రెండు రోజుల క్రితం, ప్రెస్ మీట్ లో బహిరంగంగా మాట్లాడుతూ, మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అని చెప్పిన తెలంగాణా మంత్రి కేటీఆర్, చంద్రబాబుని ఇప్పటికే టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఫోన్ చేసి అభినందించారు. మొన్న కవాతు సందర్భంగా, బాగా ఊగిపోయి చంద్రబాబుని బాగా బూతులు తిట్టారని, లోకేష్ పై బాగా విమర్శలు చేశారని, కేటీఆర్ పవన్ ను అభినందించారు. ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన నిర్వహించిన కవాతు బాగా విజయవంతం అయ్యిందని, అందుకే మీకు ఫోన్ చేసి అభినందనలు చెప్పాలనిపిచ్చింది అంటూ కేటీఆర్ ఫోన్ చేసి మరీ, పవన్ కు అభినందనలు తెలిపారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణాలో, ఆంధ్రా వాళ్ళని బాగా తిడుతున్న కేసీఆర్ కు సపోర్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఇప్పుడు ఈ ఫోన్ కాల్ తో వీరి బంధం మరింత గట్టి పడింది.

ktr 17102018 2

"బాబు నువ్వే మా టార్గెట్", పార్లమెంట్ సాక్షిగా ప్రధాని.. "చంద్రబాబు నిన్ను దించటమే మా టార్గెట్", ఊరు ఊరు తిరిగి చెప్తున్నాడు జగన్.. "నేను గెలవకపోయినా పరవాలేదు, ఎవరు గెలిచినా పరవాలేదు, చంద్రబాబుని మాత్రం గెలవనివ్వను", ఇంత విచిత్రంగా స్పందిస్తాడు పవన్ కళ్యాణ్... తెలంగాణాలో ఉన్న తెరాస పార్టీకి కూడా చంద్రబాబే టార్గెట్ అంటూ రెండు రోజుల క్రిందట కేటీఆర్ ప్రకటించాడు. 0.01% ఉన్న చిల్లర పార్టీ తెలుగుదేశం అంటూనే, చంద్రబాబు మా టార్గెట్ అంటున్నాడు కేటీఆర్. మొత్తానికి మోడీ, జగన్, పవన్, కెసిఆర్ బంధం ఎంత గట్టి బంధమో రోజు రోజుకీ తెలుస్తుంది. తెలంగాణాలో యుద్ధం జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చి కత్తులు తిప్పుతున్నాడు.

ktr 17102018 3

అక్కడ రాజకీయం వదిలేసి, కేటీఆర్ ఇక్కడ రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నాడు. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి అనుచరగణానికి వేల కోట్ల మిషన్ బఘీరాధ కాంట్రాక్టులు ఇస్తారు. ఇలా అందరూ కలిసి, అన్ని వైపుల నుంచి వస్తు, ఒకే ఒక్కడిని టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణాలోని హైదరాబాద్, రంగారెడ్డిలో మాత్రమే స్నేహపూర్వక పోటీ పెట్టి, తెలుగుదేశం ఓట్లు చీల్చి లబ్ది పొందాలనే ఉద్దేశంలో కెసిఆర్ ఉన్నారు. దానిలో భాగంగానే, రాజకీయం మొత్తం నడుస్తుంది. అందుకే కెసిఆర్ - పవన్ సంబంధాలు తెలుసు కాబట్టే, ఇక్కడ ఏపిలో కమ్యూనిస్ట్ లు పవన్ వెంట ఉంటే, తెలంగాణాలో మాత్రం, పవన్ ను ఛీ కొట్టారు కమ్యూనిస్ట్ లు. కెసిఆర్ తొత్తుగా మారాడని విమర్శిస్తున్నారు. ఇదండీ, కెసిఆర్, పవన్, జగన్, మోడీలు కలిసికట్టుగా హైదరాబాద్ నుంచి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేస్తున్న యుద్ధం..

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... ఇవాళ చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... ఇవాళ డాక్టర్ గా కూడా, తన వృత్తి ధర్మం నెరవేర్చారు.. ప్రజా నాయకుడిగా కూడా పని చేసి, ఒక జీవితాన్ని కాపాడారు... అనేకసార్లు ఆయాన వెళ్ళే దారిలో ప్రమాదాలు జరిగితే, స్వయంగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి, తానే హాస్పిటల్ లో జాయిన్ చేసే వారు. ఈ సారి కూడా అలాంటి సంఘటనే జరిగింది.

kodela 17102108 2

మరోసారి మానవత్వం చాటుకున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ మండలంలోని ఇస్సపాలెం సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి వేముల శ్రీను రోడ్డు పై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పమిడిపాడులో కార్యక్రమం ముగించుకొని నరసరావుపేటకు వస్తున్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంఘటనను చూసి వెంటనే వాహనాన్ని ఆపి గొర్రెల కాపరిని చూసి వ్యక్తిగత సిబ్బంది వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

kodela 17102108 3

కోడెల కూడా స్వయంగా వారితో పాటు హాస్పిటల్ కు వెళ్లారు. వేముల శ్రీనుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సంఘటన ఎలా జరిగిందో మిగతా గొర్రెల కాపరులను అడిగి తెలుసుకున్నారు. వేముల శ్రీను నకరికల్లు మండలం రూ పెనగుంట్లకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించాలని స్పీకర్ డాక్టర్ కోడెల పోలీసులను ఆదేశించారు. సంఘటనా స్థలంలో వివరాలను తహసీల్దార్ బీ వెంకటేశ్వరరావు సేకరించారు. మరో పక్క, కొంచెం సేపటి తరువాత పరిస్థితి విషమంగా ఉందని తెలియటంతో, మోరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించాలని వైద్యులను స్పీకర్ ఆదేశించారు.

తఫాను బాధితులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. పలాస మండలం గరుడుబద్రలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. భారీ ఎత్తున విపత్తు జరిగితే కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఆర్థిక సాయం అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే బాధ్యత కేంద్రానికి లేదా? అని అడిగారు.

nikhil 16102018

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్ రాజకీయం‌ కోసం విజయవాడ వచ్చారని చెప్పారు. ఇక ప్రతిపక్ష నేత జగన్‌ కోర్టుకెళ్లడానికి పాదయాత్ర వాయిదా వేస్తారు కానీ.. తుఫాను బాధితులను పరామర్శించడానికి వాయిదా వేయలేరా? అని నిలదీశారు. జగన్‌ పక్క జిల్లాలో ఉండి కూడా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి రాలేదని విమర్శించారు. పరామర్శించకపోగా.. తాను దగ్గరుండి పనిచేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ధ్వజమెత్తారు. మంత్రులు, అధికారులు కూడా సామాన్యుల్లా కష్టపడుతున్నారని సీఎం గుర్తుచేశారు.

 

nikhil 16102018

మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విజయవాడ వచ్చారు. మంగళవారం ఆయన గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వద్ద భాజపా రాష్ట్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామని, అదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు.

ప్రకృతి మన రాష్ట్రం పై విలయతాండవం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుఫాను రూపంలో విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. హూద్ హూద్ ను మించిన ఈ తుఫాన్ శ్రీకాకుళం వాసుల గుండె పై చెరగని గాయం చేసింది. లక్షలాది కొబ్బరి, జీడి , మామిడి చెట్లను నాశనం చేసింది. కరెంటు స్థంభాలు కూలిపోయాయి, మట్టి గోడలు ఉన్న ఇల్లు కూలిపోయాయి. అపార నష్టం వాటిల్లింది. మన మీడియా దీని గురించి అసలు పట్టించుకోకపోయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం, తుఫాను రెండు రోజుల ముందు నుంచే సమీక్షలు చేస్తూ, ప్రాణ నష్టం నివారించ గలిగారు. వెంటనే శ్రీకాకుళం వెళ్ళిపోయారు. గత నాలుగు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అంతా పలాస నుంచే నడుస్తుంది.

lokesh 17102018 2

ఎంతటి ఉపద్రవం కాకపోతే, ఒక ముఖ్యమంత్రి, 10 మంది మంత్రులు, వందల మంది అధికారులు, వేల మంది కార్మికులు అక్కడ నుంచి పని చేస్తున్నారు. అధికార పక్షం ఇలా పని చేస్తుంటే, ప్రతిపక్షం రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి, కాని మన ఖర్మకు అలా లేదు. ప్రతిపక్ష నాయకుడు అక్కడే ఉన్నా, తన ముద్దుల యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఇంకో నాయకుడు అయితే, నాకు శ్రీకాకుళం అంటే ఎంతో ఇష్టం, నా జీవితం శ్రీకాకుళం వాసులకి అంకితం అంటూ కబుర్లు చెప్పాడు. చంద్రబాబు లేకపోయినా, మీకు నేను ఉన్నాను అంటూ, అవసరం లేనప్పుడు ఉత్తి మాటలు చెప్పాడు. నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని, ఎంజాయ్ చేస్తూ, కారులో కవాతులు చేస్తూ, రాజకీయ విమర్శలు చేసాడు పవన్.

lokesh 17102018 3

కవాతు తరువాత మీటింగ్ పెట్టి, ఎదో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు. చంద్రబాబు, లోకేష్ ల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే, పవన్ వ్యాఖ్యల పై కొంత మంది మీడియా ప్రతినిధులు, శ్రీకాకుళం తుఫాను బాధితుల సహాయ కార్యక్రమాల్లో ఉన్న లోకేష్ ని, ఆయన అభిప్రాయం అడిగారు. దీనికి లోకేష్, చాలా హుందాగా స్పందించారు." మన శ్రీకాకుళం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవడానికి నిరంతరం కష్ట పడుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగం అంతా పనులు మానుకుని, వీరు కోలుకునేలా మా ప్రయత్నం చేస్తున్నాం. తుఫాను ప్రభావిత ప్రాంతం కొలుకుని...సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ఇక్కడే ఉంటాం. ప్రస్తుతం ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఏమి చెయ్యాలి అన్న ఆలోచన తప్ప మరొక దాని గురించి నేను ఆలోచించడం లేదు. రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. రాజకీయం మరో వేదిక పై మాట్లాడతాను." అంటూ లోకేష్ స్పందించన తీరు, పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యత లేని వారికి ఒక చెంప పెట్టు. న్యు ఏజ్ పాలిటిక్స్ అంటే ఇలా ఉండాలి. అంతే కాని డ్రగ్స్ తీసుకున్న మనుషులులాగా, లేని ఎమోషన్ సృష్టించటం కోసం, ఊగిపోవటం కాదు.

Advertisements

Latest Articles

Most Read