కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కింద పని చేస్తున్న కూలీలకు వేతనాల చెల్లింపుల పై ప్రభావం చూపుతోంది. గత 25 రోజుల్లో చేసిన పనులపై రూ.413.64 కోట్ల బకాయిలు చెల్లించాలి. వారం నుంచి పది రోజులకు మించి బకాయిల్లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్నా నిధుల కొరతతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. నరేగా అమలులో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇటీవలే గత ఏడాది (2017-18) వేతన బడ్జెట్‌ వ్యయంపై కేంద్రానికి యూసీ పంపింది. అంతేకాక ఈ ఏదాది (2018-19) ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య చేసిన ఖర్చుపైనా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు అధికారులు ఆడిట్‌ నివేదిక పంపారు.

nrega 12112018 2

దీనిపై తదుపరి ఆరు నెలలకు (అక్టోబరు నుంచి మార్చి) కేంద్రం నిధులు కేటాయిస్తుంది. నివేదికపై కేంద్రం ఈసారి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తదుపరి నిధుల విడుదలకు ప్రతిబంధకమైంది. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యమైనపుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సర్దుబాటు చేసిన సందర్భాలున్నాయి. కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యే విధానం అమలులోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా సర్దుబాటు చేసినా తిరిగి వాటిని రాబట్టుకోవడం కష్టమవుతోంది. గతంలో ఇదే విధంగా సమకూర్చిన రూ.700 కోట్లకు ఇప్పటికీ ఠికానా లేదు. దీంతో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే పరిస్థితి.

nrega 12112018 3

గత అనుభవాల దృష్ట్యా అధికారులు కూడా ప్రభుత్వం ముందు ఇలాంటి ప్రతిపాదనలు పెట్టడం లేదు. ఆడిట్‌పై కేంద్రం వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర వివరాలు పంపామని, నాలుగైదు రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్‌,. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏయే అంశాలపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న విషయాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. నరేగాలో వేతన కార్మికులు: 63.62 లక్షలు.. వీరిలో పురుషులు: 23.56 లక్షలు ... మహిళలు: 35.06 లక్షలు... ఈ ఏడాది పని దినాల లక్ష్యం: 23.54 కోట్లు.. ఇప్పటివరకు కల్పించినవి: 18.14 కోట్లు... వేతన బడ్జెట్‌ ఖర్చు: రూ.3,627.22 కోట్లు...

‘రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నేను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతా.. నా మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బేస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ఛాయ్‌వాలానని చెప్పిన మోదీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారు. మనకు అన్యాయం చేశారు. ధర్మంగా వ్యవహరిస్తే అది మనల్ని కాపాడుతుంది. అధర్మమైతే ఎప్పటికైనా నష్టమే..’ అని పేర్కొన్నారు. ‘నాకేమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో భాజపా అధికారంలోకి రావడం కల్ల’ అని స్పష్టం చేశారు.

cbn modi 12112018

ఫరూక్‌, కిడారి శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో అరకు నియోజకవర్గ నేతలు, మైనారిటీ వర్గ ముఖ్యులతో చంద్రబాబు ఉండవల్లి ప్రజావేదికలో సమావేశమయ్యారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరంతోపాటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తెదేపా పాత్రను వివరించారు. ‘మోదీ లేకపోతే దేశం లేదనే ఆలోచనను ప్రజల్లో రేకెత్తించడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయం కల్గిస్తోంది. ఇది వాస్తవం కాదని అందరికీ చెబుతున్నాం. ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది..’ అని చంద్రబాబు వివరించారు. ‘మోదీకంటే హేమాహేమీలు మా వైపున్నారు. మీ నాయకుడు ఎవరని విలేకరులు అడిగితే మోదీ కంటే స్టాలిన్‌ చాలా నయమని చెప్పా..’ అని వివరించారు.

cbn modi 12112018

‘మనం ఎన్డీయే నుంచి బయటకొచ్చాకే భాజపా పతనం మొదలైంది. దేశంలోని ప్రధాన పార్టీలు, ముఖ్యనేతలంతా కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు. కర్ణాటక, తమిళనాడులో ఘనంగా స్వాగతించి మద్దతిస్తామన్నారు’ అని వివరించారు. ‘భాజపా పాలనలో మతాలపట్ల అసహనం నెలకొంది. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ వ్యవహార శైలిపైనా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన రాజకీయంగా మాట్లాడితే సరే. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధానం సరికా’దని మండిపడ్డారు. ‘అందుకే మహాకూటమి ఏర్పాటుచేశాం. అక్కడ ఒక అడుగు తగ్గాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. ‘మర్యాదగా ఉంటే మర్యాదగానే ఉంటాం. అన్యాయం జరిగినప్పుడు మనకంటే గట్టిగా పోరాడేవాళ్లు దేశంలో ఎక్కడా లేరు’ అని పేర్కొన్నారు.

శ్రీకాకుళం తుఫాను చర్యల పై పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయ దాడి చేస్తున్నారో చూస్తున్నాం. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తానికి పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాల నడిపించారు. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, తుఫాను ప్రభావం అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా, అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి దాదపు 12 రోజులు, శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దారు. అంతే కాదు, రికార్డు టైంలో పరిహారం కూడా ఇచ్చారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే, ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు, ఇంకో వాడు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ, కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత వెళ్ళాడు.

jd 12112018 2

పవన్ కళ్యాణ్ చేతనైన సహాయం చెయ్యాలి, లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి. కాని, పవన్ ఇవేమీ చెయ్యకుండా, ఈ రోజుకీ చంద్రబాబు చేసిన సాయం పై ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా, ‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసిన సాయం వేరుశనగంత, కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ అంత' అంటూ ట్వీట్ చేసారు. అక్కడ పండుగలకు కూడా కుటుంబానికి దూరంగా ఉండి, పని చేసిన వేలాది మందిని కూడా పవన్ కించ పరుస్తున్నాడు. అయితే, పవన్ ఇలా ఏడుస్తూనే ఉంటే, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం, ఇందుకు విరుద్ధంగా నిన్న ఇచ్చిన ఈటీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు.

jd 12112018 3

జేడీ లక్ష్మీనారయణను ఆ ఇంటర్వ్యూ లో, ఇలా దిగారు "మీరేమో శ్రీకాకుళంలో ప్రభుత్వం బాగా పని చేసింది అంటున్నారు, కాని కొన్ని రాజాకీయ పార్టీలు, అసలు ఏమి జరగలేదు అంటున్నాయి" అని ప్రశ్న వేసారు. దానికి మాజీ జేడీ స్పందిస్తూ "నేను శ్రీకాకుళంలో తుఫాను వచ్చిన మూడు రోజుల తరువాత వెళ్ళాడు, అక్కడే మూడు రోజులు ఉన్నాను. అది భీకరమైన తుఫాను, అంతా దారుణంగా ఉంది. కాని తరువాత అన్నీ క్లియర్ చేసుకుంటూ, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇదేమీ మాయాబాజార్ సినిమా కాదు కదా, అన్నీ వెంటనే అయిపొవటానికి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ, అన్ని స్థాయిల్లో అధికారులు పని చేసారు. ప్రతి గ్రామానికి వచ్చి, పని చేసారు. నేను చూసినంత వరకు, అంతా సవ్యంగా జరిగింది. నేనేమీ రాజకీయ నాయకుడుని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా" అని జేడీ అన్నారు. కాని, మన పవన్ కళ్యాణ్ కి మాత్రం, నిరంతర ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు.

ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే... కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది దాదాపు 50 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ... కృష్ణా జలాలు సమృద్ధిగా అందడంతో రైతులు కరువును జయించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను గత నాలుగేళ్లుగా వేగంగా చేపడుతూ, చకచకా పూర్తి చేస్తుండటం... రెండేళ్లుగా కృష్ణాజలాలు పుష్కలంగా అందిస్తుండటం దీనికి కారణం.

kadapa 12112018 1

కడప జిల్లాలో అవుకు టన్నెల్‌ నుంచి కృష్ణా జలాలను గండికోట రిజర్వాయరుకు చేర్చి, అక్కడ నుంచి మైలవరం, సీబీఆర్‌ తదితర రిజర్వాయర్లకు చేర్చారు. ఈ జలాశయాలకు అనుసంధానంగా ఉన్న చెరువులకు ఈ జలాలు మళ్లించారు. చెరువులను పూర్తిగా నింపడం వల్ల ఒక్కసారిగా భూగర్భజలాలు పెరిగాయి. రెండేళ్ల క్రితం దాకా వట్టినే పడిఉన్న బోర్లు నోర్లు తెరిచాయి. సాగుకు సరిపడా నీటిని అవి సమృద్ధిగా అందిస్తున్నాయి. ఈ నీటిని వాడుకొంటూ, రైతులు ఉద్యానపంటల సాగును బాగా పెంచారు. ప్రస్తుతం ఈ జిల్లాలో పండ్లు, పూల సాగు 1,13,384 హెక్టార్లలో, కూరగాయలు 25,661 హెక్టార్లు, అరటి 22,211 హెక్టార్లు, మామిడి 28,863 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువభాగం పులివెందుల, రాయచోటి వంటి పూర్తి కరువు నియోజకవర్గాల్లోనే సాగు అవుతున్నాయి.

kadapa 12112018 1

అంతేకాదు, మొత్తం జిల్లాలోనే పులివెందుల ఉద్యానవన సాగులో దూసుకెళుతుండటం గమనార్హం. ఈ నియోజకవర్గంలోని లింగాల గ్రామాన్ని చూస్తేనే మనకు ఆ విషయం అర్థమయిపోతోంది. అక్కడికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి.. గ్రామంలో ఆహ్లాదకర పరిస్థితులు కనిపించాయి. వేరుశెనగ, టమోట, పుచ్చకాయ, బొప్పాయి, అరటి, చీనీ తదితర పంటలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. రాయచోటి విషయానికి వస్తే.. ఎగువనున్న వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గత ఏడాది పెద్దగుండ్ల చెరువు, బూడిదగుంట చెరువులకు కృష్ణాజలాలను నింపారు. ఆ నీటిని పొదుపుగా వాడుకోవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో వేరుశెనగ, మల్బరీ, కూరగాయలు, టమోటా, దోస పంటను ఎక్కువగా, అక్కడక్కడ వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు తమ గ్రామం కరువును జయించిందని, మూడు కార్ల పంటలను సాగు చేయగలుగుతున్నామని బూడిదగుంటపల్లె గ్రామ రైతులు ధీమాతో పలికారు.

 

Advertisements

Latest Articles

Most Read