ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను కలిపి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యటానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయనే చొరవ తీసుకుని రంగంలోకి దిగారు. ముందుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాని కలిసి, తరువాత, బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎం చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో దేశం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే భేటీ అయిన తరువాత చంద్రబాబును మాయావతి ప్రత్యేకంగా ఆశీర్వదించండం విశేషం. సమావేశనంతరం కారుదాకా వచ్చి చంద్రబాబును మాయావతి సాగనంపారు.

mayawati 27102018 2

మాయవతి స్వభావం తెలిసిన వారు, ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. సహజంగా మాయావతి, అంత గౌరవం ఎవరికీ ఇవ్వరని, చంద్రబాబును ఆమె ఎంతో గౌరవంగా చూసారని అంటున్నారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు జరగుతున్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాల పై చంద్రబాబుతో మాయావతి చర్చించినట్లు సమాచారం.

mayawati 27102018 3

అంతకుముందు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాను చంద్రబాబు కలిశారు. దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నామని ఫరూక్‌ తెలిపారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకుపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకోలేదని ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు.

 

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థుతులు, మోడీ-షా వ్యవస్థలను నాశనం చెయ్యటంతో, వీళ్ళ నుంచి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపైనే తాను చంద్రబాబుతో చర్చించానని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్నికాపాడుకోవడం ముఖ్యమన్నారు. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని, ఐకమత్యం సాధిస్తామని వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థి ఎవరనేది అవసరం లేదని.. గెలిచిన తర్వాత ప్రధాని అభ్యర్థిపై నిర్ణయించుకోవచ్చని తెలిపారు.

farook 27102018 2

రాహుల్‌ తానేమీ కూటమి నాయకుడిగా లేదా ప్రధాని అభ్యర్థిగా చెప్పలేదు కదా? అని మీడియాతో అన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఏపీకి సాయం చేయడంలో కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్‌ అంశాలతో పాటు దేశంలోని రాజకీయ పరిణామాలు, తెదేపా లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను దిల్లీ వేదికగా ప్రజలకు వివరించడమే లక్ష్యంగా చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో పాటు ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

farook 27102018 3

రేపుమాపో తనపై కూడా దాడులు జరుగుతాయని తెలుసని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని, ఏనాడూ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతల వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారని, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిసహా అనేక రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని చెప్పారు. ‘‘మేం బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు... మాకు పన్ను ఎగవేత నోటీసులు రాలేదు. బీజేపీతో విడిపోగానే 19బృందాలతో ఐటీ దాడులు చేయించారు. విభజన చట్టం అమలుపై విబేధించినంత మాత్రాన వేధిస్తారా? దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వాటిల్లుతోంది. ప్రధాని, అధికార పార్టీ అధ్యక్షుడు ఒకే రాష్ట్రం వారు ఉండకూడదు. కేంద్రంలోని కీలక పదవుల్లో మొత్తం గుజరాతీలే ఉన్నారు. తమకు నచ్చనివాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ దేశానికీ, రాష్ట్రానికి చేసిన మోసాన్ని, ప్రతి విషయం ఆధారాలతో సహా నేషనల్ మీడియాకు చూపిస్తూ, మోడీ-షా విధానాలని చాకిరేవు పెట్టారు.... స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయంపైనా నిలదీసిన చంద్రబాబు.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను దిల్లీ వేదికగా ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కుట్రపూరిత వైఖరి అనుసరిస్తోందని ధ్వజమెత్తడంతో పాటు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ మీడియాకు సీఎం వివరించారు.

delhi 27102018 2

‘‘దేశంలో ఏం జరుగుతోందో వివరించడానికే మీ ముందుకొచ్చాను. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉన్న పరిస్థితుల్లో మేం అధికారంలోకి వచ్చాం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏపీలో ఒక్కసారిగా 19 ఐటీ బృందాలను దాడులకు పురిగొల్పారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. అలాంటిదేమీ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు జమచేస్తామన్నారు.డాలర్‌తో రూపాయి మారకపు విలువ విపరీతంగా పెరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఎప్పుడు పూర్తి చేస్తారు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. ఎప్పుడు చేస్తారు? వ్యవసాయంలో 3శాతం వృద్ధి మాత్రమే ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

delhi 27102018 3

‘‘ ఏపీ విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వైకాపా మద్దతును భాజపా తీసుకుంది. వైకాపా, భాజపా మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన నిధులను కూడా ఇటీవల వాపస్‌ తీసుకున్నారు. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేరుస్తామని ప్రధాని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీనీ సరిగ్గా నెరవేర్చలేదు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో రూ.1000 కోట్లు ఇస్తామన్నారు. కేవలం రూ.650 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు నిధులు ఇవ్వొచ్చు.. అది రాజకీయ కారణం. నేను అర్థంచేసుకోగలను. కానీ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వకపోవడం వివక్ష కాదా? రాష్ట్రంలో తిత్లీ తుపాను వస్తే పరిశీలనకు కేంద్రమంత్రులు రాలేదు. గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించి రాజ్‌నాథ్‌సింగ్‌ దిల్లీకి వెళ్లిపోయారు గానీ.. తిత్లీ బాధితులను పరామర్శించేందుకు రాలేదు’’ అని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో నేషనల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ న్‌పై జరిగిన దాడి ఘటన గురించి ప్రస్తావించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో తాజాగా ఓ ఘటన జరిగిందని, ప్రతిపక్ష నేత ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ చిన్న కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ విషయం తెలియగానే.. తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. విమానాశ్రయాలు కేంద్ర పరిధిలో ఉండే సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంటాయని.. ఘటన జరిగింది ఎయిర్‌పోర్ట్ లోపలేనని చంద్రబాబు చెప్పారు. ఘటన జరిగిన అనంతరం దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద 10పేజీల లేఖ దొరికిందని ఆయన జాతీయ మీడియాకు వివరించారు.

media 27102018 2

ఈ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు టీడీపీని విమర్శించారని చెప్పారు. అయితే.. ఘటన జరిగింది విమానాశ్రయం లోపల అని.. ఎయిర్‌పోర్ట్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం పరిధిలో ఉన్న చోట ఘటన జరిగితే.. తమను బాధ్యులను చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఘటన జరిగిన తర్వాత గవర్నర్ రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేశారని.. సహజంగా గవర్నర్‌కు ఏ సమాచారమైనా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విమానాశ్రయంలో దాడి జరిగితే మమ్మల్ని నిందిస్తే ఎలా? ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే’ అని మండిపడ్డారు.

media 27102018 3

మూడునాలుగు నెలల క్రితం శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ అనే ఓ అంశాన్ని తెరపైకి తెచ్చాడని... మొదట్లో తాను నమ్మలేదని చంద్రబాబు చెప్పారు. ‘ఆపరేషన్ గరుడ’లో శివాజీ ఏ అంశాలను వివరించాడో.. ప్రస్తుతం సరిగ్గా అదే మాదిరి ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాలతో తాను షాక్‌కు లోనయ్యానని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతాయని శివాజీ చెప్పాడని... తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అదే తరహాలో రైడ్స్ జరిగాయని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆస్తులపై రైడ్స్ జరిగాయని చెప్పారు. తాము బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు తమపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, పొత్తు తెగతెంపులు చేసుకున్న అనంతరం ఐటీ దాడులు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisements

Latest Articles

Most Read