దేశంలో అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. వర్షం వస్తే కానీ పంటలు పండవు. కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావం కారణంతో పొలాలు ఉన్నా రైత న్నలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ర్టాలకు పరుగులు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇక వర్షాలు రావు... మా బతుకులు మారవు అని నిట్టూర్చుకున్న రైతన్నలకు పెనుకొండకు దక్షిణ కొరియ కియ కార్ల పరిశ్రమ రావడంతో ప లు గ్రామాల ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఒక్కసారిగా రైతులతో పాటు రైతుకూలీల జీవన శైలిలో పెనుమార్పులు వచ్చాయి. ఇందులో కురబవాండ్లపల్లికి కియ కార్లపరిశ్రమ తలుపు తట్టింది. ఏడాది కిందట లక్షలు పలికిన ఎకరా భూమి నేడు కోట్లు పలుకుతోంది. ఇక పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్ము ఖాతాల్లో వచ్చి పడింది.
న్నో ఏళ్లుగా చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్న గ్రామీణ కుటుంబాల్లో కియ రాకతో ఒక్కసారిగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఏపీఐఐసీ కియతో పాటు అనుబంధ సంస్థ పరిశ్రమల కోసం ఎర్రమంచి, దుద్దేబండ, హ రిపురం, అమ్మవారుపల్లి గ్రామాల పరిధిలో 1410.14 ఎకరాల భూములను సేకరించారు. ఇందులో ఎర్రమంచి, అమ్మవారిపల్లి మధ్య కేటాయించిన 587.84 ఎకరాల భూమిలో కియ ప్రధాన పరిశ్రమ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో 200 మందికిపైగా కురబవాడ్లపల్లి రైతుల భూములే ఉన్నాయి. ప్రభుత్వం ఎకరాకు రూ. 10.50 లక్షలతో ఇవ్వగా ఒక్కో రైతుకు రూ.10లక్షల నుంచి కొన్ని కుటుంబాలకు కోటిన్నర దాకా తీసుకున్న రైతులు ఉన్నారు. వీటికితోడు కియ సమీపంలోనే భూములను కొందరు రైతులు ఎకరా రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు రియల్ వ్యాపారులకు విక్రయించారు. ఇలాకూడా మరో రూ.25 కోట్లు చేరి వంద కోట్లకు చేరిపోయింది.
ఓవైపు పరిహారం మరోవైపు భూ ముల విక్రయాలతో వచ్చిన డబ్బులతో కొంత విలాసాలకు కేటాయిస్తూ, మరికొంత డబ్బును పెట్టుబడి పెడుతూ ఏడాదిలో పల్లెజీవితంలో పెనుమార్పులు వచ్చేశాయి. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో గ్రామాల్లో ఎటు చూసినా వచ్చిన డబ్బులు ఏం చేసినావు అన్న చర్చలే వినిపిస్తున్నాయి. కియకు అనుబంధంగా మరో 16 అనుబంధ పరిశ్రమలు రావడంతో మరో వంద కోట్లు లచ్చిందేవి వాలిపోయే పరిస్ధితి కనిపిస్తున్నది. సాధారణ జీవన ప్రమాణాలు సాగించే గ్రామా ల్లో కియ రాకతో ప్రజల జీవనశైలిలో మార్పు వస్తోంది. ఇక పెనుకొండలో స్థలాలు, అద్దెల ధరలు పెరగడంతో ప్రతి రోజు లక్షల్లో నగదు చేతులు మారుతోంది. పెనుకొండకు పలు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్ల కంపెనీలు క్యూకట్టే పరిస్థితి వస్తోందని ప్రజలు భావిస్తు న్నారు. కియ, అనుబంధ పరిశ్రమలు పూర్తయితే ఈ ప్రాంతం గ్రామీణ, పట్టణస్థాయి ప్రజల జీవనశైలి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.