తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదేదో అంటున్నారని.. తన జీవితంలో భయమనేదే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలోని తగరపువలసలో చిట్టివలస జ్యూట్‌మిల్లు మైదానంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సదస్సులో మాట్లాడారు. కొందరు విభేదాలు ఉంటే గానీ ప్రాబల్యం ఉండదని చూస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారం చేశానని, ప్రచారానికి వెళ్తే.. అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని అన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు తాను భయపడనని చంద్రబాబు స్పష్టంచేశారు.

cbn kcr 131223018 2

ధనిక రాష్ట్రాల కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక హోదా ఇస్తే పవన్‌, జగన్‌కు ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న తెరాసను జగన్‌, పవన్‌ కల్యాణ్‌ సమర్థిస్తున్నారని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అప్పుడు కేసీఆర్‌ హోదా ఇవ్వాలన్నారని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. హోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ను జగన్‌, పవన్‌ సమర్థిస్తున్నారని సీఎం మండిపడ్డారు. లాలూచీ రాజకీయాలు చేసినవారు చరిత్ర హీనులుగా మిగిలారని వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతి లేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్‌, జగన్‌, కేసీఆర్‌ను మనపై ఎగదోస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

cbn kcr 131223018 3

ఒక్కడినే పోరాడితే ఉపయోగం లేదనే అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మంచో చెడో విభజన జరిగి ఆదాయం తెలంగాణకు వెళ్లిందన్నారు. అయినా ఏపీని అభివృద్ధి చేసే శక్తిని దేవుడు తనకిచ్చారని వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం వైకాపా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోందని.. జగన్‌, పవన్‌, కేసీఆర్‌లను ప్రధాని మోదీ తమపైకి ఎగదోస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహకరిస్తే గుజరాత్‌ను మించి అభివృద్ధి చెందుతామని మోదీకి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్‌ ఫొటోలు పట్టుకుని ప్రతిపక్ష నేతలు ఊరేగుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

విజయసాయి రెడ్డి, కేవీపీ.. ఇద్దరు వేరు వేరు పార్టీలు అయినా, ఆత్మలు ఒక్కటే. వీళ్ళు ఇద్దరూ రాజ్యసభ సభ్యులు. రాజ్యసభలో ఎప్పుడు ప్రశ్నలు వేసినా, కేంద్రం నుంచి ఎక్కువ రాబట్టాలి అని ఉండదు. ఆ ప్రశ్నలతో, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూస్తూ ఉంటారు. అలంటి ప్రశ్నే నిన్న రాజ్యసభలో వేసారు కేవీపీ. ఆ ప్రశ్నతో చంద్రబాబుని ఇరుకున పెట్టి, జీవీఎల్ నరసింహారావు చేత ప్రెస్ మీట్ పెట్టి తిట్టిద్దాం అనుకున్నారు. కాని, పాపం కధ అడ్డం తిరిగింది. ప్రధానంగా, గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్రం మధ్య జరుగుతున్న యుద్ధంలో, కేంద్రం ప్రధానంగా చెప్తుంది, మేము ఎన్నో నిధులు ఇచ్చాం, కాని ఏపి ప్రభుత్వమే దానికి లెక్కలు చెప్పటం లేదు, యూసీలు ఇవ్వటం లేదు అని. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని యూసీలు ఇచ్చామని చెప్తుంది. ఇదే విషయం పై రాజ్యసభలో చర్చ జరిగింది.

kvp 13122018 2

వెనకబడిన జిల్లాల్లో అభివృ దికి గానూ ఆంధ్రప్రదేశకు కేంద్రం విడుదల చేసిన నిధుల్లో రూ.946. 47 కోట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యూసీలను ఇచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు బుధ వారం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం వెనకబడిన నియోజకవర్గాల అభివృద్దికి నీతి ఆయోగ్ సిఫా ర్సుల మేరకు ఆంధ్రప్రదేశ్కు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే, సంబంధిత అనుమతులు అన్నీ ప్రస్తుతం అందుబాటులో లేవన్నారు. అనుకోకుండా విడుదల చేసిన రూ. 350 కోట్లు వెనక్కి తీసుకున్న మాట వాస్తవమే అని, ఈ విడుదల ఇంకా కార్యరూపం దాల్చలే దని తెలిపారు.

kvp 13122018 3

మూడు విడతలగా ఆంధ్రప్రదేశ్ లోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 1050 కోట్లు విడుదల చేశామని, రాష్ట్ర ప్రభుత్వం రూ. 946, 47 కోట్లు యూసీలు ఇచ్చిందని కేంద్ర మంత్రి జైట్లీ వివరించారు. ఈ సమాధానంతో అటు కేవీపీ, ఇటు జీవీఎల్ ఇద్దరూ షాక్ అయ్యారు. చంద్రబాబుని ఇబ్బంది పెడదాం అనుకుంటే, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా, కేంద్రం రికార్డెడ్ గా, ఏపి ప్రభుత్వం అన్నీ లెక్కలు చెప్పిందని, అలాగే నిధులు వెనక్కు తీసుకున్నామని, ఇంకా ఇవ్వలేదు అని వారే ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర సాయం కింద ఇప్పటివరకు కేవలం రూ. 14,294.20 కోట్లు విడుదల చేశామని ఎంపీ కేవీపీ మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పి. రాధాకృష్ణన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దాదాపు గత మూడు సంవత్సరాల్లో వైద్యం కోసం ప్రజలు తమ సొంత నిధులు ఖర్చు చేయడాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో ప్రజలకు 21 రకాల వైద్య సేవలు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. 19 కార్యక్రమాలను పీపీపీ విధానంలో అమలు చేస్తోంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, చంద్రన్న సంచార చికిత్స, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్, ఎక్స్‌రే, ఎంఆర్ స్కాన్, సీటీ స్కాన్, వివిధ పరీక్షలు, మహాప్రస్థానం, ఉచిత అంబులెన్సు వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.

health 13122018 2

వైద్య సేవలు, పరీక్షల కోసం తమ సొంత నిధులను ఖర్చు చేయకుండా, ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య గతంతో పోలిస్తే ఎక్కువ అవుతోంది. అక్కడ లభిస్తున్న వైద్య సేవలే ఇందుకు కారణంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2015లో వైద్య ఖర్చుల కోసం సొంత నిధుల తలసరి ఖర్చు 5770 రూపాయలుగా ఉండేది. ఇది 2017 నాటికి 1205 రూపాయలకు తగ్గగా, ఈ ఏడాది నవంబర్ నాటికి 588 రూపాయలకు తగ్గింది. దాదాపు నాలుగు సంవత్సరాల్లో 90 శాతం మేర ప్రజలు వైద్య సేవల కోసం తమ సొంత నిధులు ఖర్చు చేయడం తగ్గింది.

health 13122018 3

మెడికల్ హెల్త్ కేర్‌పై 2015లో 5062 రూపాయలు ఖర్చు చేయగా, 2018 నాటికి 336 రూపాయలకు తగ్గించగలిగింది. వివిధ ప్రయోగశాల పరీక్షల నిమిత్తం తలసరి సగటున 860 రూపాయలు ఖర్చు చేయగా, అది 80 రూపాయలకు తగ్గింది. ఔషధాలు తదితరాల కోసం 2531 రూపాయలుగా ఉండే ఖర్చును 135 రూపాయలకు తగ్గించడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇచ్చాయి. ఔషధాల కోసం చేసే ఖర్చును 95 శాతం, ప్రయోగశాలల కోసం చేసే ఖర్చులో 91 శాతం మేర తగ్గించగలిగింది. ఇది ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణగా వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకున్నందుకు బదులుగా తాము కూడా ఆంధ్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తామని కేసీఆర్ స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో ఆయన టీఆర్‌ఎస్ తరపున రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశిస్తారా లేక జగన్, పవన్ తో కలిసి వస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆంధ్ర ప్రాంతం వారి పై ఉన్న ఆగ్రహావేశాలే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయానికి ప్రధాన పాత్ర పోషించాయని విశే్లషకులు పేర్కొంటున్నారు.

kcr pk 312018 2

తెలంగాణ ప్రజలు మరిచిపోతున్న విషయాలను మళ్లీ గుర్తు చేసేందుకే ఆయన చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశారని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన పథకాల కన్నా ఆంధ్ర పాలన అన్న ఒక్క అంశమే టీఆర్‌ఎస్ విజయంలో కీలకపాత్ర పోషించిందని వారంటున్నారు. అలాంటి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఇక్కడ కూడా విభజన నాటి రోజులు, నాడు ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటారన్నది అక్షర సత్యమని వెల్లడిస్తున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుని పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రచారంలో చంద్రబాబును విమర్శించడం, ఆరోపణలు చేయడం వల్ల ఆయన పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని భావించి అలా చేసి ఉంటారని అంటున్నారు.

kcr pk 312018 3

కేసీఆర్ కనుక వైకాపా, జనసేనలతో కలిసి వస్తే, చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టే అని అంటున్నారు. తెలంగాణలో మాదిరి కేవలం చంద్రబాబును విమర్శించి జగన్, పవన్‌ను విస్మరిస్తే అది టీడీపీకే లబ్ధి చేకూర్చే అవకాశాలు లేకపోలేదని వారు విశే్లషిస్తున్నారు. కాగా కేసీఆర్ వస్తానంటే ఎవరూ అడ్డుకోరని, ఎవరైనా ఎక్కడైనా రాజకీయాల్లో పాల్గొనడం, ప్రచారం చేసుకోవడం వారి హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఆయన మాదిరి ఇక్కడికి ఎందుకొచ్చావని తాను ప్రశ్నించనని, రాష్ట్ర రాజకీయాల్లో స్వేచ్చగా పాల్గొనవచ్చని సూచించారు. కాగా కేసీఆర్ వస్తే తమకెంత ప్రయోజనమన్న విషయంపై వైకాపా, జనసేన లెక్కలు వేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read