ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా, విజయవాడ కృష్ణా నదీ తీరాన జరిగే దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం, ఈ రోజు రద్దు అయ్యింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం కోసం, ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో, ఆలయ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండటంతో, దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆగమ శాస్త్రం ప్రకారం, వర్షం పడుతున్నప్పుడు, ఉత్సవమూర్తులను బయటకు తీయకూడదని అర్చుకులు చెప్పటంతో, ఈ మేరకు ఉత్సవం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇన్నేళ్ళ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, 20 ఏళ్ల క్రితం ఎప్పుడో ఇలా జరిగిందని, మళ్ళీ ఇప్పుడు ఇలా దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం జరగకుండా పోయిందని చెప్తున్నారు. హంసవాహనం పై ప్రతి ఏడాది ఉత్సవ మూర్తులు జల విహారం చేస్తారు. అయితే వరద వస్తుందని నిన్నే జల విహారం రద్దు చేసారు. కేవలం కృష్ణా నది ఒడ్డున హంస వాహనంలో, స్వామి వారి కైంకర్యాలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ రోజు వర్షం పడుతూ ఉండటం, చివరకు అది కూడా రద్దు అయిపోవటంతో, భక్తులు నిరస చెందారు. 20 ఏళ్ళ తరువాత, ఇలా జరగటం పై, ప్రజలు నిరాసగా వెనుతిరిగారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీ సమేతంగా ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి, అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబుని, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మ వారికి చంద్రబాబు దంపతులు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వాదం తరువాత, చంద్రబాబు మీడియా పాయింట్ లో, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ విలేఖరులు, కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన పార్టీ పై మీ స్పందన ఏంటి అంటూ, విలేఖరులు అడగగా, చంద్రబాబు ఒక నవ్వు నవ్వి, చేతులు చూపించి, నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇక అంతకు ముందు మరో విలేఖరి, ఇంతకు ముందే, మంత్రి రోజా ఇక్కడకు వచ్చి, అమ్మ వారికి 108 కొబ్బరికాయలు కొట్టి, మూడు రాజధానులు ఉండాలని కోరుకున్నారని చంద్రబాబుతో చెప్పగా, దానికి చంద్రబాబు స్పందించారు. అమరావతి రాజధానిగా ఉండాలని, గతంలో అన్ని పక్షాలు నిర్ణయం తీసుకున్నప్పుడు, రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు తెచ్చామని, అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తెచ్చి, అందరి దేవతల ఆశీర్వాదం తీసుకున్న విషయాన్ని గుర్తు చేసారు.

cbn kcr 05102022 2

గతంలో వైసీపీ వాళ్ళు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నారని, ఇక్కడే తాము ఇళ్లు కూడా కట్టుకుంటున్నామని చెప్పారని, ఇప్పుడు రోజుకి ఒక మాట మార్చుతూ, ప్రజలను మభ్య పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాంటి వారిని దుర్గమ్మ తల్లి కూడా సహించదని చంద్రబాబు అన్నారు. ఈ దసరా సందర్భంగా, దుర్గమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. భక్తులు అందరికీ దుర్గమ్మ కరుణాకటాక్షాలు లభించలాని ఆకాంక్షించారు. నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. 150 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఆ అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం ఆపేసిందని, అవన్నీ ఈ ప్రభుత్వం కొనసాగించాలి అని చంద్రబాబు అన్నారు. ఇక చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవినేని ఉమా, ఇతర నాయకులు కూడా ఉన్నారు. ప్రజలు చంద్రబాబుకు అభివాదం చేస్తూ కనిపించారు.

వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జగన్ కు స్నేహితుడు. మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా శ్రీకాంత్ రెడ్డికి పేరు ఉంది. అలాంటి శ్రీకాంత్ రెడ్డికి, జగన్ షాక్ ఇచ్చారు. ఉన్న పదవి కూడా పీకేయటంతో, ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్ విప్ గా ఉన్నారు. ఇది క్యాబినెట్ ర్యాంక్ పదవి. అయితే జగన్ గెలిచిన వెంటనే, గడికోట శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. మంత్రి పదవి రాకపోవటంతో, శ్రీకాంత్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇచ్చి, జగన్ గౌరవించారు. తరువాత మొన్న జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో, శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే అప్పుడు కూడా శ్రీకాంత్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డికి ఉన్న చీఫ్ విప్ పదవి కూడా, జగన్ పీకేసారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి కేవలం విప్ మాత్రమే. చీఫ్ విప్ గా ముదునూరి ప్రసాదరాజును నియమించారు. మిత్రుడిగా పేరు ఉన్న శ్రీకాంత్ రెడ్డికి, జగన్ ఇలా ఎందుకు చేసారా అని, వైసీపీ శ్రేణులే విస్మయానికి గురయ్యారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈ రోజు దసరా పండుగ సందర్భంగా, కొత్త పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. తన మూల సిద్దాంతం అయిన తెలంగాణాను వదిలి పెట్టి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుతూ, ఈ రోజు ప్రకటన చేసి, జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ పై, పెద్దగా అంచనాలు లేవు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం అని వాదించే వారు కూడా ఉన్నారు. అయితే, ఈ విషయం పక్కన పెడితే, కేసీఆర్ చేస్తున్న సన్నాహాలు మాత్రం, భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే, ఒక విమానం కొంటున్నారు. అలాగే మూడు నెలల పాటు, దేశ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు పెట్టనున్నారు. మొదటి బహిరంగ సభ డిసెంబర్ 9న ఢిల్లీలో పెట్టనున్నారు. తరువాత సంక్రాంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మీటింగ్ ఒకటి పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందు కోసం అమరావతిలో కానీ, విజయవాడ, గుంటూరు మధ్య కానీ, కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా, ప్రస్తుతం తటస్తంగా ఉన్న వారిని, తన పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కుడా కేసీఆర్ చేస్తున్నారు. ఇందలో భాగంగా ఇప్పటికే ఉండవల్లిని కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

kcr 050102022 2

ఇక టిడిపి, వైసీపీ, బీజేపీ నుంచి కూడా కేసీఆర్ లాగుతారని వార్తాలు వస్తున్నాయి. వీటి అన్నిటి నేపధ్యంలో, అసలు ఏపిలో కేసీఆర్ సక్సెస్ అయ్యే అవకాసం ఉందా అనే చర్చ మొదలైంది. గతంలో కేసీఆర్ ఆంధ్రా వారిని తిట్టిన తిట్లు, అలాగే అమరావతిని నాశనం చేస్తున్న తీరు, పోలవరం ఆపటం, జల వివాదాలు, ప్రత్యేక హోదా , విభజన హామీలు, కరెంటు బకాయలు, ఇలా అనేక విషయాల్లో కేసీఆర్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న తరుణంలో, అసలు కేసీఆర్ ని ఏపిలో ఎవరు ఆదరిస్తారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధి కోసం, జగన్ తో కలిసి అమరావతిని ఆపేయటంలో కేసీఆర్ పత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇన్ని ప్రతికూలతలు ఇక్కడ ఉంటే, ఇక్కడ వారి సహాయం లేకుండా, కేసీఆర్ ఏపిలో అడుగుపెట్టి బహిరంగ సభ పెట్టలేరు. ఈ నేపద్యంలోనే, ఏపిలో కేసీఆర్ కు సహకరిస్తుంది ఎవరు ? ఎవరా రహస్య మిత్రులు అనే చర్చ జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ, ఇవన్నీ బయట పడతాయి. ప్రజలు ఎలాంటి నిర్ణయం తెసుకుంటారో చరిత్రే చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read