తెలుగుదేశం పార్టీ నేత, చింతకాయల విజయ్ పై సిఐడి కేసు పెట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం, ఏపి సిఐడి అధికారులు, హైదరాబాద్ లో ఉన్న చింతకాయల విజయ్ నివాసానికి వెళ్లి, ఆయన కోసం గాలించి, చిన్న పిల్లలను భయపెట్టిన తీరు, చర్చనీయంసం అయ్యింది. అదే సందర్భంలో, చింతకాయల విజయ్, 6 తేదీ సిఐడి ఆఫీస్ కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను ఇంట్లో ఎవరూ లేకపోవటంతో, పని వాళ్ళకు ఇచ్చారు. అయితే ఈ రోజు విజయ్, సిఐడి ఆఫీస్ కు విచారణకు వస్తారా లేదా అనే చర్చ జరిగింది. అయితే 11 గంటల సమయంలో, అనూహ్యంగా విజయ్ తరుపు లాయర్లు, సిఐడి ఆఫీస్ కు చేరుకున్నారు. లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. చివరకు సాయంత్రం 5 గంటల సమయంలో, విజయ్ తరుపు న్యాయవాదులు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ క్లైంట్ విజయ్ ఒక లేఖ రాసారని, ఆ లేఖ ఇవ్వటానికి వచ్చామని, అయితే సిఐడి అధికారులు మాత్రం, తమను లోపలకు అనుమతించలేదని చెప్పారు. దీంతో ఆ లేఖను తప్పాల్‌లో ఇచ్చి వచ్చేసినట్టు చెప్పారు. ఆ లేఖలో, తన పై ఏ కేసు నమోదు అయ్యింది, ఎఫ్ఐఆర్ ఏంటి అనేది విజయ్ ప్రశ్నించారు. అలాగే సిఐడి అధికారులు తన నివాసంలోకి అక్రమంగా వచ్చి, తన కూతురుని భయపెట్టారని, డ్రైవర్ పై చేయి చేసుకున్నట్టు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి, ఆ నోటీస్ చెల్లదని లేఖలో రాసారు. ఇది కేవలం తనను భయపెట్టటానికి చేసిన చర్యగా లేఖలో తెలిపారు. కేసు వివరాలు ఇచ్చి, సరైన ఫార్మటులో నోటీస్ ఇస్తే, విచారణకు సహకరిస్తానని లేఖలో తెలిపారు. మరి సిఐడి ఎలా స్పందిస్తుందో చూడాలి.

గురువారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా, విలేఖరులు, కేసీఆర్ పెట్టిన పార్టీ పై తమ అభిప్రాయం చెప్పాలని కోరారు. దీని పై అశోక్ బాబు స్పందించారు. ఆయన మాటల్లోనే, "నాకు అవకాసం ఉందని, రాష్ట్ర స్థాయి పార్టీని, జాతీయ స్థాయి పార్టీగా మారుస్తా అంటే, అది జాతీయ స్థాయి పార్టీ అవ్వదు. బహుసా కేసీఆర్ గారిని, ఏ రాష్ట్రమైన స్వాగాతిస్తుందేమో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి, ఈ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసి, ఈ రోజుకీ విభజన హామీలు అవ్వకుండా చేసి, ఆంధ్రప్రదేశ్ ని సెకండ్ గ్రేడ్ స్టేట్ అన్న కేసీఆర్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ గౌరవించరు. ఆయన స్వాతంత్ర్యం ఉంది కాబట్టి, భారత దేశంలో జాతీయ పార్టీగా మార్చుకున్నారేమో కానీ, ఆ జాతీయత అనేది, ఆయనలో లేదని, మన రాష్ట్రంలో జరిగిన పరిణామాల విషయంలోనే, మనం అర్ధం చేసుకోవచ్చు. వ్యాపారంలో టచ్ లో ఉండటం వేరు, రాజకీయంగా ప్రజలతో టచ్ లో ఉండటం వేరు. కుమారస్వామి, జేడీఎస్ పార్టీ, బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తా అని చెప్పారు కానీ, ఎక్కడా జేడీఎస్ ని, బీఆర్ఎస్ లో కలిసి వేస్తాం అని చెప్పలా. జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన, అది జాతీయ పార్టీ అయిపోదు."

ashok 06102022 2

"కేసీఆర్ కి జాతీయవాదం ఉందో లేదో కానీ, నిజాయతీ అయితే లేదు. తెలంగాణా ఇస్తే, మీతో కలిపేస్తా అని కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి చెప్పారు, అలాగే దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ఇవన్నీ చూస్తే, ఆయనకు నిజయతీ ఎక్కడ ? ఆయన తెలంగాణా వాదం మీద బ్రతకగలరేమో కానీ, వేరే రకంగా మనుగడ ఉండదు. ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తుంటే, ఒక్కసారి కూడా అక్కడకు వెళ్ళలేదు. జాతీయ వాదం వేరు, జాతీయ పార్టీ వేరు." అని అశోక్ బాబు అన్నారు. ఇదే విషయం పై నిన్న టిడిపి అధినేత చంద్రబాబు ఇంద్రకీలాద్రి వచ్చిన సందర్భంలో, విలేఖరులు అడగగా, చంద్రబాబు సమాధానం చెప్పకుండా, నవ్వుతూ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు అధికార ప్రతినిధి హోదాలో, అశోక్ బాబు స్పందించారు. మరి తెలుగుదేశం పార్టీ స్పందన పై, టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతకు ముందు వైసీపీ తరుపున సజ్జల స్పందిస్తూ, తాము ఇతరుల గురించి మాట్లాడం అంటూ, తప్పించుకునే సమాధానం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలు చేసి, చంద్రబాబుని తిట్టి, హడావిడి చేసిన షర్మిల, సడన్ గా అన్నతో అలిగి, తెలంగాణా వెళ్ళిపోయారు. ఉన్నట్టు ఉండి, నేను తెలంగాణా కోడలని, వైఎస్ఆర్ బిడ్డని, జగన్ తో గొడవలు ఉన్నాయనే వాతావరణం కల్పించి, కొత్త పార్టీ పెట్టేసారు. ఇప్పటికే పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణాలో ఫైట్ మొత్తం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా నడుస్తుంటే, షర్మిల పార్టీ పుట్టుక రావటం వెనుక అనేక వాదనలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే, కొద్ది రోజుల క్రితం, ఒక రెడ్ ఫైల్ పట్టుకుని, షర్మిల గవర్నర్ ని కలిసారు. అందులో కేసీఆర్ అవినీతి భాగోతం ఉంది అంటూ, ఒక ప్రముఖ కాంట్రాక్టర్ పై విమర్శలు చేసారు. ఇప్పుడు అదే ఫైల్ పట్టుకుని, షర్మిల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరో వారం పది రోజుల్లో కేసీఆర్ పై ఫిర్యాదు ఇవ్వటానికి, షర్మిల ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా బీజేపీ వేసిన స్కెచ్ అని, షర్మిలతో ఫిర్యాదు చేపించి, సిబిఐ ఎంక్వయిరీ వేసి, కేసీఆర్ ని ఫిక్స్ చేసే వ్యూహం ఇందులో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరుకు నిజమో కానీ, షర్మిల అయితే, ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయటం మాత్రం నిజం. అక్కడ నుంచి పరిణామాలు ఎలా మారతాయో, ఈ పరిణామం తరువాత, కేసీఆర్-జగన్ మధ్య ఉన్న స్నేహం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.

కేఏ పాల్.. ఈ పేరు తెలియని దేశాల వారు ఉండరు. తెలుగు ప్రజలకే, ఈయన అంటే చులకన. ఒకప్పుడు దేశాధ్యక్షులను కంట్రోల్ చేసిన పాల్, ఇప్పుడు ఆయన చేష్టలతో సొంత రాష్ట్రంలోనే కామెడీ అయ్యారు. ప్రజా రాజ్యం పేరుతో కేఏ పాల్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేఏ పాల్ పార్టీ ఏదో కామెడీ చేస్తుంది అనుకుంటే, ఆయన తన దమ్ము ఏంటో చూపించారు. ప్రస్తుతానికి కేఏ పాల్ తెలంగాణా రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. కేఏ పాల్, రేపు జరగబోయే మునుగోడు ఉప ఎన్నిక కోసం కసరత్తు చేస్తూ, ఏకంగా ఒక కొత్త అభ్యర్ధిని దింపారు. ఆ అభ్యర్ధి ఎవరో కాదు. ప్రజాగాయకుడు గద్దర్. తన ఆట పాటలతో, తెలంగాణా సమాజంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. అలాంటి గద్దర్, ఇప్పుడు తెలంగాణా ఉప ఎన్నికలో పోటీ చేయటం, అది కూడా ప్రజా శాంతి పార్టీలో చేరి, పోటీ చేయటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. కేఏ పాల్ ని కామెడీగా తీసుకున్న వాళ్ళు, అవాక్కయ్యారు. ఇప్పుడు గద్దర్ ఎవరి ఓట్లు చీల్చుతారో అని , ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ టెన్షన్ పడుతున్నాయి. మొత్తానికి కామెడీ పండించే కేఏ పాల్, తాను సీరియస్ పొలిటీషయిన్ అనే సంకేతాలు పంపించారు.

Advertisements

Latest Articles

Most Read