రెండు రోజుల క్రితం, ప్రెస్ మీట్ లో బహిరంగంగా మాట్లాడుతూ, మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అని చెప్పిన తెలంగాణా మంత్రి కేటీఆర్, చంద్రబాబుని ఇప్పటికే టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఫోన్ చేసి అభినందించారు. మొన్న కవాతు సందర్భంగా, బాగా ఊగిపోయి చంద్రబాబుని బాగా బూతులు తిట్టారని, లోకేష్ పై బాగా విమర్శలు చేశారని, కేటీఆర్ పవన్ ను అభినందించారు. ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన నిర్వహించిన కవాతు బాగా విజయవంతం అయ్యిందని, అందుకే మీకు ఫోన్ చేసి అభినందనలు చెప్పాలనిపిచ్చింది అంటూ కేటీఆర్ ఫోన్ చేసి మరీ, పవన్ కు అభినందనలు తెలిపారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణాలో, ఆంధ్రా వాళ్ళని బాగా తిడుతున్న కేసీఆర్ కు సపోర్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఇప్పుడు ఈ ఫోన్ కాల్ తో వీరి బంధం మరింత గట్టి పడింది.
"బాబు నువ్వే మా టార్గెట్", పార్లమెంట్ సాక్షిగా ప్రధాని.. "చంద్రబాబు నిన్ను దించటమే మా టార్గెట్", ఊరు ఊరు తిరిగి చెప్తున్నాడు జగన్.. "నేను గెలవకపోయినా పరవాలేదు, ఎవరు గెలిచినా పరవాలేదు, చంద్రబాబుని మాత్రం గెలవనివ్వను", ఇంత విచిత్రంగా స్పందిస్తాడు పవన్ కళ్యాణ్... తెలంగాణాలో ఉన్న తెరాస పార్టీకి కూడా చంద్రబాబే టార్గెట్ అంటూ రెండు రోజుల క్రిందట కేటీఆర్ ప్రకటించాడు. 0.01% ఉన్న చిల్లర పార్టీ తెలుగుదేశం అంటూనే, చంద్రబాబు మా టార్గెట్ అంటున్నాడు కేటీఆర్. మొత్తానికి మోడీ, జగన్, పవన్, కెసిఆర్ బంధం ఎంత గట్టి బంధమో రోజు రోజుకీ తెలుస్తుంది. తెలంగాణాలో యుద్ధం జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చి కత్తులు తిప్పుతున్నాడు.
అక్కడ రాజకీయం వదిలేసి, కేటీఆర్ ఇక్కడ రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నాడు. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి అనుచరగణానికి వేల కోట్ల మిషన్ బఘీరాధ కాంట్రాక్టులు ఇస్తారు. ఇలా అందరూ కలిసి, అన్ని వైపుల నుంచి వస్తు, ఒకే ఒక్కడిని టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణాలోని హైదరాబాద్, రంగారెడ్డిలో మాత్రమే స్నేహపూర్వక పోటీ పెట్టి, తెలుగుదేశం ఓట్లు చీల్చి లబ్ది పొందాలనే ఉద్దేశంలో కెసిఆర్ ఉన్నారు. దానిలో భాగంగానే, రాజకీయం మొత్తం నడుస్తుంది. అందుకే కెసిఆర్ - పవన్ సంబంధాలు తెలుసు కాబట్టే, ఇక్కడ ఏపిలో కమ్యూనిస్ట్ లు పవన్ వెంట ఉంటే, తెలంగాణాలో మాత్రం, పవన్ ను ఛీ కొట్టారు కమ్యూనిస్ట్ లు. కెసిఆర్ తొత్తుగా మారాడని విమర్శిస్తున్నారు. ఇదండీ, కెసిఆర్, పవన్, జగన్, మోడీలు కలిసికట్టుగా హైదరాబాద్ నుంచి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేస్తున్న యుద్ధం..