ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా, సర్వేలు రావటం అనేది సహజం. అయితే మన రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అనూహ్యంగా, జాతీయ మీడియాలో కూడా, మన రాష్ట్రం గురించి సర్వేలు వెయ్యటం ప్రారంభం అయ్యాయి. ఇలాంటివి ఇది వరకు ఎన్నికలప్పుడు మాత్రమే జాతీయ మీడియా వేసిది. అయితే జగన్ మాత్రం, తనకు తెలిసిన విద్యలతో, జాతీయ మీడియాతో టై అప్ అయ్యి, సంవత్సరం ముందు నుంచి హడావిడి చేస్తూ, జగన్ గెలిచిపోతున్నాడు అంటూ ఆ సర్వేలు వేయించుకుంటాడు. అదే తీసుకవచ్చి, తన పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ గా వేసుకుని, తాను ఆనంద పడుతూ, తన అభిమనాలుని ఆనంద పరుస్తాడు.

republic 25012019

ఈ కోవలోనే, నిన్న ఒక సర్వే వచ్చింది. అందులో, జగన్ గెలిచిపోతున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ, ఆ సర్వే ఊదరగొట్టింది. జగన్ మోహన్ రెడ్డికి 19 ఎంపీ సీట్లు, చంద్రబాబుకి కేవలం 6 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అంట. ఇదే విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జరిపించడం జగన్‌ కు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి దొంగ సర్వేలతో ప్రజల మనసును మార్చలేరని, 2014 ఎన్నికల సమయంలోనూ ఇటువంటి సర్వేలనే చేయించారని, కానీ తెలుగుదేశం పార్టీనే ప్రజలు ఎంచుకున్నారని గుర్తు చేశారు. జగన్ లోని అహంభావాన్ని భరించలేకనే పలువురు నేతలు వైకాపాకు దూరం అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

republic 25012019

కేంద్ర రాష్ట్రానికి రూ.85వేల కోట్లు ఇవ్వాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కమిటీ తేల్చితే.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జేఎఫ్‌సీ రూ. 75 వేల కోట్లు ఇవ్వాలని పేర్కొందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని, పార్లమెంటులో 15 పార్టీలు కేంద్రాన్ని నిలదీశాయన్నారు. ఈ విషయంలో వైకాపా, భాజపాకి మాత్రం బాధ్యత లేదని.. రాబోయే ఎన్నికల్లో ఇరుపార్టీలకు గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి నేతలతో చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలని.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్లు సీఎం చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అన్ని పార్టీలూ డిమాండ్‌ చేస్తున్నా భాజపా, వైకాపాలకు మాత్రం బాధ్యత లేకుండాపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు.

జగన్ బాధితుల జాబితాలో మరో వికెట్ చేరింది. వంగవీటి రాధా తాను జగన్ విషయంలో ఎన్ని బాధలు పడ్డానో చెప్పిన విషయం మరవక ముందే, ఇప్పుడు మరో నేత జగన్ పెట్టిన టార్చర్ గురించి చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఎంత చెప్పినా, ఏం చెప్పినా లాభం లేదని, అందువల్లే ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు, ప్రిన్స్ మహేశ్ బాబు బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. నిన్న చంద్రబాబుతో చర్చలు జరిపిన తరువాత, ఆయన ఓ పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ అధినేతది ఒంటెద్దు పోకడ అనీ, నేతల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వరని అన్నారు. వైసీపీలో విధానాలు, ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు నచ్చలేదని, గడచిన ఏడాదిగా ఎన్నో సూచనలు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు.

ghattamaneni 25012019 2

ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి దూరంగా ఉండరాదని తాను చెప్పినా జగన్ వినలేదని, ప్రతిపక్షంగా వైసీపీ సరైన పాత్ర పోషించలేదని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రానికి హోదా విషయంలోనూ వైసీపీ ఏమీ సాధించలేదని అన్నారు. జరిగిన పరిణామాలు తనకెంతో మనస్తాపం కలిగించాయని, సమస్యల గురించి ఎప్పటికప్పుడు జగన్‌ కు చెబుతూనే ఉన్నానని, 'సరే చూద్దామన్నా' అన్న మాట తప్ప మరో మాట రాలేదని, జనం నన్ను చూసి ఓటేస్తారు అన్నట్టుగా జగన్ ఉన్నారని విమర్శించారు.

ghattamaneni 25012019 3

తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, టీడీపీలో చేరాలని ఇప్పటికిప్పుడు తొందరపడటం లేదని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. నిన్న చంద్రబాబును కలిసినప్పుడు కూడా ఈ విషయమై ఎటువంటి చర్చలనూ తాను జరపలేదని అన్నారు. వచ్చే నెల తొలివారంలో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తన సోదరుడు కృష్ణ అనుమతి లేకుండా మాత్రం ఎటువంటి పని చేయబోనని స్పష్టం చేశారు. మహేశ్‌ కు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండమనే సలహా ఇస్తున్నానని అన్నారు. తాను రాజ‌కీయప‌రంగా ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌న అన్న కృష్ణకు పూర్తి స‌మాచారం తెలిపి ఆ త‌రువాత తుది నిర్ణ‌యం తీసుకుంటాన‌ని, మ‌హేశ్ బాబు ఫ్యాన్స్‌తో మాట్లాడిన త‌రువాత త‌న నిర్ణ‌యాన్ని చెప్తాన‌న్నారు.

విశాఖ మన్యంలో నెలకొన్న అంశాతికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణమని,ప్రశాంతంగా ఉన్న మన్యంలో అజ్యంపోసి తన తండ్రి, సోమ మృతికి కారణమ్యయ్యారని మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. పాడేరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. విశాఖలో జెడ్పీ సమావేశ వేదిక వద్ద మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావులను కోల్పోవడానికి సీఎం చంద్రబాబు కంటే పవన్ కల్యాణే బాధ్యత వహించాలన్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పతే కనీసం పరామర్మకు రాలేని మీరా మన్యం గిరిజనుల గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.

kidari 25012019

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాక్సైట్ తవ్వకాల జీవోను నిలిపివేశారని, మా నాన్న బతికి ఉన్న సమయంలో కూడా బాక్సైట్‌కు వ్యతిరేకంగానే గళమెత్తారన్నారు. ఏజెన్సీలో నిరుద్యోగులకు జాబ్‌మేళా, యువ శిక్షణ, నిరుద్యోగ భృతి అందించి గిరిజన యువతి పక్కదారి పట్టకుండా చూస్తున్నామన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవన్ కల్యాణ్ లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని గిరిజనులంతా గుర్తించాలని కోరారు. ఎన్నికల వేళ బాక్సైట్ విషయాన్ని గుర్తు చేసి గిరిజనులను రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, టీడీపీ హయాంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరపబోమని మంత్రి శ్రావణ్‌కుమార్ స్పష్టం చేశారు.

kidari 25012019

ఇక బాక్సైట్ తవ్వకాలపై చాలా పోరాటం చేశామని శ్రవణ్ ఎండను సైతం లెక్కచేయకుండా బాక్సైట్ మైనింగ్ అడ్డుకున్నామని గుర్తు చేశారు. మన్యం ప్రాంతంలో మైనింగ్ జరగకుండా నేటికీ పోరాడుతూనే ఉన్నామన్న శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ కు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం జనసేన ని కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపితే ఒకవేళ ఎవరైనా మైనింగ్ చేస్తే ఆ ప్రాంతానికి వెళ్లి అందరం కలిసి ధర్నా చేద్దామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతే తప్ప అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని వసతులు కల్పించి అటవీ హక్కుల ద్వారా లభించే ప్రయోజనాలు సైతం అందేలా చూడాలని మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తానికి గిరిజనుల కోసం నిన్న మాట్లాడిన ప్రతి అంశానికి క్లారిటీ ఇస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చి కిడారి పవన్ కి ధీటుగా సమాధానం చెప్పారు.

ఆంధ్రా ప్రజల వార్తలు అవసరం లేదు కానీ, మీ రాజకీయాల కోసం ఆంధ్రులు అవసరమా అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రశ్నించారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రుల వార్తలు, సమస్యలు మాకు అవసరం లేదని కేటీఆర్ మాట్లాడటం ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు మేలు చేసేందుకే మీరు ఆంధ్రావార్తలు రాయవద్దని, చదవద్దని అంటున్నారా అని ప్రశ్నించారు.

anitha 25012019

దేశ, విదేశాల్లోని వార్తలను తెలుసుకోవాలని ప్రజలందరికీ ఉంటుందని, అటువంటిది మన తోటి తెలుగు ప్రజలు ఎలా ఉన్నారో, వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడం తప్పెలా అవుతుందన్నారు. గతంలోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మీడియాపై ఆంక్షలు పెట్టి ఏ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడిందో బహిరంగ సత్యమేనన్నారు. దేశంలోనే ఆంధ్రాలో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణ ప్రజలకు తెలిస్తే తమను ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం కేటీఆర్‌కు పట్టుకుందన్నారు. ప్రతిపక్ష నాయకుడిని ఆసరాగా చేసుకుని టీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రంలో అడుగు పెడితే ఇక్కడి ప్రజలు మీకు సహకరించకపోగా, తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

anitha 25012019

మా పథకాలు కాపీ కొట్టారని కేటీఆర్ చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని, సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబుకు మరెవరూ సాటి లేరని, రారని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు తన అనుభవంతో లోటుబడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్‌వైపు తీసుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ నుండి లోటుబడ్జెట్ వైపు తీసుకెళ్లారని ఎమ్మెల్యే అనిత దుయ్యబట్టారు.

Advertisements

Latest Articles

Most Read