ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా, సర్వేలు రావటం అనేది సహజం. అయితే మన రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అనూహ్యంగా, జాతీయ మీడియాలో కూడా, మన రాష్ట్రం గురించి సర్వేలు వెయ్యటం ప్రారంభం అయ్యాయి. ఇలాంటివి ఇది వరకు ఎన్నికలప్పుడు మాత్రమే జాతీయ మీడియా వేసిది. అయితే జగన్ మాత్రం, తనకు తెలిసిన విద్యలతో, జాతీయ మీడియాతో టై అప్ అయ్యి, సంవత్సరం ముందు నుంచి హడావిడి చేస్తూ, జగన్ గెలిచిపోతున్నాడు అంటూ ఆ సర్వేలు వేయించుకుంటాడు. అదే తీసుకవచ్చి, తన పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ గా వేసుకుని, తాను ఆనంద పడుతూ, తన అభిమనాలుని ఆనంద పరుస్తాడు.
ఈ కోవలోనే, నిన్న ఒక సర్వే వచ్చింది. అందులో, జగన్ గెలిచిపోతున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ, ఆ సర్వే ఊదరగొట్టింది. జగన్ మోహన్ రెడ్డికి 19 ఎంపీ సీట్లు, చంద్రబాబుకి కేవలం 6 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అంట. ఇదే విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జరిపించడం జగన్ కు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి దొంగ సర్వేలతో ప్రజల మనసును మార్చలేరని, 2014 ఎన్నికల సమయంలోనూ ఇటువంటి సర్వేలనే చేయించారని, కానీ తెలుగుదేశం పార్టీనే ప్రజలు ఎంచుకున్నారని గుర్తు చేశారు. జగన్ లోని అహంభావాన్ని భరించలేకనే పలువురు నేతలు వైకాపాకు దూరం అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కేంద్ర రాష్ట్రానికి రూ.85వేల కోట్లు ఇవ్వాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కమిటీ తేల్చితే.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని జేఎఫ్సీ రూ. 75 వేల కోట్లు ఇవ్వాలని పేర్కొందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని, పార్లమెంటులో 15 పార్టీలు కేంద్రాన్ని నిలదీశాయన్నారు. ఈ విషయంలో వైకాపా, భాజపాకి మాత్రం బాధ్యత లేదని.. రాబోయే ఎన్నికల్లో ఇరుపార్టీలకు గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి నేతలతో చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలని.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్లు సీఎం చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్నా భాజపా, వైకాపాలకు మాత్రం బాధ్యత లేకుండాపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు.