ఇప్పటి వరకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక ప్లస్, అవినీతి అనేది బయటకు కనిపించక పోవటం... బయట పడినా, మీడియాలో ప్రముఖంగా రాకపోవటం... అయితే, ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారం బయట పడింది... వీరు బయటకు కనిపించే అంత క్లీన్ కాదని, పాపం పండిన రోజు, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువ చేసిన స్కాంలు బయట పడతాయని అర్ధమవుతుంది. పెద్ద నోట్ల రద్దు, అమిత్ షా పాలిట వరంగా మారిందని, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా బయట పెట్టిన సమాచారం ధ్రువీకరిస్తుంది. అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న ఓ జిల్లా సహకార బ్యాంకు రద్దయిన నోట్లను జమ చేసుకున్న వ్యవహారంలో అగ్రస్థానంలో నిల్చింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు రేగాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను స్వీకరించినట్లు తాజాగా వెల్లడయ్యింది.

amitshah 22062018 2

ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ అనే సమాచార హక్కు ఓ పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. అంతే ఆ మాటున పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. ఆ క్రమంలో అహ్మదాబాద్‌ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్‌ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్‌ జరిగింది. రాజ్‌కోట్‌ నుంచే మోదీ 2001లో మొట్టమొదట గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి చైర్మన్‌ అయిన జయేశ్‌భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా ప్రస్తుతం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌ డీసీసీబీకి అమిత్‌ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత నుంచి నేటి దాకా ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.

amitshah 22062018 3

డీసీసీబీల ద్వారా నల్లధనాన్ని అనేకమంది వైట్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు జమ చేసే బ్యాంకుల జాబితా నుంచి డీసీసీబీలను నవంబరు 14న అంటే ఐదు రోజుల తరువాత తొలగించింది. కానీ అప్పటికే వేల కోట్ల రూపాయల మేర జమ అయిపోయాయి. అలా జమ చేసిన నోట్లకు సంబంధించిన వారిపై నేటిదాకా ఎలాంటి విచారణా జరగలేదని ఆర్టీఐ కార్యకర్త వివరించారు. అహ్మదాబాద్‌ డీసీసీబీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం 2017 మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ 5050 కోట్లు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ 14.31 కోట్లు. విశేషమేమంటే గుజరాత్‌ రాష్ట్ర సహకార బ్యాంకు (ఎస్‌సీబీ) కంటే అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ల్లో డిపాజిట్లు అనేక రెట్లు ఎక్కువ. ఎస్సీబీలో డిపాజిట్లు రూ 1.11 కోట్లు మాత్రమే.

తెల్లకాగితాలు, రిజిస్ట్రేషన్‌ చేయని ఇతర పత్రాలపై భూముల ఒప్పందాలు చేసుకున్నారా? వాటిని ఇప్పుడు ఇతరులకు విక్రయించలేకపోతున్నారా? సాదా బైనామాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అనుమతించడం లేదా? వీటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. మన రాష్ట్రంలో సాదాబైనామాలు (తెల్లకాగితాలపై భూముల కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు, ఒప్పందాలు రాసుకోవడం) చాలానే ఉన్నాయి. వీటితో ముడిపడిన భూములను ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. అలాగే వాటిని ఇతరులు కొనలేని.. అమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల చట్టం (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-ఆర్‌వోఆర్‌) చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌ 2వ తేదీని కటా్‌ఫగా పెట్టుకుని అప్పటి వరకు ఉన్న సాదా బైనామాలను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వం ఆమోదించింది.

farmers 22062018 2

రాష్ట్ర విభజనకు ముందు... అంటే 2014, జూన్‌ 2నాటికి ఉన్న సాదా బైనామాల (తెల్లకాగితాలపై రాసుకున్న భూమి ఒప్పందాలు)ను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అనుమతిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 321 నంబరుతో జీవో గురువారం జారీ అయింది. ఇందుకు రైతులు స్థానిక తహసీల్దార్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ‘‘సాదా బైనామాలు ఉన్న రైతులు తొలుత సంబంధిత మండల తహసీల్దార్‌ వద్ద 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది గ్రామీణ ప్రాంత రైతులకు మాత్రమే వర్తిస్తుంది. సాదా బైనామాల కింద 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి. రిజిస్ట్రేషన్‌ కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

farmers 22062018 3

తెల్లకాగితాలు , రిజిస్ట్రేషన్‌ చేయని ఇతర పత్రాలపై చేసుకున్న ఒప్పందాల భూములను ఎలాంటి స్టాంప్‌ డ్యూటీ లేకుండా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 2.5 ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట పొలంలోపు రైతులకే ఈ జీవో వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమబద్దీకరణ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ జీవో గురించి రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో జరిగిన అన్‌ రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌లకు ఈ జీవో వర్తించదని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తెలిపారు.

రాజధాని అమరావతిలో, గుంటూరు– విజయవాడ మధ్యనున్న నంబూరు గ్రామ పరిధిలో దాదాపుగా నాలుగు ఎకరాల సువిశాల స్థలంలో… శ్రీభూసమేత దశావతార వెంకటేశ్వరుని ఆలయ నిర్మణాన్ని శరవేగంగా సాగుతోంది. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శుక్రవారం రోజున… విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను లింగమనేని ఎస్టేట్స్ సంస్థ యజమానులు తీసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రప్రథమ 11 అడుగుల శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, మహ కుంభాభిషేకం మరియు ధ్వజ స్తంభ స్థాపనని స్వయంగా శ్రీ గణపతి సచ్చిదానందస్వామీ చేయ్యనున్నారు.

datta 21062018 2

ఈ మహ మహోత్సవానికి వేలాది భక్తులు తరలివచ్చి విగ్రహ ప్రతిష్ట, మహ కుంభాభిషేకం మరియు ధ్వజ స్తంభ స్థాపనని కన్నులారా చూసి పునీతులుకావాలని, నిర్వాహుకులు పిలుపు ఇచ్చారు. ధ్వజ స్తంభ స్థాపనా కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి మొట్టమొదటి దర్శనమైన ప్రధమ విరాట్ రూప మహ దర్శనాన్ని దర్శించి తదనంతరం జరిగే సహస్ర కలశాలతో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని కన్నులారా ఆ దివ్య మంగళరూపాని దర్శించాలని చెప్పారు.

datta 21062018 3

ఈ నెల 22 తేదీన, ఉదయం 11 గంటలకి, Guntur జిల్లా నాగార్జున యూనివర్సటీ ఎదురుగా I.J.M లింగమనేని టౌన్ షిప్ నందు జరిగె శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మరియ మహాకుంభాభిషేక మహోత్సవాన్నికి భక్తులని ఆహ్వానించారు. ఈ ఆలయప్రాంగణంలో ఏకకాలంలో శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారితో పాటు మహా గణపతి, మహాలక్ష్మి, గరుడ, ధ్వజ, రాజగోపుర, ఆలయ విమాన కలశాది ప్రతిష్ఠలు కూడా జరగనున్నాయి. ఈ ఆలయప్రాంగణంలో ఏకకాలంలో జరిగే శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారితో పాటు మహా గణపతి, మహాలక్ష్మి, గరుడ, ధ్వజ, రాజగోపుర, ఆలయ విమాన కలశాది ప్రతిష్ఠలను.

2014 నుంచి, ఈ సంవత్సరం మార్చ్ 13 దాకా చంద్రబాబుని ఆహా ఓహో అంటూ పొగిడిన పవన్, మార్చ్ 13 నుంచి సడన్ గా యూ టర్న్ తీసుకుని, బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, అప్పటి నుంచి చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు గురించి పెద్దగా పట్టించుకోక పోయినా, అప్పుడప్పుడు చంద్రబాబు కూడా పవన్ పై చురకలు అంటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి, ఈ రోజు ఒకే కార్యక్రమంలో పాల్గుననున్నారు. మరి ఇద్దరూ పలకరించుకుంటారో లేదో చూడాలి. విషయానికి వస్తే, శ్రీ భూసమేత దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు– విజయవాడ మధ్యనున్న నంబూరు గ్రామ పరిధిలో జరగనుంది. సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తోపాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గణపతి సచ్చిదానంద ఉదయం ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత ఆయన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.

pawan cbn 22062018 2

విగ్రహం 11 అడుగులు కాగా.. పీఠంతో కలిపి 12 అడుగులు ఉంటుంది. గణపతి, మహాలక్ష్మి, గరుడ ఆళ్వార్‌, విష్వక్సేనుడు విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తారు. అదే విధంగా జీవ ధ్వజం ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరుపుతారు. ఇవన్నీ ఏకకాలంలో శుభ ముహూర్తంలో జరగడం మరో విశేషం. ఈ మంగళ క్రతువులో భాగంగా అవదూత దత్తపీఠం ఆస్థాన పండితులు, మైసూరు వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధానార్చకులు ముక్తేవి మాధవాచార్యులు ఆధ్వర్యంలో ఇప్పటికే 21 రోజులుగా పూజలు, హోమాది కార్యక్రమాలు ఆలయంలో జరుగుతున్నాయి. 28 మంది వైఖానస ఆగమ వేద పండితులు యంత్రానుష్ఠానం చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం గణపతి సచ్చిదానంద స్వామీజీతో చక్రార్చన, అనుగ్రహ భాషణ, యాగశాల సందర్శనతోపాటు సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణాన్ని జరిపించారు.

pawan cbn 22062018 3

ఈ నెల 24న ఇదే ప్రాంగణంలో శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణానికి తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలను టీటీడీ ఇక్కడకు పంపనుంది. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠ రోజు దాదాపు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తూ అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకూ ఆలయ ధర్మకర్తలు చొరవ తీసుకుంటున్నారు. హాజరు కానున్న సీఎం: ఉదయం 10:45 గంటలకు సీఎం చంద్రబాబు విచ్చేసి, 12 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారని భావిస్తున్నారు. సీఎం రాకపై గురువారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వెలుపల 600 మీటర్ల మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో 820 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read