తాను దూర సందు లేదు, మెడకో డోలు అన్నాడు అంట వెనుకటి ఒకడు.. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితే అర్ధం కాకుండా ఉంటె, శ్రీకాకుళం బీజేపీ నేతలు మాత్రం, పవన్ వల్ల మేము గట్తెక్కుతాం, వచ్చే ఎన్నికల్లో సీట్లు కొట్టేస్తాం అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో క్యాడర్‌ లేకపోవడం ఒకెత్తయితే ఉన్న వారు కూడా జనంలోకి వెళితే తమకు ఆదరణ ఉండదనే భయంతో అక్కడక్కడ కార్యక్రమాలకే పరిమితమవు తున్నారు. మరో పక్క ఎన్నికలు సమీపి స్తుండడంతో సొంతం గా పోటీ చేయాలా? పొత్తులు ఉంటాయా? అనే స్పష్టత లేక అడుగులు ఎటు వేయాలో తెలియని అయోమయం నెలకొంది.

bjp 30072018 2

టీడీపీ, వైసీపీ, జనసేన అస్త్ర శస్త్రాలతో ముందుకు పోతుండగా మొన్నటి వరకు నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇప్పుడు తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామనే నినాదంతో మళ్లీ జనంలోకి వెళ్లడం మొదలుపెట్టింది. కానీ బీజేపీ మాత్రం ఏం చేయాలో తెలియక ఎన్నికల వ్యుహం లేక చతికిల పడింది. అయితే ఎన్నికల్లో పోటీచేయాలన్న అంశం లో ఒకసారి సొంతంగా పోటీకి దిగుతామని అగ్రనేతలు చెబుతున్నారు. కానీ జనసేనతో పొత్తు ఉండవచ్చనే అంతర్గత సమాచారం పార్టీ నేతల వరకు పాకింది. దీంతో జిల్లా నేతలు సైతం సొంతంగా పోటీ చేస్తే ఒరిగేదేమీ ఉండదని, అందుకే జనసేనతో పొత్తు ఉంటే కొంత వరకైనా ప్రజయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

bjp 30072018 3

పవన్ కళ్యాణ్ వల్ల మనం గట్టెక్కుతామని, కొన్ని సీట్లు కూడా వస్తాయని అంటున్నారు. ఈ దిశగా అధిష్టానం మరింత చురుకుగా వ్యవహరించి, పవన్ తో పొత్తు పెట్టుకునేలా చేస్తే, ఇక వార్ వన్ సైడ్ అయిపోతుంది అంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడివేణుగోపాలం లేదా దుప్పల రవీంద్రబాబు పోటీ చేయాలని భావిస్తున్నారు. పలాస నుంచి మాజీ ఎంపీ కణితి విశ్వనాథం లేదా ఆయన తనయుడు లేదా తనయురాలికి టిక్కెట్‌ ఇవ్వాలనుకుంటున్నారు. పవన్ తో పొత్తు ఉంటే, ఈ సీట్లు అడుగుదామని, జిల్లా నేతలు అంటున్నారు.

లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రాష్ర్టాభివృద్ధికి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఆంధ్రా బిడ్డలా... లేక ఢిల్లీ తొత్తులా..? అని ప్రశ్నించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంలో బీజేపీ ఎంపీలు సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలపై తప్పుడు ప్రచారం చేస్తూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

renuka 30072018 2

విశాఖకు రైల్వేజోన్‌ వ్యవహారంపై బీజేపీకి చెందిన ఒక మంత్రి జోన్‌ ఇస్తామని, మరొక ఎంపీ ఇవ్వడం కుదరదని విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రైల్వేజోన్‌ విషయంలో తమకెలాంటి అభ్యంతరం లేదని ఒడిసాకు చెందిన ఎంపీ చెప్పినప్పటికీ బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాటం చేస్తున్న చంద్రబాబుపై బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీరాజ్రు, నరసింహారావు, ఇతర నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు.

renuka 30072018 3

కన్నా 12 అంశాలతో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించలేదని అన్నారు. జగన్‌, పవన్‌ ప్రత్యేక హోదా వ్యవహారంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా ముఖ్యమంత్రిపై దాడి చేస్తున్నారన్నారు. వారిద్దరూ ఢిల్లీలో పోరాటం చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా టీడీపీని ప్రజలు గెలిపిస్తారని ఆమె చెప్పారు.

‘‘కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై వైసీపీ అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకోకపోతే కాపుల ఆగ్రహానికి గురవ్వక తప్ప దు’’ అని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్‌ అన్నారు. వీజేఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెప్పడం రాజకీయ తప్పిదమవుతుందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కమిటీ వేయడం, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని శాసనసభ ఆమోదించి, కేంద్రానికి పంపిన విషయం తెలిసిందేనన్నారు. కాపులకు రిజర్వేషన్‌పై జగన్‌ ఇలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిచిందన్నారు.

jagan 30072018 4

వైసిపీ పార్టీలోని కొంత మంది కాపు నేతలు సమావేశం అయ్యారు. కేవలం కావాలనే రిజర్వేషన్లు మీకు అందవంటూ చాలా తేలిగ్గా జగన్‌ ప్రకటన చేశారని, అంతేతప్ప పోరాటం చేసైనా సాధించుకుంటామని ఒక్క ముక్క కూడా చెప్పకుండా, అసలు సిసలైన మనసులో మాటను ఇప్పటికైనా బయట పెట్టారంటూ దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ చేసిన కీలక ప్రకటన దృష్ట్యా ఆదివారం నాడంతా కాపు నేతలంతా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఎవరు నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చ. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు. ఇదే తరుణంలో స్వపక్షంలోనూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సామాజికపరంగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి అలవికాకుండా పోయింది. కీలక సమయంలో జగన్‌ ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందోనని వైసీపీ నేతలు పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

jagan 30072018 3

విధాన నిర్ణయాల్లో చర్చించకుండానే, బహిరంగ ప్రకటన చేస్తున్నారని, దీని ప్రభావం నేరుగా పార్టీపై పడుతుందని, అందునా కాపులకు కంచుకోట అయిన తూర్పు గోదావరిని ఈ ప్రకటన చేసేందుకు వేదికగా వాడుకోవడం మరింత చేటైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతో ఇంతో బలపడుతున్నామని భావిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీకి తాజా ప్రకటన నష్టదాయకమేనని తేల్చిచెబుతున్నారు. కాపు సామాజిక వర్గంలోని నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదో చేస్తారనుకుంటే అది మా వల్లకాదంటూ ముందుగానే పారిపోయారంటూ మిగతా పార్టీల్లోని కాపు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రుణమాఫీ పథకాన్ని తెలుగుదేశం తెరముందుకు తెచ్చిన తరువాత రైతుల్లో కొంత ఆత్మసంతృప్తి కనిపించిందని, సరిగ్గా అదే సమయంలో రుణమాఫీ మేం చేయలేమని జగన్‌ తెగేసి చెప్పి చేతులు కాల్చుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

బీజేపీతో కలిసి పవన్‌, జగన్‌ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మంత్రులు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని, మోదీని మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, శిద్దా రాఘవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌, జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్, పవన్ లు, ముందు మోడీ అనే మాట నోటిలో నుంచి పలకాలని సవాల్ విసిరారు.

pawan 3007218 2

మంత్రి లోకేశ్‌పై చేస్తున్న ఆరోపణలను పవన్‌ నిరూపించాలని మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. ఇతరులపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింనందునే మోదీని తాము వ్యతిరేకించామన్నారు. చంద్రబాబును విమర్శిస్తారు గానీ, మోదీని మాత్రం ఒక్క మాట కూడా అనకపోవడం వెనక కారణమేంటని ప్రశ్నించారు. పోరాటం చేస్తున్న వారినే బలహీన పరిచే ఉద్యగం పవన్ తీసుకున్నాడు అని, ఇవి ఆంధ్రప్రదేశ్ లో కుదరవు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.

pawan 3007218 3

కేసుల మాఫీ కోసమే జగన్‌ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారని మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చేవారు తమ విధానాలు చెప్పాలని పవన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యక్తిగత ఆరోపణలనే అజెండాగా మార్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు లేవని, రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ధర్మపోరాట దీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతిస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read