కూర్చొని తిన్నా తరగని ఆస్తి. వేలు, లక్షలు కాదు. ఏకంగా రూ.12,000 కోట్లు. దానికి రోజూ కొన్ని కోట్లు జమవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అలాంటి ఆస్తిపరుడైన కుబేరుడు తన చిన్నబుద్ధిని బయటపెట్టుకున్నాడు. పెద్దనోట్ల రద్దు సమయంలో చకచకా వేల కోట్లు సంపాదించిన ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన పేటీఎం సృష్టికర్త విజయ్‌ శేఖర్‌ కేరళ వరద బాధితులకు పదివేల రూపాయల విరాళం ఇచ్చారు. అంతే కాదు ‘‘నేను నా వంతుగా కేరళ ప్రజలకు రూ 10000 విరాళమిచ్చాను. మీరు కూడా పేటీఎం ద్వారా మీ విరాళాలను చెల్లించండి’’ అని విజయ్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడితున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో బిలియనీర్‌గా అవతరించిన విజయ్‌ పదివేలు విరాళం ఇవ్వడం ఏంటని పెదవి విరుస్తున్నారు.

paytm 19082018 2

కేవలం 48 గంటల్లోనే పేటీఎం ద్వారా మూడు కోట్ల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. కానీ దాదాపు రెండు బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న పేటీఎం అధినేత పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు చూడండంటూ విజయ్‌ చేసిన ట్వీట్‌ను స్ర్కీన్‌ షాట్‌ తీసి మరీ పోస్ట్‌ చేస్తున్నారు. 2017 డిసెంబర్‌లో ఫ్లాగ్‌డే సందర్భంగా విజయ్‌ భారత సైనిక దళాలకు 500 రూపాయలు విరాళం ఇలాగే విమర్శల పాలయ్యాడు. బిలియనీర్‌గా ఉన్న వ్యక్తి అంతకొద్ది మొత్తం ఇవ్వడంపై విమర్శలు ఎదురయ్యాయి. అనంతరం ఆయన స్క్రీన్‌షాట్‌ను తొలగించారు. అయితే కొందరు ఆయనకు మద్దతుగా కూడా నిలిచారు.

paytm 19082018 3

అయితే, ఇంత డబ్బు అర్జిస్తున్న పేటీఎం సంస్థ వ్యవస్థాపకుడు కేవలం పది వేలు సహాయం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రూ.12 వేల కోట్ల అధిపేతి అయిన విజయ్ శేఖర్ అంత తక్కువ మొత్తం సహాయం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఆయన భారత ఆర్మీకి రూ.500 విరాళం ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలానే ట్రోలింగ్ కు గురవుతున్నారు. అయితే, వెంటనే తేరుకున్న విజయ్ శేఖర్ సదరు ట్వీట్ ను డిలీట్ చేశారు. పేటీఎం ప్రజల ద్వారా రూ. 3 కోట్ల విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని కేరళకు అందించనుంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలపై శనివారం పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన తెలంగాణశాఖ ముఖ్య నేతలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వ్యూహాత్మక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికలను ఎదుర్కొనే అంశంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సమన్వయ కమిటీ, జిల్లా కమిటీల నియామకాన్ని వెంటనే ప్రారంభిస్తామని, ఈ మొత్తం ప్రక్రియ రెండు, మూడు వారాల్లో పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.

pk 19082018 2

కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చేసిన ప్రకటనలు ఈ సమావేశం దృష్టికి వచ్చాయని, అయితే ముందు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తంచేసే పనిలో నిమగ్నం అవుదామని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తెలంగాణ నేతలు పవన్‌ దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని వచ్చే సమావేశంలో చర్చిద్దామని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదు గురించి పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి నేమూరి శంకర్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 15 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలని పవన్‌ సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జనసేన భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

pk 19082018 3

శనివారం జరిగిన ప్యాక్‌ సమావేశంలో ముత్తా కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కమిటీల నియామ కానికి జరుగుతున్న పనులపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో పార్టీకి చెందిన ఐటీనిపుణులు సమావేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన ఐటీ నిపుణులే కాకుండా ఎన్‌ఆర్‌ఐలు కూడా సమావేశంలో పాల్గొంటారు. వేలాదిమంది సమావేశంలో పాల్గొనడానికి తమ సంసిద్దత తెలుపుతూ పార్టీ పరిపాలన కార్యాలయానికి వర్తమానం పంపుతున్నారని జనసేన మీడియా హెడ్‌ హరిప్రసాద్‌ తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమిపాలు కావటం తథ్యమని అంచనాలు చెబుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన తరువాత నాలుగు నెలలకు లోక్‌సభ ఎన్నికలు జరిపించటం ఆత్మహత్యాసదృశ్యమని బీజేపీ అధినాయకులు భావిస్తున్నారు.

modishah 19082018 2

జమిలి ఎన్నికల పేరుతో నాలుగు రాష్ట్రాల ఎన్నికలను లోక్‌సభ ఎన్నికల వరకు వాయిదా వేయాలని బీజేపీ అధినాయకత్వం మొదట భావించటం తెలిసిందే. లోక్‌సభతోపాటు పదకొండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల జరిపించటం ద్వారా మొదటి దశ జమిలి ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. జమిలీ కుదరదు అని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పటంతో, ఇప్పుడాయన నాలుగు రాష్ట్రాలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిపించాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, ఆ తరువాత వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరగవలసి ఉన్న లోక్‌సభ ఎన్నికల మధ్య సమన్వయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశంపై నరేంద్ర మోదీ పార్టీ సీనియర్ నాయకులు, వ్యూహకర్తలతో అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు ఒక సీనియర్ నాయకుడు వెల్లడించారు.

modishah 19082018 3

డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల శాసనసభలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరిపించటం వలన ఆశించిన ఫలితాలను సాధించగలుగుతామా లేదా అని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. గతంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పడు ఇండియా షైనింగ్ పేరుతో లోక్‌సనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమిపాలు కావడం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరగవలసిన లోక్‌సభ ఎన్నికలను ఆరు నెలల ముందు డిసెంబర్‌లో జరిపించుకోవటం ద్వారా విజయం సాధించగలుగుతామా అనేది బీజేపీ నాయకులను వేధిస్తున్న ప్రశ్న.

జిల్లాల్లో చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాల వల్ల చెరువుల్లో నీటిని నిల్వచేసి సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్న ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థ నీటి నిర్వహణ ద్వారా రైతులకు తగిన విధంగా అండగా నిలిచామని సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాల సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పార్టీ నాయకులు, కార్యకర్తలు వివరించాలని పిలుపునిచ్చారు.

cbn 19082018 2

ఈ ఏడాది డిసెంబర్ లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులలో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 75 రోజులు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. రానున్న 60 రోజుల్లో అన్ని గ్రామాలు, వార్డులలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. ఇంకా ఎవరినీ ఉపేక్షించేది లేదని, అందరూ ప్రజలతోనే ఉండి, వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా చెరువులు నింప గలిగామని ప్రభుత్వం చేపట్టి పూర్తిచేస్తున్న ప్రాజెక్టుల వల్లే చెరువుల్లోకి నీరు చేరిందని తెలిపారు. రైతులకు మనం అండగా ఉంటామనే భరోసా ఇవ్వాలన్నారు.

cbn 19082018 3

ఈనెల 28న ‘నారా హమారా..టీడీపీ హమారా’ నినాదంతో నిర్వహించే మైనారిటీల సదస్సు విజయవంతంపై నాయకులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సదస్సుకు మైనారిటీలంతా తరలివచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా మైనారిటీ నాయకులు, పార్టీ ముఖ్యులతో ఈ విషయమై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చర్చించారు. మైనారిటీల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం నాలుగేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.200 కోట్లు ఉన్న మైనారిటీల బడ్జెట్‌ను ప్రస్తుతం రూ వెయ్యి కోట్లకు పైగా పెంచామని గుర్తుచేశారు.

Advertisements

Latest Articles

Most Read