పవన్ కళ్యాణ్ - బీజేపీ మధ్య బంధం గురించి అందరికీ తెలిసిందే. అమిత్ షా డైరెక్షన్ లో పవన్ పండిస్తున్న కామెడీ, చూస్తూనే ఉన్నాం. అయితే, వీరు ఇరువురు కలిసిపోయారు అనే విషయం బయటకు తెలియకుండా మ్యానేజ్ చేస్తున్న కొన్ని సందర్భాల్లో దొరికిపోతూ ఉంటారు. తాజగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఏపి బీజేపీ ఎమ్మెల్యే చేసిన హంగామా చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో రాజమండ్రి బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొనడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

pk 02092018

కేకు కోయడమే కాకుండా పలువురు పేద మహిళలకు చీరలను జనసేన కార్యకర్తలతో కలిసి పంపిణి చేసారు. దీనితో ఈ చర్యపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గతంలో కూడా బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య చేసిన హంగామా అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో చేసిన నిరసనకు మద్దతుగా, రాజమహేంద్రవరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య, ఆకుల లక్ష్మీ పద్మావతి ఒక రోజు దీక్ష చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

pk 02092018

జనసేన పార్టీ కండువ మెడలో వేసుకుని బీజేపీ ఎమ్యెల్యే ఆకుల సత్యనా రాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మాతి, మరికొద్ది మంది మహిళామణులతో కలసి దీక్షలో కూర్చున్నారు. కాగా బీజేపీకి చెందిన రాజమహేంద్రవరం నగర శాసన సభ్యుడు ఆకుల సత్యనారాయణ, ఆయన భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపట్టడం, ఈ రోజు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గునటం పై బీజేపీ వర్గాలు విస్మయం చెందాయి. ఈ విషయం బీజేపీ నాయకులు మధ్య ఆంతరంగిక సమావేశంలో చర్చకు దారితీ సింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజకీయ భవితవ్యం పై ముందస్తు వ్యూహాలను బహిర్గతం చేసేందుకే ఇలా చేస్తున్నారా అని ఆ పార్టీ నాయకులు సందేహపడుతున్నారు. మరో పక్క, జనసేన అయినా మనం చెప్పినట్టే ఉంటారుగా, ఏమి కాదులే అని, కొంత మంది బీజేపీ నేతలు అంటున్నారు.

అసాధ్యం సుసాధ్యమవుతుంది.. ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 57 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.

jagan 02092018 2

నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ అద్భుతం చూడటానికి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఫ్రీగా బస్సులు పెడుతూ ఉండటంతో, రైతులు వచ్చి చూస్తున్నారు. దీంతో పోలవరం సందర్శనకు వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును చూసిన వారి సంఖ్య లక్షా రెండు వేలు దాటింది.

jagan 02092018 3

ఇంత మంది ప్రజలు వచ్చి ఈ అద్బుతం చూస్తున్నా, మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి మాత్రం, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ చుదలనిపించలేదు. ఎందుకో మరి, ఆయనకే తెలియాలి. ఇదే విష్యం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకూ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షా 2వేల మంది సందర్శించారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత జగన్‌కు మాత్రం అక్కడికి వెళ్లే తీరక లేదని ఎద్దేవా చేశారు. మాట్లాడితే రాజన్న రాజ్యం తెస్తానని చెబుతున్న జగన్‌.. ఆయన హయాంలో మంత్రులు, ఐఏఎస్‌లు జైలుకెళ్లిన విషయం గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. రైతులకు మేలు చేద్దామని ప్రాజెక్టులు కడుతుంటే.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేసేందుకు సభలు నిర్వహిస్తుంటే అల్లరిమూకల్ని పంపి భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ కుట్రల ట్రాక్‌ రికార్డు ప్రజలం దరికీ తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ విషయం ప్రస్తావించారు. ఏదో విధంగా విద్వేషాలు సృష్టించి అశాంతిని నెలకొల్పాలన్నదే ఆ పార్టీ ప్రయత్నమని మండిపడ్డారు.

cbn jagan 0209218 2

నారా హమారా- టీడీపీ హమారా సదస్సు విజయవంతం అవడంతో అక్కసుతో ఆ వర్గానికి చెందిన యువతను కేసుల్లో ఇరికిచ్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇది వైకాపా నేర ప్రవృత్తికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో, కృష్ణా జిల్లా కలెక్టర్‌తో ప్రవర్తించిన సంఘటనలు జగన్‌ అహంభావానికి నిదర్శనమని, వీటిని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి పెడదోరణిలన్నీ వైకాపా ఆవిర్భావం తరువాతే జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

cbn jagan 0209218 3

వైకాపా ప్రజల పట్ల బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని, పార్లమెంట్‌, అసెంబ్లి సమావేశాలకు హాజరు కాకుండా మత ఘర్షణలు రెచ్చగొట్టే దోరణిలో ఉందని వైకాపాపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేర పూరిత వ్యవహారాల శైలి ప్రజలందరికీ తెలుసన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికి జగన్ తగడని, రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పెడధోరణులన్నీ వైసీపీ ఆవిర్భావం తర్వాతే జరుగుతున్నాయని, టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ నేతలకు సూచించారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను కేవలం యాభై నెలల్లోనే నెరవేర్చడం ఒక రికార్డుగా చంద్రబాబు అభివర్ణించారు.

ఎప్పుడూ హాట్ హాట్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్స్ తో కూల్ గా ఉన్నాయి... ఒక పక్క తన సమకాలీకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. మరో పక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపాకుడి కొడుకు, హరికృష్ణ జయంతి. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. చంద్రబాబు వీరి ముగ్గురి గురించి ట్వీట్ చేసారు. రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేసారు. హరికృష్ణ జయంతి సందర్భంగా, ఆయన్ని గుర్తు చేసుకుంటూ, వారి స్పూర్తితో ముందుకు వెళ్తామని ట్వీట్ చేసారు.

wishes 02092018 2

ఇకజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు, పవన్ కి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబుని పర్సనల్ గా టార్గెట్ చేసినా, చంద్రబాబు మాత్రం పవన్ కి విషెస్ చెప్పారు. లోకేష్ కూడా విష్ చేసారు. మరో పక్క తనను ఎంతో ఇబ్బంది పెట్టిన రాజశేఖర్ రెడ్డికి కూడా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో ఎన్ని ఉన్నా, ఒక పద్ధతి అనేది, నేటి తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. చంద్రబాబు ఎప్పుడూ లైన్ దాటి విమర్శలు చెయ్యరు.

wishes 02092018 3

నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా అనేక సందర్భాల్లో చాలా మందికి విషెస్ చెప్పారు... ప్రధాన మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు... పండగలప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతారు.... పోయిన ఏడాది, ఏకంగా అందరూ టీవీలో లైవ్ చూస్తూ ఉండగా, అసెంబ్లీ సమావేశాలు జారుతూ ఉండగా, జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు విషెస్ చెప్పారు... చంద్రబాబు స్వయంగా జగన్ సీట్ దగ్గరకు వెళ్లి విషెస్ చెప్పారు... వైఎస్ఆర్, హరికృష్ణ అంటే మన మధ్య లేరు కాబట్టి, ఏమి చెయ్యలేం... కనీసం పవన్ అయినా, చంద్రబాబు ట్వీట్ కి రిప్లై ఇచ్చి, గౌరవప్రదంగా రాజకీయాలు చెయ్యాలు చెయ్యాలని ఆశిద్దాం...

Advertisements

Latest Articles

Most Read