కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన విజయవాడ గేట్ వే హోటల్‌కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గేట్‌వే హోటల్‌లో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది.

kuamra 31082018 2

సీఎంతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు పర్యటనకు వెళ్తూ మధ్యలో ఆగి కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు. చంద్రబాబు-కుమారస్వామి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా తాము కలిసినట్లు చెప్పారు. ఎన్డీయేను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతామని చంద్రబాబు స్పష్టంచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు మరోమారు భేటీ అవుతామని చెప్పారు.

kuamra 31082018 3

కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాత ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏను ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. అలాగే.. మేమంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాం... దేశానికి మూడో ప్రత్యామ్నాయం అవసరం లేదని బీజేపీ అనడంలో ఆశ్చర్యం లేదు అని కుమారస్వామి అన్నారు. కుమారస్వామి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరివెళ్తారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌తో హరికృష్ణకు ఎంతో అనుబంధం ఉంది. దీంతో ఆయన పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి, నివాళులు అర్పించాలని టీడీపీ నేతలు భావించారు. అయితే, అంతకుముందే నార్కెట్‌పల్లి ఆస్పత్రి నుంచి భౌతిక కాయాన్ని హరికృష్ణ నివాసానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి నేరుగా మహా ప్రస్థానానికే వెళ్లాలని, మధ్యలో ఎక్కడైనా ఆపితే, మళ్లీ ఇంటికి తీసుకొచ్చి స్నానాదికాలు చేయాలని పండితులు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి మళ్లీ వెనక్కు ఇంటికి తీసుకువెళ్లడం సరికాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు.

hari 31082018 2

ఇక, అంతిమయాత్ర ప్రారంభం అయ్యే సమయంలో హరికృష్ణ కుటుంబ సభ్యులను చంద్రబాబు పిలిచి మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న హరికృష్ణ దేహంపై పార్టీ పతాకం కప్పుతామని, వారికి అభ్యంతరం లేకపోతే ఆ పని చేస్తామని చెప్పారు. వారు అంగీకరించడంతో ఆయన పార్టీ పతాకం కప్పారు. గురువారం రాత్రికి ఆయన విజయవాడకు తిరిగి వచ్చారు. మంత్రులు, పార్టీ సీనియర్లు, రెండు రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ రెండు రోజులూ అక్కడే ఉండిపోయారు. గతంలో పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కూడా చంద్రబాబు పాదయాత్రను ఆపేసి... హుటాహుటిన శ్రీకాకుళం వెళ్లి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఉన్నారు.

పుట్టపర్తి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమాదేవి (56) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం 3.46 గంటలకు తుది శ్వాస విడిచారు. బాలాజీ విద్యాసంస్థల తరపున తమ విద్యా సంస్థల తరపున అనేకమంది ఉపాధి చూపారు. ఉమాదేవి మృతితో పుట్టపర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె బౌతికాయన్ని హైదరాబాద్ నుంచి అనంతపురంలోని అలమూరు రోడ్డు లోని పీవీకేకే కళాశాల వద్ద ఉన్న పల్లె నివాసానికి తరలిస్తున్నారు. అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు ఉమాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పల్లెను ఓదార్చారు.

palle 31082018 2

నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లలకు ఉమా దేవి ఉచితంగా విద్య అందించారు. ఆమె చేసిన సేవ రఘునాథరెడ్డికి రాజకీయంగానూ ఉపయోగపడింది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో రఘునాథరెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. ఉమా దేవి మృతితో అనంతపురంలోని పుట్టపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథరెడ్డిని పరామర్శించారు. సీఎంతో ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.

శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో రూ.140 కోట్లతో శ్రీవేంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిని తిరుపతిలో నిర్మించడం అదృష్టంగా వర్ణించారు. ఆస్పత్రిని మొదటి దశలో 350 పడకలు, రెండో దశలో వేయి పడకలతో నిర్మించనున్నట్లు వివరించారు. ఆస్పత్రి కోసం తితిదే 25 ఎకరాల స్థలం కేటాయించిందని, శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టాటా ట్రస్టు ఛైర్మన్‌ రతన్‌ టాటా చేతులు మీదుగా జరుగుతుందని చెప్పారు. కేన్సర్‌ వ్యాధి నివారణకు రతన్‌ టాటాతో పాటు ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని చర్యలు చేపట్టారని వివరించారు.

tata 31082018 2

మన రాష్ట్రంలో ఏటా 50 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు పూర్తయితే, ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను చాలావరకు నిరోధించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం రోగుల్లో 60 శాతం మంది పేదలకు అతితక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్సలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 2019లోనే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి 300 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించేలా ట్రస్ట్ ప్రణాళిక రూపొందించుకుది, 20 లీనియర్ యాక్సిలేటర్లతో రేడియేషన్ ఆంకాలజీలు విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు టాటా ట్రస్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫలితంగా రోగులు ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు రేడియేషన్ చికిత్సలు పొందగలుగుతారు.

tata 31082018 3

రోగులు, అటెండర్లకు వసతి సదుపాయం కోసం ధర్మశాలను కూడా ఆస్పత్రి ఆవరణలో నిర్మించనున్నారు. తద్వారా రోగులు తక్కువ ఖర్చుతో ఇక్కడే ఉండి చికిత్స చేసుకోవచ్చు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేస్తారు. ట్రస్ట్ నిర్వాహకులు మూడేళ్ల క్రితమే దీని పై టీటీడీని సంప్రదించారు. అప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ద్వారా సాంకేతిక సేవలు పొందుతున్న టీటీడీ ఆసుపత్రి పై తమ వంతు సహకారం అందించడానికి ఆమోదించింది. ఈ క్రమంలో గత ఏడాది మే 5న శ్రీవారి సన్నిధిలోని రంగనాయకుల మండపంలో అప్పటి ఈవో సాంబశివరావు, టాటా గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటరమణన్ మధ్య ఒప్పందం కుదిరింది. రూ140 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే క్యాన్సర్ ఆస్పత్రికి టాటా ట్రస్ట్ రూ.100 కోట్లు కేటాయించగా, టీటీడీ తన దాతల నుంచి మరో రూ.40 కోట్లు సమీకరించేలా ప్రాథమికంగా ఒప్పందంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందుకోసం అలిపిరి వద్ద ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సమీపంలో 25 ఎకరాల స్థలాన్ని టీటీడీ లీజు పద్దతిలో టాటా ట్రస్టీకు కేటాయించింది.

Advertisements

Latest Articles

Most Read