కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు గుంటూరు రానున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మీడియా సెల్ ఇన్చార్జి తురగా నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా నిర్మించనున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనానికి ఆయన శిలాఫలకం ఆవిష్కరిస్తారని తెలిపారు. మరో ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యుడు, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వినోద్ సోంకార్ కూడా హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తారన్నారు. ఈసందర్భంగా గుంటూరు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద జరగనున్న ఎస్సీ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సునీల్ ప్రమాణ స్వీకారోత్సవ బహిరంగ సభలో వీరు పాల్గొంటారని నాగభూషణం వివరించారు.
అయితే ఈ సంధర్బంలో, తెలుగుదేశం నేతలు ఆయన్ను కలవనున్నారు. ‘తిత్లీ’ బాధితులకు సాయంచేయాలని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను టీడీపీ నేతలు ఈరోజు సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో కలవనున్నారు. ‘తిత్లీ’ తుపాను సాయం విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని నేతలు కోరనున్నారు. అంతేకాక విభజన హామీలు అమలు చేయాలని వినతిపత్రం ఎంపీలు వినతి పత్రం ఇవ్వనున్నారు. కేంద్రహోంమత్రిని ఎంపీలు కేశినేని నాని, శ్రీరాం మాల్యాద్రి, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కలువనున్నారు.