రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, కోర్టు ఆగ్రహం తెప్పించిన విషయాలు ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు ఏకంగా కోర్టుకు సంబంధించిన అంశం పైనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడింది. డిప్యూటేషన్ పైన హైకోర్టులో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందిని, GADకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను GADకి ఇవ్వటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు సిబ్బందిని, హైకోర్టుకు చెప్పకుండా, హైకోర్ట్ అనుమతి లేకుండా ఎలా తప్పిస్తారు అంటూ, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల పై స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు పై స్టే ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
news
మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీ... ఒక్కసారిగా కలకలం...
మంత్రి రోజా ఈ రోజు తిరుపతి ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడ నుంచి పెద్దిరెడ్డిని కలిసి ఆశీసులు తీసుకుని, అక్కడ నుంచి పద్మావతి గెస్ట్ హౌస్ కి వెళ్లి అక్కడ బస చేసారు. ఆ తరువాత ఎస్వీ యూనివర్సిటీ స్టాఫ్ కు సంబంధించి సమీక్ష సమావేశంలో పాల్గునటానికి వస్తున్న క్రమంలో, తన దగ్గర ఉండాల్సిన ఫోన్ లేదని గుర్తించారు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ ఏమైంది అనే విషయంలో గందరగోళం నెలకొనటంతో, చివరకు పోలీసులకు చెప్పటంతో, పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా , ఫోన్ ని ట్రేస్ అవుట్ చేసారు. ఒక వ్యక్తి దగ్గర ఫోన్ ని గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని, ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ చోరీకి గురైందా, లేదా రోజా ఎక్కడైనా పొరపాటున పెట్టి మర్చిపోయారా అనే విషయం పై క్లారిటీ లేదు. పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
లోకేష్ పై, పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు...
దగ్గుబాటి పురంధేశ్వరి.. ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసారు. అన్న ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు పొంది, తరువాత రాజకీయాల్లో తనదైన మార్క్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే చంద్రబాబు కుటుంబంతో, దగ్గుబాటి కుటుంబానికి ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది. కనీసం ఇరు కుటుంబాలు మాట్లాడుకోనంత గ్యాప్ ఇద్దరికీ ఉంది. అయితే ఆరు నెలల క్రితం, ఇరు కుటుంబాలు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో దగ్గరగా కలిసి ఉండటంతో, నందమూరి, నారా అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు తాజగా పురంధేశ్వరి, లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. ఒక టీవీ ఇంటర్వ్యూ లో, టిడిపికి భవిష్యత్తు నాయకుడిగా, భవిష్యత్తు ఉందా, మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా, పురంధేశ్వరి స్పందించారు. నా సోదరి కొడుకుగా లోకేష్ కు ఎప్పుడూ ఆశీసులు ఉంటాయని, లోకేష్ కు ఆ సత్తా కూడా ఉంది అంటూ, చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వేరే పార్టీలో ఉన్నా, లోకేష్ భవిష్యత్తు బాగుటుంది అంటూ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
విజయసాయి రెడ్డిని పీకి పడేసిన జగన్.. ఆయన ప్లేస్ లో ఎవరంటే...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని, విశాఖపట్నం బాధ్యతల నుంచి తొలగిస్తూ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత రాత్రి విడుదల చేసిన పార్టీ ఇంచార్జ్ ల జాబితాలో, విజయసాయి రెడ్డి పేరు విశాఖ నుంచి తొలగించినట్టు అర్ధం అవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయి రెడ్డి పై, భూ ఆక్రమణలకు సంబంధించి, పలు ఆరోపణలు, అదే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని పార్టీ నేతల నుంచి ఆరోపణలు రావటం, దీని పైన పలు సార్లు పంచాయతీలు జరగిన నేపధ్యంలోనే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది. విజయసాయి రెడ్డిని, ఆ బాధ్యతలు నుంచి తొలగిస్తూ, జగన్ బాబాయ్ వైవీ సుబ్బా రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. పార్టీ సమన్వయకర్తలు, ఇంచార్జ్ లను సమీక్షించే బాధ్యతలు ఇచ్చారు. అంటే పార్టీ మొత్తాన్ని ఇక సజ్జల నడపనున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం అందరికీ ఏదో ఒక జిల్లా ఇంచార్జ్ ఇచ్చిన జగన్, విజయసాయి రెడ్డికి మాత్రం ఒక్క జిల్లా కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కేవలం పార్టీ అనుబంధ సంఘాలను సమీక్షించే బాధ్యత ఒక్కటే ఇప్పుడు విజయసాయి రెడ్డి పైన ఉంది.
ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఒక నెల రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు ఆయనకు రెన్యువల్ అయ్యింది కాబట్టి, ఇక విజయసాయి రెడ్డికి మూడో సారి రాజ్యసభ రెన్యువల్ చేసే అవకాసం లేదని తెలుస్తుంది. దీంతో ఇక విజయసాయి రెడ్డి కేవలం తాడేపల్లి కేంద్రంగానే పని చేసే అవకాసం ఉంది. ఇక నియామకాల్లో విజయసాయి రెడ్డిని పీకేసినా, మిగతా అందరికీ ప్రాముఖ్యత పెంచారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి ఎక్కువ బాధ్యతలు అప్పగించారు. వీరి ఇద్దరికే, 62 నియోజకవర్గాలు అప్పచెప్పటంతో, ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధం అవుతుంది. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి చేతిలో పార్టీ మొత్తం ఆయన చేతిలోనే ఉంది. వైవీ సుబ్బారెడ్డికి అటు టిటిడితో పాటు, జిల్లాలు ఇచ్చారు. విజయసాయి రెడ్డికి మాత్రమే మొత్తం కట్ చేసేసారు. విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గిపోవటంతో, మొన్న జరిగిన తిరుపతి పర్యటనలో కూడా ఎవరూ ఆయన్ను కలవలేదు. కేవలం సోషల్ మీడియాతోనే విజయసాయి రెడ్డి నెట్టుకుని వస్తున్నారు.