‌లు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి పిటిషనర్ల వాదనలు, ప్రాసిక్యూషన్‌ అభియోగాలపై కూలంకషంగా చర్చిస్తూ 158 పేజీల తీర్పును వెలువరించారు.

court 27012019

ఈ నేపధ్యంలో కోర్ట్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది... రాజకీయ అవినీతి క్యాన్సర్‌లా విస్తరిస్తోంది. ఇది సగటు మనిషికి ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. ప్రజలందరికీ చెందాల్సిన భూములను, సున్నపురాయి గనుల వంటి ప్రకృతి సంపదను ప్రభుత్వాలే ఇష్టానుసారం కట్టబెట్టడం.. ఇందుకోసం నిషేధ చట్టాన్ని అతిక్రమించడం.. వీటి వెనుక పెద్ద ఎత్తున నిధులు చేతులు మారడం.. అలా మారిన సొమ్ము ఏ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నిర్ణయాలు జరిగాయో అదే ముఖ్యమంత్రి కొడుకు కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిరావడం.. ఇవన్నీ సమాజానికి, ప్రజాస్వామ్యానికి, ప్రతిభకు తీవ్ర హానికరమైన అంశాలు. వీటిని సాధారణ నేరాలుగా చూడలేం. న్యాయస్థానం వీటిని ప్రత్యేక సామాజిక దృక్కోణంలో చూడాల్సి ఉంది. ముఖ్యమైన మౌలిక వసతుల కోసం ఉపయోగపడాల్సిన జాతీయ సంపద పెడదారిన పడితే తరాలకొద్దీ యువత తన మేధస్సుకు పనిపెట్టే అవకాశాన్ని కోల్పోతుంది. ఇలాంటి వాతావరణం పెట్టుబడులు రావడానికిగానీ, ఉద్యోగాల సృష్టికిగానీ ఉపయోగపడబోదు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది." అంటూ కోర్ట్ వ్యాఖ్యానించింది.

court 27012019

తీర్పులో ముఖ్యమైన అంశాలు... * చట్ట ప్రక్రియ దుర్వినియోగమైనపుడు మాత్రమే హైకోర్టులు తమ ప్రత్యేక అధికారాలను వినియోగించాల్సి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక్కడ పేర్కొన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక అధికారాలతో కేసును కొట్టివేయలేం. * పెన్నా సిమెంట్స్‌కు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల కేటాయింపు చట్టప్రకారం జరగలేదు. భూలబ్ధిదారుల నుంచి భూమిని సేకరించడానికి వచ్చే అడ్డంకులను అధిగమించడానికి ఇలా చట్టానికి తెలియని విధానాన్ని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రతాప్‌రెడ్డి అనుసరించారు. * ప్రతాప్‌రెడ్డి, ఆయన కంపెనీలు అసైన్డ్‌ లబ్ధిదారులను ప్రలోభపెట్టి వారిని భూముల్లేని పేదలను చేశారు. చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములను బదలాయించడానికి వీల్లేదు. అయితే నలుగురు లబ్ధిదారుల నుంచి ప్రతాప్‌రెడ్డి విక్రయ దస్తావేజులను పొందారు. ఇది అసైన్డ్‌ చట్టానికి విరుద్ధమే. * కేటాయింపుల తరువాత జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయంటే ‘నీకది నాకిది’ (క్విడ్‌ప్రోకో)లో భాగమే. దురుద్దేశంతో జరిగినందున చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంది. సేకరణ : ఈనాడు

సంక్రాంతి పండగ ముగిసింది. అసలుసిసలైన ఎన్నికల పండగ రాబోతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించేందుకు ‘సైకిల్‌’కు ఒకింత మరమ్మతులు చేపట్టబోతున్నారు. గడచిన ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 14 స్థానాల్లో దూసుకుపోయిన విజయాన్ని మళ్ళీ అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రస్తుత సిట్టింగ్‌ల జాతకాలు కొన్నింటిని త్వరలోనే మార్చబోతుంది. అరడజనుకు తగ్గకుండా సిట్టింగ్‌ల స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీలో ఊహాగానాలు. సగానికి సగం రాజకీయ మార్పులు ఉండకపోవచ్చంటూ మరికొందరి వాదన. కాని ఈసారి కూడా ప్రజా మద్దతుతో అధికార పగ్గాలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి అభిప్రాయాలను టీడీపీ సేకరిస్తోంది.

tdp 26012019 11

ఇప్పటివరకు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా దఫాల వారీగా, నియోజకవర్గాల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ నివేదికలు అధిష్ఠానం వద్ద సిద్ధంగా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని.. తమకు కొత్తగా దరఖాస్తు చేసుకుని, ఆర్థికంగా, సామాజికంగా స్థోమత కలిగిన వారి వివరాలను క్రోడీకరించి త్వరలోనే మరోమారు అభిప్రాయ సేకరణకు దిగబోతుంది. దాదాపు సగానికి సగం స్థానాలను త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. సీనియర్లు, వరుస విజయాలను అందుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. రెండు ఎంపీ స్థానాల్లో నరసాపురానికి కనుమూరి రఘురామకృష్ణంరాజు అభ్యర్థిగా ఇప్పటికే తెలుగుదేశం రంగంలోకి దింపింది.

tdp 26012019 11

ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి మరోమారు సిట్టింగ్‌ ఎంపీ మాగంటి బాబుకు అవకాశం ఇస్తారా.. లేదా కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతారా అనేది త్వరలో తేలబోతుంది. ఎంపీ మాగంటి బాబుకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే బోళ్ళ రాజీవ్‌ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు పితాని సత్యనారాయణ, కె.ఎస్‌.జవహర్‌ల విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. వీరిద్దరూ ఆచంట, కొవ్వూరు నుంచే తిరిగి పోటీకి సన్నద్ధంగా ఉన్నారు. ‘ఎవరో ఏదో అంటారు. నేను మాత్రం ఆచంట నుంచే పోటీ చేస్తా. ఈ విషయంలో మరో మాటలేదు. ఎవరో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. అంతకంటే మించి సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌లలో వచ్చేవన్నీ అభూతకల్పనలే. ఇక్కడ ఉన్నదంతా నా శ్రేయోభిలాషులు, నన్ను నమ్మిన కార్యకర్తలు. వారి కోసమే శ్రమిస్తా’ ఆచంట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పితాని తన వైఖరిని స్పష్టం చేశారు.

కేసీఆర్ - జగన్ కలవటం ఏంటి, నాకు రాయబారం పంపటం ఏంటి అంటూ, వారం క్రితం పవన్ మాట్లాడిన మాటలు గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ తో కలిసి ముచ్చట్లు, నవ్వులు, పువ్వులు పూయించారు. కలిసినప్పుడు మాట్లాడుకోవటం వేరు కాని, వీరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే మాత్రం, వీళ్ళు మాట్లాడే మాటలకి, చేసే చేతలకి పొంతన లేదు అనిపిస్తుంది. ఈ అరుదైన కలయిక, గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.

pk 26012019 2

అటు సీఎం.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కాసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇలా కేటీఆర్‌‌తో.. కేసీఆర్‌ ఇద్దరితో సుమారు అరగంటకు పైగా పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ వర్గాలు మాత్రం, చంద్రబాబుకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పై, దాంట్లో పవన్ పాత్ర పై చర్చించారేమో అని గుసగుసలాడుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో తెరాస.. వైకాపా ఒక్కటయ్యాయని తెదేపా విమర్శించింది. తెరాస.. వైకాపా కలయికను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తప్పుబట్టారు.

pk 26012019 3

సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి వెళ్లిన పవన్‌... పెదరావూరు సభలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... తెరాసను దెబ్బతీసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తెరాస నేతలు అడ్డుకున్నారు. తెలంగాణలో జగన్‌ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన నేతలే ఇప్పడు ఆయనకు సపోర్టు చేస్తున్నారు అని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. కానీ, ఆ తర్వాత ఎప్పుడూ దానిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు పవన్‌ కల్యాణ్ కేసీఆర్‌, కేటీఆర్‌తో చాలాసేపు మాట్లాడటం చర్చనీయాంశమైంది. పవన్‌ కల్యాణ్‌‌ వారిద్దరితో ఏం మాట్లాడి ఉంటారనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విందుకు చంద్రబాబు హాజరుకాలేదు.

గడిచిన నాలుగున్నరేండ్లలో దేశ రుణ భారం దాదాపు 50 శాతం పెరిగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కారు పాలనలో దేశానికున్న రుణ భారం రూ.82 లక్షల కోట్లను దాటిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అప్పులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాం కాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎనిమిదో ఎడిషన్‌ స్టేటస్‌ పేపర్‌ ప్రకారం గతేడాది సెప్టెంబర్‌ నాటికి మొత్తం కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.82,03,253 కోట్లను చేరుకున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన జూన్‌ 2014 లో రూ.54,90,763 కోట్లు గానే ఉన్నాయి. దీంతో మోదీ హయాంలో సర్కారీ రుణాలు మరో రూ.27,12,490 కోట్లు పెరిగా యన్న మాట. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తా నన్న నమో.. అప్పుల సేకరణకున్న ఏ అవకా శాన్నీ విడిచిపెట్టకపోవడం గమనార్హం. కేం ద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి రాక ముందు గోల్డ్‌ బాండ్ల ద్వారా సవిూకరించిన రుణాలేవిూ లేవు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో అందుకున్న అప్పుల విలువ రూ.9,089 కోట్లుగా ఉన్నది. ఇక మార్కెట్‌ ఆధారిత రుణాలూ గతంతో పోల్చితే 47.5 శాతం పెరిగి రూ.52 లక్షల కోట్లకుపైగా పేరుకుపోయాయి.

modiappu 26012019

ద్రవ్యలోటు లక్ష్యాలకు దెబ్బ.. ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం తారాస్థాయికి చేరుతుండటంతో ద్రవ్య లోటు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతుండటంతో పాలనా పరమైన నిర్వహణలో భాగంగాప్రభుత్వం అప్పుల బాట పడుతున్నది. ముఖ్యంగా ఎన్నికలు సవిూపిస్తుండటంతో ఓట ర్లను ఆకట్టుకోవడంలో భాగంగా సంక్షేమ పథ కాల కేటాయింపులను పెంచుతుండటం కూడా ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19)గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ద్రవ్యలో టును దేశ జీడీపీలో 3.3 శాతానికి (రూ.6.24 లక్షల కోట్లు) కట్టడి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2017-18)లో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేశారు. అయితే గతేడాది నవంబర్‌తో ముగిసిన ఎనిమిది నెలల కాలంలోనే ద్రవ్య లోటు రూ.7.17 లక్షల కోట్లకు చేరింది. ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే 114.8 శాతంగా నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నది.

modiappu 26012019

నెరవేరని పెట్టుబడుల ఉపసంహరణ... ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఖజానాకు రూ.80,000 కోట్ల నిధులను తరలించాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇప్పటిదాకా రూ.34,000 కోట్లకుపైగానే సవిూకరించింది. ఓ వైపు పెరుగుతున్న రుణ భారం.. మరోవైపు నెరవేరని పెట్టుబడుల ఉప సంహరణ లక్ష్యం.. ఇంకోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తదితర మార్గాల ద్వారా పడిపో తున్న ఆదాయం.. మోడీ సర్కారుపై ముప్పేట దాడినే చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం.. ఆర్బీఐ మిగులు నిల్వలపై కన్నేసింది. ఆ సొమ్ముతో పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఏర్పడిన ఇబ్బందులనే గాక, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కలిగిన సమస్యలనూ అధిగమించవచ్చునని భావించింది. అది కుదురకపోవడంతో ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను మోదీ సర్కారు కోరుతున్న విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read