అందరూ అనుకున్నట్టే జగురుతుందా ? జూలై 18, రాష్ట్రపతి ఎన్నికలు అవ్వగానే, వైసీపీ అవసరం బీజేపీకి ఉండదని, జూలై 18 తరువాత వైసీపీ ఆటలు సాగవని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇన్నాళ్ళు బీజేపీకి రాజ్యసభలో వైసీపీ అవసరం ఉంది కాబట్టి, వైసీపీ ఏమి చేసినా సాగింది అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి చూడనట్టు వదిలేయటం కానీ, ఇలాంటి అనేక అంశాల పై, బీజేపా చూసి చూడనట్టు వదిలేయటానికి వాళ్ళ అవసరాలే. అయితే నిన్నతో రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ అవసరం, బీజేపీకి ఉంది. అయితే ఎన్నిక అయిన రోజే, వైసీపీకి ఒక రకంగా, బీజేపీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నాలుగో అతి పెద్ద పార్టీగా ఎంపీ సీట్ల పరంగా వైసీపీ ఉంది. వారికి 31 ఎంపీ స్థానాలు అటు లోక సభ, రాజ్యసభ కలిపి ఉన్నాయి. అలాంటి వైసీపీ పార్టీని, నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమానికి పిలవక పోవటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి జగదీప్ ధన్ ఖర్ నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ పాల్గున్నారు.
బీజేపీ నేతలతో పాటుగా బీజేడీ, జేడీయూ పార్టీల నేతల కూడా పాల్గున్నారు. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమానికి వైసీపీని పిలవకపోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. రాష్ట్రపతి అభ్యర్ధి నామినేషన్ సమయంలో, ప్రధాని మోడీ వెనుకే విజయసాయి రెడ్డి కూర్చుని ఉన్న ఫోటోలు బయటకు వదిలారు. అయితే రాష్ట్రపతి నామినేషన్ కు వైసీపీని పిలిచి, ఉప రాష్ట్రపతి నామినేషన్ కు వారిని పిలవకపోవటం పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇదే విషయం నిన్న వైసీపీ ఎంపీలు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగారు. దీనికి వైసీపీ ఎంపీలు సమర్ధించుకోలేక ఇబ్బందులు పడ్డారు. కేవలం సమాచార లోపం వల్లే తమను పిలవలేదని, కవర్ చేసే ప్రయత్నం చేసారు. సమాచార లోపం వల్లే, ఈ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదని చెప్పే ప్రయత్నం చేసారు. మరి ఇది నిజంగా సమాచార లోపం వల్లే జరిగిందా ? లేదా అందరూ అనుకుంటున్నట్టు, రాష్ట్రపతి ఎన్నికలు అవ్వగానే వైసీపీకి సినిమా మొదలు అవుతుందని, అందరూ అన్నట్టే ఇది జరుగుతుందా అనేది వేచి చూడాలి...