వైఎస్ వివేకా కేసు విషయంలో, ఇప్పటికే అందరికీ ఒక అంచనా వచ్చేసింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని త్వరలో సిబిఐ అరెస్ట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ సమయంలో, వైఎస్ సునీతను టార్గెట్ చేస్తూ ఉండటం, సునీతకు బాసటగా ఎవరూ లేక పోవటంతో, ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి బయటకు రావటం, కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. సజ్జల గురించి, డీఎల్ రవీంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డీఎల్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ సునీత ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యల పై, డీఎల్ ధ్వజమెత్తారు. ఇద్దరు ప్రముఖులను కాపాడటానికి, సజ్జల చేస్తున్న ప్రయత్నాలు, దానికి సునీతను టార్గెట్ చేయటం పై స్పందించారు. సునీత తరుపున ఈ సమయంలో ఎవరూ బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడటలేక పోతున్నారు కాబట్టి, తాను బయటకు వస్తున్నా అని అన్నారు. సునీత కుటుంబం పై, వివేక కేసుని నెట్టేస్తే ప్రయత్నం సజ్జల చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రముఖల ప్రమేయం పై ఇప్పటికే చర్చ జరుగుతుందని, దీని పై ఇప్పటికే సిబిఐ ఒక అంచనాకు వచ్చిందని అన్నారు.
ఇక డీఎల్ రవీంద్ర రెడ్డి మరో సంచలన విషయం బయట పెట్టారు. సొంత చిన్నాన్న చనిపోతే, ఆ రోజు జగన మోహన్ రెడ్డి మధ్యానం 3 గంటలకు బయలుదేరి, 6 గంటలకు వచ్చారని, అప్పటికే అతనికి ఎన్నికల్లో ఉపయోగించుకోవటానికి విమానం అన్నీ ఉన్నాయని, అయినా ఎందుకు జగన్ మోహన్ రెడ్డి రాలేదో అనుమానంగా ఉందని అన్నారు. ఎంతటి పెద్ద వారైనా, ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదని డీఎల్ అన్నారు. సూత్రధారులు, పాత్రదారులు ఎవరు అనేది పులివెందుల మొత్తం అందరికీ తెలుసు అని అన్నారు. ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తి, వివేకా పీఏ వీరి కాల్ డేటాలో మొత్తం ఇప్పటికే సిబిఐ గుర్తించిందని అన్నారు. ఈ కేసు విషయంలో, అప్పట్లో చంద్రబాబు పైన నిందలు వేయటం, పేపర్ లో వేయించటం, కోడికత్తితో ఆడిన నాటకాలు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చివరకు సునీత విషయంలో కూడా తన పేపర్ లో , రాసుకునే దాకా జగన్ మోహన్ రెడ్డి వచ్చారని, ఈ విషయంలో మాత్రం, తాను చూస్తూ ఉండనని డీఎల్ రవీంద్ర రెడ్డి అన్నారు.