నిన్న ఉదయం కర్ణాటక ఎన్నికల ట్రెండ్, కొంచెం బీజేపీ వైపు మొగ్గిందో లేదో, రాష్ట్రంలోని వైసిపీ, బీజేపీ ఆనందానికి అవధులు లేవు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ వీరికి ఎక్కువయిపోయింది. ఇదే ఊపులో ఒక్క ట్వీట్ తో బఫూన్ అయిన రాం మాధవ్, చంద్రబాబు పేరు చెప్పి ఒక ట్వీట్ వేసాడు. "బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా ఆయన ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి గత ఎన్నికలతోపోలిస్తే 6నుంచి 20కిపైగా సీట్లు పెరిగాయన్నారు. అంతేకాదు దక్షిణాదిలో తమ విజయ దుందుభి మొదలైందంటూ ట్వీట్ చేశారు."
అయితే ఈ ట్వీట్ తో, రాం మాధవ్ కి చంద్రబాబు అంటే ఎంత భయమో తెలుస్తుంది. కనీసం బీజేపీ గెలిచింది అని ఇప్పటి వరకు ఒక ట్వీట్ వేసుకోలేదు కాని, చంద్రబాబుని విమర్శ చేస్తూ ట్వీట్ వేసారు. అయినా చంద్రబాబు ఒక్క డైలాగే కొట్టింది... "రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళని ఓడించండి" అని అన్నారు... దీనికి రాం మాధవ్ బుజాలు తడుముకున్నాడు.. అయినా ఒక్క మాటకే, ఇంత పెద్ద ట్వీట్ వేస్తే, అదే చంద్రబాబు వచ్చి స్వయంగా ప్రచారం చేసి ఉంటే, రాం మాధవ్ పరిస్థితి ఏంటో... అయినా, పూర్తి ఫలితాలు రాకుండానే, రాం మాధవ్ తొందరపడి ట్వీట్ వేసాడు... అసలు తెలుగువారి ప్రభావమే లేదు అని చెప్పాడు...తీరా చూస్తే, తెలుగోడి వల్లే, బీజేపీ అధికారంలోకి రాని పరిస్థితి.. దీని పై నెటిజెన్ లో, రాం మాధవ్ ని ఆడుకున్నారు...
ఇవి కొన్ని ట్వీట్లు "రాం మాధవ్.. నువ్వు డాం మాధవ్ అని మరో సారి రుజువైంది" "తొందరపడి ఒక కోయిల ముందే కూసింది" "ఎందుకు అంత ఆయాసపడుతూ ట్వీట్ చేసావ్, ఏపికి న్యాయం చేస్తే, ఈ బాధ ఉండేది కాదుగా" "చెప్పానా, నేను చెప్పానా, ముందే చెప్పానా!!! గెలిచినప్పుదు ఉండాల్సింది అహంకారం కాదు అని. ఒక్క వోటు సాధిస్తే ప్రభుత్వం నిలబడుతుంది అంటే ఒప్పుకోలెదు వాజ్పాయ్ గారు. పది వోట్లు కొనడానికి రడీ అయ్యారు కదా!!!" "Mari leading lo unappudu thigh slap enduku... nuvu Nee cover drive" "Modiji has taught you how to lie without batting an eyelid. This is the position of BJP in 16 border constituencies. Thank God that CBN didnt campaign against you else you would be in Congress position today." "First win a single grama Panchayat seat in andhra whose elections are on August." "ఇంకా తెలుగుదేశం మీద పడి ఏడవటం, ఆపరేషన్ గరుడ అంటూ పళ్ళికిలించుకుంటూ తిరగటం ఆపి, ఆంధ్రాకివ్వాల్సిన SCS, విభజన హామీలు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినవి ఇచ్చి పరువు నిలుపుకోండి."