రాజకీయాల్లో నాయకుడుకి హుందా అనేది ఎంతో ఉండాలి. మనం మాట్లాడే మాటలను బట్టే, మన కార్యకర్తలు మనలను ఫాలో అవుతారు. అది మంచి అయినా, చెడు అయినా అంతే.. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అదే విషయం పవన్ ఫాన్స్ ప్రచారం చెయ్యటం చూసాం. మాటి మాటికి, లోకేష్ ని, చంద్రబాబు అనుభవాన్ని వ్యంగంగా, వెకిలిగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, తరువాత పవన్ ఫాన్స్ అదే రకంగా, సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ చూస్తున్నాం. అయితే, పవన్ ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా, ఏ నాడు లోకేష్ కాని, చంద్రబాబు కాని వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యలేదు. లోకేష్ కూడా, ట్విట్టర్ లో సంభోదించే సమయంలో, పవన్ కళ్యాణ్ గారు అనే సంభోదించేవారు. అయితే, పవన్ మాత్రం, జగన్ స్నేహం కోసం తహతహ లాడుతున్నారు.

jagan 24072018 2

అయితే, ఈ రోజు జగన్ మాత్రం తను ప్రతిపక్ష నాయకుడు అనే విషయం మర్చిపోయి, ఉందాతనం వదిలేసి, మాట్లడారు. పవన్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసారు. పవన్ కు ఎమన్నా విలువలు ఉన్నాయా, నలుగురు నలుగురు పెళ్ళాలు ఉన్నారు. కార్లు మార్చినంత ఈజీగా పవన్‌ కల్యాణ్ పెళ్లాలను మార్చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ ఇప్పటికే నలుగురు పెళ్లాలను మార్చేశారని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి నైతికత.. నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్, సామర్లకోటలో ఈ వ్యాఖ్యలు చేశారు.

jagan 24072018 3

"మన ఖర్మ కొద్దీ పవన్‌ లాంటోళ్లు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది" అని జగన్ వాపోయారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్ అని, వ్యక్తిగత జీవితం ముడిపెట్టి, జగన్ తీవ్ర విమర్శలు చేసారు. పవన్ నిత్య పెళ్ళికొడుకు అని, మరొకడని అయితే, బొక్కలో వేసేవారని పవన్ పై వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా మాట్లాడాల్సిన చోట, వ్యక్తిగత జీవితాలు తెచ్చి, కొత్త తరహా రాజకీయం మొదలు పెట్టాడు జగన్. ఇది ఇంకా ఇంకా ఎంత దిగజారి పోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా, ఇప్పటికైనా గాలి కబ్రులు మాట్లాడటం ఆపేసి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాకుండా, హుందా రాజకీయం చెయ్యాలి. ఇక జగన్ గురించి, మనం చెప్పేది ఏముంటుంది. వాళ్ళ రాజకీయమే దిగజారుడు రాజకీయం...

మొన్న గల్లా ఇంగ్లీష్ లో, రామ్మోహన్ హిందీలో, మోడీని ఎలా వాయించారో చూసాం. ఈ రోజు రాజ్యసభలో సియం రమేష్ తెలుగులో, దంచి కొట్టారు. సియం రమేష్ స్పీచ్ అందరికీ వారి వారి భాషల్లో తర్జుమా అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. పలువురు సభ్యులు మాట్లాడిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెబుతూ విభజనకు ముందు రాష్ట్రంలో విద్యా సంస్థలు లేవన్నట్టుగా మాట్లాడటంపై రమేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రత్యేక ప్యాకేజీలో అన్నీ చేస్తామంటే ప్రత్యేకహోదాను వదులుకున్నామని.. రెండేళ్లు అయినా దాన్ని పట్టించుకోలేదన్నారు.

ramesh 24072019 2

. ఏపీ ప్రజలంటే ఎందుకు అంత నిర్లిప్తతని ప్రశ్నించారు. యూపీకి, మహారాష్ట్రకు, గుజరాత్‌కు వెళ్లిన ప్రధానికి ఏపీకి రావడానికి సమయం లేదన్నారు. ఓట్లు, సీట్లు లేకే అలా చేశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు పరిణతి లేదని అంటున్నారని.. మోదీ కంటే ఏడేళ్ల ముందు చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు. అంతటి నాయకుడికి పరిణతి లేదని ఎలా అంటారన్నారు. ప్రాంతీయ పార్టీలను అణచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని.. కేంద్రమంత్రులు, ఎంపీలు సత్యదూరాలైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని విమర్శించారు.

ramesh 24072019 3

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని రుజువు చేస్తే నేను ఇప్పుడే పదవికి రాజీనామా చేసి పోతా. ఎక్కడ చెప్పారో చూపించమనండి. తెదేపా ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వబోమని, దానికి సమానమైన ప్రయోజనాలు చేకూరుస్తామని అన్నారు గనకే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. ఇప్పటికి రెండేళ్లు గడిచినా ఒక్క పైసా కూడా మాకు రాలేదు. మా సీఎం చంద్రబాబు 29 సార్లు దిల్లీకి వెళ్లి కాళ్లరిగేలా తిరిగితే ఒక్కపైసా కూడా విదల్చకుండా ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నామంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం. ఏపీ ప్రజలంటే ఎందుకింత నిర్లక్ష్యం? తమ భాగస్వామ్య పక్షంగా ఉన్న తెదేపా పాలిస్తున్న ఏపీకి ప్రధాని ఒక్కసారైనా వచ్చారా? ఏపీకి రాకుండా అమెరికాకు నాలుగేసార్లు పోతారా? భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లారు? అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బీజేడీ సభ్యుడు ప్రసన్న ఆచార్య అన్నారు. విభజన సమస్యలపై రాజ్యసభలో జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగిస్తూ ఇద్దరు ప్రధానులు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారనీ, అది అమలు జరిగి తీరాల్సిందేనని అన్నారు. కేంద్రంలోని మెడీ సర్కార్ వైఖరి వల్ల సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక్కటే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఓడిశాకు ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామని ఆయన అన్నారు.

bjd 24072018 2

ఒడిశాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని అన్నారు. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆచార్య.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా పక్కపక్క రాష్ట్రాలేనని, ఏపీ సమస్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు. కేంద్రం సవతతల్లి ప్రేమను తామూ రుచిచూశామన్నారు.

bjd 24072018 3

ప్రత్యేక హోదా పొందాల్సిన అర్హతలు ఏపీకే కాదు.. ఒడిశాకూ ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య దేశానికి దేవాలయంలాంటి పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, ఇద్దరూ తమ హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఫెడరలిజానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని టీఎంసీ ఎంపీ ఒబ్రియాన్ డిమాండ్ చేశారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ఒక రకంగా, స్నేహం విడిపోయినప్పుడు మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంఅమలుపై మంగళవారం నాడు రాజ్యసభలో నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో ఎందుకు వివక్షను చూపుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీ హక్కులపై చర్చ దేశానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ఒకప్పుడు ఎన్డీయేకు రెండో అతి పెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఇప్పుడు అవిశ్వాసం పెట్టే పరిస్థితికి వచ్చింది. దశాబ్దాలుగా బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఇప్పుడు ఎలా వ్యవహరిస్తోందో మనం చూస్తున్నాం అని ఆయన అన్నారు.

tmc 24072018 2

బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా సుదీర్ఘ కాలంగా మిత్రులుగా ఉన్న వారంతా కూడ బీజేపీకి దూరమౌతున్నారని చెప్పారు. 29 ఏళ్ల స్నేహన్ని కూడ శివసేన వదులుకొందని చెప్పారు. మరోవైపు 1500 రోజుల మిత్రత్వాన్ని కూడ టీడీపీ వదులుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగు బిడ్డ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఢిల్లీలో జీవీఎల్ కు ఆధార్ కార్డు ఉంది, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. తాను ఏపీలో పుట్టానని చెప్పుకొంటాడని ఒడ్రియన్ జీవీఎల్ నరసింహరావుపై వ్యాఖ్యలు చేశారు.

tmc 24072018 3

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు మాట్లాడిన అన్నాడిఎంకె ఎంపీ నవనీత కృష్ణ కూడ కేంద్రం తమిళనాడు రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదిలా ఉంటే బీజేడీ ఎంపీ కూడ ఏపీ రాష్ట్ర హక్కుల కోసం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read