మరో రెండు రోజుల్లో పార్లమెంటులో వర్షాకాల సమావేశాలు! ఈసారీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని టీడీపీ ప్రకటించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని తెలుగుదేశం ఇప్పటికే సమీకరించింది. తీర్మానానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం. టీడీపీకి 15, తృణమూల్‌ కు 34, ఆమ్‌ ఆద్మీకి నలుగురు ఎంపీలున్నారు. వీరుకాక తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన మల్లారెడ్డి, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. వీరుకాక కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, ఎన్‌సీపీ, ఆర్జేడీ తదితర పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనున్నాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ నేత సుర్జేవాలా ఇప్పటికే ప్రకటించారు.

modi 16072018 2

పార్లమెంటులో ఈసారి మరింత తీవ్రం, ఢీ అంటే ఢీ అనేలా పోరాడాలని టీడీపీ భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎంపీలను ఆరు బృందాలుగా విభజించి... కాంగ్రెస్‌, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను కలిసే బాధ్యత అప్పగించారు. ఆయా పార్టీల నేతలకు స్వయంగా తాను రాసిన లేఖలను అందిస్తున్నారు. తెలుగుదేశం ఇప్పటికే 18 పార్టీల మద్దతు కోరిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాక ప్రత్యేక హోదాపై అఖిలపక్ష సమావేశంలో ప్రధానిని నిలదీయాలని, స్పీకర్‌ ఏర్పాటు చేసే సమావేశాల్లోనూ ప్రశ్నించాలని తెలుగుదేశం నిర్ణయించుకున్నట్లు ఈ వర్గాలు చెప్పాయి. ఈసారి ఎలాగైనా వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు చేపట్టేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 18 కొత్త బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది.

modi 16072018 3

మరో పక్క, మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కానుంది. ఈ భేటీకి అన్ని పార్టీల నుంచి ఫ్లోర్‌లీడర్లు హాజరుకానున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు కేంద్రమంత్రులు, ఎంపీలకు విందు ఇవ్వడం ఆనవాయితిగా వస్తోంది. అందులోభాగంగా రేపు రాత్రికి ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. పార్లమెంట్ కార్యాలయం నుంచి ఇప్పటికే అన్నీ పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపారు. ప్రధాని ఇస్తున్న విందుకు వెళ్లబోమని టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం తెగేసి చెప్పారు. స్పీకర్‌ ఏర్పాటు చేసే విందు, అల్పాహార సమావేశాలను బహిష్కరించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. మరి వైసిపీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి, ఈ విందుకు వెళ్తారో లేదో తెలియదు.

ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లారు.. దొంగే దొంగా దొంగా అన్నట్టు, ప్రజలు ప్రత్యేక హోదా అడుగుతుంటే, బీజేపీ నేతలు పడేసి పడేసి రోడ్డు మీద సామాన్య ప్రజలని కొడుతూ, మళ్ళీ ఎదురు మమ్మల్నే కొడుతున్నారు అంటూ హడావిడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు అంటూ, ఈ రోజు ఢిల్లీ దాకా వెళ్లి ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచకం జరుగుతుందని, అల్లకల్లోలంగా రాష్ట్రం ఉందని, ప్రజలు బ్రతకలేక పోతున్నారని, కన్నా లక్ష్మీ నారాయణ వెళ్లి, ఢిల్లీలో ఫిర్యాదు చేసారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని, అరాచకం చేస్తున్న చంద్రబాబుని జైల్లో పెట్టాలని, చంద్రబాబు పెద్ద రౌడీ అంటూ, ఢిల్లీ లో ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసాడు కన్నా లక్ష్మీ నారయణ.

kannaa 16072018 2

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కేంద్ర మంత్రులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసిన విషయంపై, టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకాలేదని, చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో ఫ్యాక్షన్, బెజవాడలో రౌడీయిజం బాగా తగ్గిందని, పాతబస్తీలో మత కల్లోలాలు అరికట్టారని, ఇప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కా ఇబ్బంది లేదని, చంద్రబాబు పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు.

kannaa 16072018 3

కన్నా లక్ష్మీ నారయణ గుంటూరులో చేసిన రౌడీయిజం గురించి ప్రజలందరికీ తెలుసని, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కన్నా ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ కన్నా లక్ష్మీ నారయణ చేసిన అరాచకాలు గుంటూరు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఇలాంటి రౌడీ అధ్యక్షుడు అయిన తరువాత, బీజేపీ మరింత బ్రస్టు పట్టింది అని, ఎవరిని పాడితే వారిని కొడుతూ, ప్రత్యేక హోదా అడిగితే దాడులు చేస్తూ, ఎదురు రాష్ట్రం పై ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, కన్నా మంత్రిగా ఉండి చేసిన అవినీతి అంతా అందరికీ తెలిసిందే అని అన్నారు. జగన్ పార్టీలో చేరాల్సిన వాడిని రాత్రికి రాత్రి హాస్పిటల్ లో జాయిన్ చేపించి, తెల్లారిని తరువాత అధ్యక్ష పదవి ఇచ్చిన చరిత్ర బీజేపీదని, కన్నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని అన్నారు.

చంద్రబాబు అంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కు ఎంత వ్యతిరేకతో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏ పని చేసిన ఒంటి కాలు మీద వెళ్లి, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారి లిస్టు తీస్తే, ఉండవల్లి టాప్ 5 లో ఉంటారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు పై విరుచుకు పడే ఉండవల్లి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా, వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి, చంద్రనాబుని నాలుగు తిట్లు తిట్టి, జగన్ ని ఆకాశానికి ఎత్తి, ప్రెస్ మీట్ ముగిస్తారు. జగన్ కు అనుకూలంగా రాజకీయ ప్రసంగాలు చేస్తారు అనేది బహిరంగ రహస్యం. అయితే, తాను జగన్ కు అనుకూలం కాదు అంటూనే, చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలుస్తాడని ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు వ్యతిరేకులతో కలిసి, ఎప్పుడూ చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు..

undavalli 16072018 2

ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎంవో ఆహ్వానం మేరకు ఏపీ సచివాలయానికి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీకానున్నారు. నిత్యం చంద్రబాబుని, విభేదించే ఉండవల్లిని, సియం కార్యాలయం ఆహ్వానించటం, ఉండవల్లి సచివాలయానికి వెళ్ళటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఉండవల్లిని కలవటం వెనుక కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఉన్నాయాని, ఒక పక్క ప్రతిపక్షం కేంద్రంతో పోరాటానికి కలిసిరాకపోవటం, బీజేపీతో లాలూచి పడటం చూస్తున్నాం. అయితే ఉండవల్లి మాత్రం, మొదటి నుంచి బీజేపీ విభేదిస్తూ వస్తున్నారు. విభజన హామీలు, పార్లమెంట్‌లో పోరాటంపై గతంలో సీఎంకు ఉండవల్లి లేఖ రాశారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానుండటంతో సీఎంవో కార్యాలయం నుంచి ఉండవల్లికి పిలుపురావడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే చంద్రబాబు సచివాలయానికి వెళ్తారని, ఆ తర్వాత ఉండవల్లి భేటీ అవుతారని తెలుస్తోంది. 

undavalli 16072018 3

అయితే పూర్తి వివరాలు, భేటీ అయిన తరువాత కాని తెలియదు. జులై 6వ తారీఖు ఉండవల్లి చంద్రబాబుకి లేఖ రాసారు. ‘రాష్ట్ర విభజన బిల్లు సక్రమంగా ఆమోదం పొందలేదన్న విషయమై ఈ వర్షాకాల సమావేశాల్లోనైనా చర్చించాలంటూ నోటీసు ఇస్తే బాగుంటుంది.. ఈ విషయాన్ని గతంలో వైసీపీ, టీడీపీలకు కూడా సూచించాను.. కానీ వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను సద్వినియోగం చేసుకోకుండా రాజీనామా చేశారు... ఇక ఉన్నది టీడీపీ ఎంపీలు మాత్రమే. వారైనా లోక్‌సభలో చర్చకు నోటీసు ఇవ్వాలి. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌, బీజేపీ రెంటికీ బాధ్యత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో కూడా విభజన అంశం ఇంకా రగులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానే సభలో ఈ విషయం మాట్లాడాక.. అన్యాయానికి గురయ్యామని ఆరోపిస్తున్న మన ఎంపీలు అదే విషయాన్ని పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు వెనుకాడాలి’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆ లేఖలో రసారు.

శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌కు హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసు. ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన అధికారులు, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగిస్తున్నామని హైదరాబాద్ పోలీస్, మీడియాతో చెప్పారు. అతను హైదరాబాద్ తిరిగి రావటానికి వీలు లేదని చెప్పారు. అయితే, అతన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం పై, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభ్యంతరం చెప్పటంతో, కత్తి మహేష్ ను పోలీసులు కర్ణాటకలో విడిచిపెట్టినట్టు సమాచారం. అయితే, కత్తి అనూహ్యంగా ఈ రోజు చిత్తూర్ జిల్లాలో ప్రత్యక్షం అయ్యారు.

kathi 16072018 2

ఈ రోజు కత్తి మహేష్ పీలేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు యత్నించగా. అక్కడి పోలీసులు కత్తి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఏమన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఏమన్నా శాంతి బధ్రతల సమస్య లేపుతారేమో అని, పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసారు. అనంతరం ఆయనను పీలేరు నుంచి మదనపల్లెకు తరలించారు. అక్కడి నుంచి మహేశ్‌ను మళ్ళీ బెంగళూరుకు తరలించనున్నట్టు సమాచారం. కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కుట్రలు పన్నే అవకాశం ఉందని, ముందునుంచే పోలీసులకి సమాచారం ఉండటంతో, ఇలాంటి వారికి ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, ముందుగానే రియాక్ట్ అయ్యి, కత్తి మహేష్ ను అక్కడ నుంచి తరలించారు. మొత్తానికి కత్తి మహేష్ ను, అటు తెలంగాణా పోలీసు, ఇటు ఆంధ్రా పోలీసు ఫుట్ బాల్ ఆడుకుంటూ, అటూ ఇటూ పడేస్తున్నారు.

kathi 16072018 3

కత్తి మహేశ్‌ భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి. అయితే హైదరాబాద్ పోలీసులు అక్కడ శిక్షలు వెయ్యకుండా, అతన్ని ఆంధ్రాలో తీసుకొచ్చి పడేయటం వెనుక, రాజకీయ కుట్ర లేకపోలేదని పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. అతని మీద చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి తేవటం, చర్యలు తీసుకుంటే ఒకలా, తీసుకోకుంటే ఒకలా, ఆందోళన చెయ్యటానికి కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆంధ్రా పోలీసులు ఈ తలనొప్పి మాకెందుకని, కత్తి మహేష్ ను మన రాష్ట్రంలో ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యకుండా అడ్డుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read