రాష్ట్రంలో బీజేపీ నేతలు చెప్పే అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొడుతూ, ప్రజలకు ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ లతో సహా, చూపిస్తూ, బీజేపీ నేతలకు ఎండగడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పై, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, హేళన చేస్తూ, ఆయన్ను పర్సనల్ గా టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా, ఇలాగే కుటుంబరావుని ఇష్టం వచ్చినట్టు మాట్లడారు. దీంతో, ఈ రోజు కుటుంబరావు గారు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నోటికి ఏది పడితే అది వాగుతున్నా కాన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు పంపించారు కుటుంబరావు...
తన పరువుకు నష్టం కలిగేలా కన్నా అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కుటుంబరావు తన నోటీసులో హెచ్చరించారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి, ఏది పడితే అది వాగుతూ, ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన పార్టీలో చేరటానికి రాత్రికి రాత్రి రెడీ అయ్యి, ప్రెస్ మీట్ పెట్టి, బ్యానర్లు కట్టి, అమిత్ షా ఫోన్ తో హాస్పిటల్ లో చేరి, బేరం కుదుర్చుకుని, బీజేపీ అధ్యక్షుడు అయిన చరిత్ర కన్నాది. కాంగ్రెస్ పార్టీలో అనేక ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తిని తీసుకువచ్చి, బీజేపీ అధ్యక్షుడుని చేసుకున్న ఖర్మ బీజేపీది. ఇలాంటి థర్డ్ క్లాస్ గాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, కుటుంబరావు లాంటి చదువు, సంస్కారం ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ? అందుకే లీగల్ నోటీసు పంపించారు.
కుటుంబరావు గారు, అనేక సందర్భాల్లో జీవీఎల్ ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టారు. అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అందుకే, కుటుంబరావు మీద వ్యక్తిగత కచ్చి పెట్టుకుంది బీజేపీ. ఈయన విషయం మొత్తం, ప్రజలకు చెప్తూ ఉండటంతో, వీరి అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మటం లేదని, అందుకే ఆయన వ్యక్తిత్వం పై దెబ్బ కొట్టే ఎత్తుగడ వేసింది. అయితే, ఈయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే, నోటీసు పంపించారు. ఇప్పడు కన్నా , ఏమి చేస్తాడో..