ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, అన్ని విధాల సహకరిస్తామని ఎన్‌ఆర్ఐలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభ ప్రసంగించారు. "తెలుగువారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలో మీరంతా ముందుకు రావాలని ఆకాంక్షించాను. ఏం చేస్తే మనవాళ్లకు భవిష్యత్తు ఉంటుందో ఆరోజు అమెరికాలో ప్రవాసాంధ్రులతో సమాలోచనలు చేశాను. నాలెడ్జి ఎకానమీకి హైదరాబాద్ లో మొట్టమొదటి జ్ఞాపక చిహ్నంలా, గురుతుగా సైబర్ టవర్స్ నిర్మించాం. సరిగ్గా ఇరవై ఏళ్ల నాడు ఇదే రోజు సైబర్ టవర్స్ ప్రారంభమైంది. అంటే మన జైత్రయాత్ర ఇరవై ఏళ్ల కంటే ముందు ప్రారంభమైంది. ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాల సంఖ్య 25 నుంచి 30 మాత్రమే. నాలెడ్జి ఎకానమీలో భాగంగా, మా ప్రోత్సాహంతో 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి."

cbn udsa 24092018 2

"ఈ రెండింటితోనే ఐటీ విప్లవం ముందుకు సాగినట్లు కాదని భావించాను. అమెరికా వచ్చి పదిహేను రోజులు ఉన్నాను. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈఓలతో, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యాను. మా దగ్గర పుష్కల మానవ వనరులున్నాయి. మీరు వచ్చి కంపెనీలు పెట్టండి అని విజ్ఞప్తి చేశాను. వారిని ఒప్పించాను. జీవితంలో మొదటి సారి మన రాష్ట్రం దేశం వదలి 15 రోజులు అమెరికాలో ఉన్నాను. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ ‌గేట్స్ అపాయింట్ మెంట్ అడిగితే ఆయన రాజకీయ నాయకులతో నాకేమీ పనిలేదని చెప్పారు. కాదు. కాదు నాకు మీతో పని ఉందని బిల్ గేట్స్ ను ఒప్పించాను. ఎట్టకేలకు పది నిమిషాలపాటు నాతో మాట్లాడేందుకు అంగీకరించి అపాయింట్ మెంట్ ఇచ్చారు బిల్‌గేట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగ అభివృద్ధికి అవకాశాలు, అక్కడ మౌలిక సదుపాయాలపై నేనిచ్చిన ప్రజెంటేషన్ నలభై ఐదు నిమిషాలు కొనసాగింది. అమెరికా దాటి మైక్రోసాఫ్ట్ తన సంస్థ కార్యాలయం ఏర్పాటు చేస్తే అదీ భారత్ లో ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని బిల్ గేట్స్ ని కోరాను. అలా హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఆరోజు నాది ఒక స్వప్నం. నేడు నిజం. ఐటీ విప్లవ ఫలాలు అందుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను"

cbn udsa 24092018 3

"నేను కూడా రైతు కుటుంబంలో పుట్టాను. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ కార్యాలయం హైదరాబాద్ కు రావాలని కోరుకున్నాను. ఇవాళ అదే మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు బిడ్డ ఉన్నారు. అదీ మన సత్తా. మన తెలివి తేటలు. మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి కష్టపడి పనిచేయాలి. రెండోది జన్మభూమిని మరచిపోకూడదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు మనుగడ సాగించే సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్నిసంపాదించారు. ఎక్కడైనా సర్దుకుపోగలిగే అడాప్టబిలిటీ మీలో చాలా ఉంది. అందుకు మీకు నా అభినందనలు. ఇక్కడి పౌరులతో మీరు పాలై-నీళ్లలా కలసి పోవాలి. రాజకీయాలలో సహకరించాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. శ్రమదానం చేయండి. సామాజిక కార్యక్రమాలకు సహకరించండి." అని అన్నారు...

అరకు ఎమ్మెల్యే . మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపటం అనేది తీవ్రంగా ఖంచించాల్సిన విషయం... ప్రజాస్వామ్యంలో హింస కు తావులేదు, సమర్ధనీయం కాదు.. ఈ సంఘటన జరిగిన తర్వాత, కొన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ముసుగులో, పోలీసులు / ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టి, ఇది చంద్రబాబు వైఫల్యం అంటూ రాస్తున్నారు... అయితే ఈ పోలీస్ నోటీసులు చూస్తుంటే ఆ ఇద్దరిని ముందే పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ లిస్టులో ఉన్నారని, పోలీసులకు చెప్పకుండా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లవద్దని, వీలైనంతవరకూ సురక్షితప్రాంతాలలో ఉండాలని ముందే హెచ్చరించినట్లు క్లియర్ గా తెలుస్తుంది... అయినా ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోవటం అనేది దురదృష్టకరం..

kidari 24092018 2

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును జాగ్రత్తగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా వారి టార్గెట్‌లో ఉన్న మీరు బయటకు వెళ్లొద్దంటూ అరకులోయ ఎస్‌ఐ.. ఎమ్మెల్యేకు అందజేసిన హెచ్చరిక నోట్‌ను పోలీసుశాఖ విడుదల చేసింది. సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని లేఖలో కోరారు. ఈ నెల 21న సర్వేశ్వరరావు సంతకం చేసి ఆ లేఖను తీసుకున్నట్లు అందులో ఉంది. అయితే 23 వరకూ అప్రమత్తంగా ఉండాలని అందులో లేదు. 15 రోజుల క్రితమే ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశామని.. మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించామని సీఐ వెంకునాయుడు వ్యాఖ్యానించారు.

kidari 24092018 3

మరో పక్క, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల ప్రజలు సంయమనం పాటించాలని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విజ్ఞప్తిచేశారు. ప్రజలు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడవద్దని కోరారు. సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ప్రజలు సహకరించాలని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మావోయిస్టులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

రాఫెల్‌ కుంభకోణంలో నరేంద్ర మోడీ అడ్డంగా దొరిపోయారు. సమాధానం చెప్పలేక, పాకిస్తాన్ తో కలిసి కుట్ర పన్నుతున్నారు అంటూ, రాజమౌళి సినిమా కధలు చెప్తున్నారు. అయితే, ఇప్పుడు మోడీని ఈ విషయంలో మరింత ఇరుకున పెట్టటానికి, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో, బోఫోర్స్‌ పై, అన్న ఎన్టీఆర్ చూపించిన దారిలోనే నడుస్తుందా అంటే అవును అనే సమాచారం వస్తుంది. 1989లో కాంగ్రెస్ పార్టీ పై బోఫోర్స్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు, దేశంలో ప్రాధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండేది. ఎన్టీఆర్ సూచనల మేరకు, అప్పట్లో రాజీవ్ గాంధీ పై ఒత్తిడి తేవటానికి, విపక్ష ఎంపీలను రాజీనామా చేపించారు ఎన్టీఆర్...

rahul 23092018 1

అయితే ఇప్పుడు రాహుల్ కూడా అదే ఫార్ములా ఉపయోగించి, మోడీ పై ఒత్తిడి తేనున్నట్టు సమాచారం. రాఫెల్‌ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయకపోతే మూకుమ్మడి రాజీనామాల దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపాయి. తద్వారా, ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో పడిన నరేంద్ర మోదీ సర్కారును మరింత ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. నిజానికి, రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. కానీ, అందుకు మోదీ సర్కారు ససేమిరా అంటోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టబయలు చేయడానికి వీల్లేదని, ఈ మేరకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందని చెబుతూ వస్తోంది.

 

rahul 23092018 1

కానీ, ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ తాజా ప్రకటన కాంగ్రెస్‌కు వజ్రాయుధంగా మారింది. రిలయన్స్‌ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత ప్రభుత్వమే సూచించిందని, దాంతో, తమకు మరో దారి లేకపోయిందని ఆయన వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే, జేపీసీ ఏర్పాటు డిమాండ్‌ను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. జేపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించకపోతే బోఫోర్స్‌ స్కాం సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలు అనుసరించిన తరహాలోనే ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌ ఎంపీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మోదీ సర్కారుపై మరింత ఒత్తిడి తీసుకు రావడమే ధ్యేయంగా రాజీనామాలకు ఇతర ప్రతిపక్షాలతో కూడా కాంగ్రెస్‌ ముఖ్యులు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, ఛత్తీ్‌సగఢ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడానికి ముందే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్మడి రాజీనామా నిర్ణయం తీసుకుంటే మోదీ సర్కారు పూర్తిగా చిక్కుల్లో పడినట్లేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. చేతులు వెనక్కి కట్టి.. పాయింట్ బ్లాంక్‌లో దారుణంగా కాల్చి చంపేశారు. హత్యకు ముందు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు వివరాలు వెల్లడించాడు. రెండు వాహనాల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఇద్దరు డ్రైవర్లు, మరో ఆరుగురు కలిసి వెళ్తుండగా, ఆడవాళ్ళు అడ్డుగా వచ్చారని, అయితే వాళ్ళు ఏదన్నా సమస్య చెప్పుకోవటానికి ఆపుతున్నారు అనుకుని, స్లో చెయ్యగానే, వెంటనే నక్సల్స్ తమను చుట్టుముట్టారని తెలిపాడు.

kidari 23092018 2

వాహనాలు ఆపకుంటే బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారని.. అయినా ముందుకెళ్లడానికి ప్రయత్నించగా... 20మంది నక్సల్స్ తమకు అడ్డుగా వచ్చారని తెలిపాడు. ముందుకు పోవడానికి ప్రయత్నిస్తే ఎన్‌కౌంటర్ దారుణంగా ఉంటుందని తమను హెచ్చరించారని చిట్టిబాబు చెప్పాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాహనాన్ని ఆపేశానన్నాడు. సోమ ఎవరని అడిగారని... కారు దించి సోమ చేతులు వెనక్కి కట్టేశారని చిట్టిబాబు తెలిపాడు. గన్‌మెన్లు, డ్రైవర్‌లకు గురిపెట్టి వెపన్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. సర్వేశ్వరరావును కూడా చేతులు వెనక్కి కట్టి తీసుకువెళ్లారన్నాడు. తమను రౌండప్ చేయడంతో.. అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నాడు. వాళ్లిద్దరినీ దూరంగా తీసుకువెళ్లి.. సుమారు 40 నిమిషాల తర్వాత మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారన్నాడు చిట్టిబాబు. ఆ తర్వాత తాము పై అధికారులకు సమాచారమందించామని తెలిపాడు.

kidari 23092018 3

ఇది ఇలా ఉండగా, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో ఏవోబీ రాష్ట్ర కమిటీ మిలటరీ కమిషన్ కార్యదర్శి రాంచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ప్రతాప్ రెడ్డి కదలికలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఘటనా స్థలంలో యాక్షన్ టీమ్‌తో పాటు మావోయిస్టుల సానుభూతిపరులు కూడా ఉన్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయనను మిలటరీ కమిషన్ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ నియమించింది. అతని ఆధ్వర్యంలోనే యాక్షన్ టీమ్ పనిచేస్తోంది. ఈ యాక్షన్ టీమే కిడారి, సోమల హత్యలకు కారణమని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read