సినీ నటుడు మోహన్ బాబుని తన పార్టీలోకి తీసుకోవటానికి, జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు... ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది.. మోహన్ బాబు, ఇది వరకు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు... అయితే, కొన్ని కారణాలతో చంద్రబాబు, మోహన్ బాబుని దూరం పెట్టారు... దీంతో అవకాసం దొరికిన ప్రతిసారి, మోహన్ బాబు, చంద్రబాబు పై మాటల దాడి చేస్తూ ఉంటాడు.. అదే సందర్భంలో, జగన్ ఎంతో గొప్ప నాయకుడు అని పొగుడుతూ ఉంటాడు...ఇది ఇలా ఉంటే, గత కొన్ని నెలల నుంచి మోహన్ బాబు, రాజకీయాల్లో రీ ఎంట్రీ పై లీకులు ఇస్తున్నారు.. త్వరలోనే ఎదో ఒక పార్టీలో చేరాతా అని ప్రకటించారు కూడా... అయితే, ఆయన జగన్ పార్టీలోనే చేరతారని, అందరికీ తెలిసిందే...

mohanbabu 13052018 2

ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లా, వెంకటగిరి నుంచి సినీ నటుడు మోహన్‌బాబును బరిలో దింపితే ఎలా ఉంటుందన్న అభిప్రాయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయం పై, మోహన్ బాబుతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. మోహన్‌బాబును ఎలాగైనా ఒప్పించి టికెట్‌ ఇవ్వాలని అనుకుంటున్నదట. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశంపార్టీకి చెందిన కురుగుండ్ల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చి ప్రజల మన్ననలు పొందారు. సెంట్రల్‌ లైటింగ్‌.. రోడ్లు.. విద్యుత్తు వంటి కనీస అవసరాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పలుమార్లు ఈ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు... అయితే రెండు సార్లు వరుసుగా గెలిచారు కాబట్టి, మూడో సారి ప్రజలు తిరస్కరిస్తారని, అందుకోసం గట్టి అభ్యర్ధి కావాలని భావించిన జగన్, మోహన్ బాబు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు..

mohanbabu 13052018 3

మోహన్ బాబు వస్తే, రోజాకు తోడుగా ఇష్టం వచ్చినట్టు, మీడియా ముందు నోటికివచ్చినట్లు భూతు పంచాంగం మాట్లాడించి ఆనందం పొందాలని, జగన్ ఆలోచన... కమ్మ సామాజికవర్గం చేత, కమ్మ వారిని తిట్టించి ఆనందం పొందాలన్న ఆలోచనతో జగన్ ఉంటే, తానేదో గోప్పోడినని ఫీల్ అయిపోతూ ఉండే మోహన్ బాబుకి, జగన్ లాంటి వాడే కరెక్ట్ అని అంటున్నారు.. జగన్ తో మొదట్లో బాగానే ఉంటుంది అని, రోజులు గడిచే కొద్దీ, మనోడు చూపించే 70 ఎం ఎం సినిమాకు, మోహన్ బాబుకే మైండ్ పోతుంది అని, వైసిపీ మాజీలు అంటున్నారు.. మోహన్ బాబు వైసిపీ తీర్ధం పుచ్చుకొంటే సినీ పరిశ్రమలోని కొంత మంది, తనకు మద్దతుగా వస్తారనేది జగన్ ఆలోచనగా తెలుస్తుంది....

అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి... కర్ణాటక ఎన్నికలు అవ్వగానే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుని ప్రకటించింది బీజేపీ.. అయితే, ఆ పదవి పై ఎన్నో ఆసలు పెట్టుకున్న వీర్రాజుకి కాకుండా, రాజీనామా చేసి, జగన్ పార్టీలోకి మరో గంటలో చేరాల్సి ఉండగా, హాస్పిటల్ లో చేరిన, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యకుడుగా ప్రకటించారు... కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి, ఒక సంవత్సరం బీజేపీలో ఉండి, రాజీనామా చేసిన వ్యక్తి, బీజేపీ అధ్యక్ష పదవికి దిక్కు అయ్యాడు.. ఇలాంటి స్థితిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది అంట... సరే.. మొత్తానికి, కన్నా లక్ష్మీ నారయణను, అద్యక్షుడుని చెయ్యటం వెనుక, కులం అనే కోణం కూడా ఉంది... ఈ కులాల కుంపటి రాజేసే ఉద్దేశంలో ఉన్న బీజేపీ, కన్నాను ఎన్నిక చేసింది..

veeraju 13052018 2

అయితే, ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజునే అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే దూకుడు, ఓవర్ ఆక్షనే, వీర్రాజుకు దెబ్బ అని చెప్తున్నారు... ఇలాంటి వాడు అధ్యక్షుడు ఏంటి అని, అలా పిచ్చి మాటలు మాట్లాడే వారు ఉండాలి కాని, అధ్యక్ష పదవిలో కాదని, అమిత్ షా భావించినట్టు తెలుస్తుంది. మరో పక్క, సోము వీర్రాజుని అధ్యక్షుడుగా ఉంచవద్దు అంటూ, రాష్ట్ర బీజేపీ నేతలు వారం క్రితం అమిత్ షా కు ఒక లేఖ రాసారు.. సొంత ప్రాంతంలో కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని కొందరు నాయకులు ప్రజల ముందు, మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు నేతలు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా, సోము వీర్రాజు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా అర్ధమవుతుంది.

veeraju 13052018 3

అంతే కాదు, ఇంకా కొంత మంది బీజేపీ నాయకులు అవినీతికి మారుపేరుగా మారారన్నారు. 2014 ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన, సీనియర్‌ నాయకులను తీవ్రంగా అవమానిస్తున్నారు... దీనివల్ల వారు బీజేపీని వీడి మరో పార్టీలో చేరక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు... ఒక అసమర్థ నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో తప్పటడుగులు వేస్తే సీనియర్‌ నేతలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు... ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు కూడా పార్టీని వీడిపోయే ప్రమాదం ఉంది'' అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారు... అయినా సరే, ఎవరూ దిక్కు లేక, చివరకు రాజీనామా ఇచ్చేసి, జగన్ పార్టీలో చేరుతున్నా అని చెప్పిన కన్నా లక్ష్మీనారయణే, బీజేపీ కి దిక్కు అయ్యాడు.. ఇక వీళ్ళు చూపించే చుక్కలు చూద్దాం రండి...

అటు రాజధాని కట్టుకోవాటానికి డబ్బులు ఇవ్వరు... మీకు మయసభ కావాలా అని అడుగుతాడు ఒకడు... అన్ని డబ్బులు ఎందుకు, అన్ని ఎకరాలు ఎందుకు అని పుస్తాకాలు రాస్తాడు ఒకడు... అయితే, ఇప్పుడు ఏకంగా, మన దగ్గర భూములు తీసుకుని, కనీసం ఏ కట్టడం కట్టటం లేదు కేంద్రం.. రాజధాని అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్సాహం చూపాయి... అమరావతిలో తమకు భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలకు లేఖలు రాసి అమరావతిలో కార్యాలయాలకు ఎంత స్థలం అవసరమో చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో చాలా కేంద్ర సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయించింది..

modi cbn 13052018 2

ఏప్రిల్‌ నెలాఖరు వరకూ 15 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు భూములు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌ (సీపీడబ్లు్యడీ), ఆర్‌బీఐ, ఇండియన్‌ నేవీ, బీఐఎస్, పోస్టల్, కాగ్, ఐగ్నోలకు ఎకరం కోటి రూపాయల చొప్పున భూమి కేటాయించింది. ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నాబార్డు, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్‌ బ్యాంక్, ఐఓసీఎల్, రైట్స్‌ సంస్థలకు కేటాయించింది. అయితే, ఎన్ని నెలలు గడుతున్నా కేంద్ర సంస్థలు అక్కడ ఏమి కట్టటం లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబాధాల నేపధ్యంలో, అమరావతిలో కట్టటం మొదలు పెడితే, ఎక్కడ కేంద్ర పెద్దలకు చెడు అవుతామో అని, ఎవరూ ముందుకు రావటం లేదు.

modi cbn 13052018 3

ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం, ఉపేక్షించేది లేదని, కేంద్ర సంస్థల ఏర్పాటులో ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, సంబంధిత భూములను తిరిగిచ్చేయాలంటూ సీఆర్‌డీఏ కేంద్రానికి లేఖ రాసింది. భూమి పొందిన తరువాత మూడు నెలలోగా నిర్మాణాలను ప్రారంభించాల్సి వుంటుందని గుర్తు చేసిన మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, సంవత్సరాలు గడిచినా పనులు చేపట్టలేదు కాబట్టే నోటీసులు ఇచ్చామని అన్నారు. ఏపీ సర్కారు నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సివుంది. మరో పక్క, అదే సమయంలో విద్యా సంస్థల విట్, ఎస్‌ఆర్‌ఎం, బీఆర్‌ శెట్టి, అమృతా యూనివర్సిటీలు వెంటనే పనులు మొదలు పెట్టాయి, విట్, ఎస్‌ఆర్‌ఎం అయితే, ఇప్పటికే క్లాసులు కూడా మొదలు పెట్టాయి...

పవన్ కళ్యాణ్... మొన్నటి దాక సినిమాలు తీసుకుంటూ, అప్పుడప్పుడు వచ్చి సమస్య ఏదన్నా చెప్పగానే, చంద్రబాబు ప్రభుత్వం ఇట్టే ఆ సమస్యను పరిష్కరించేది... 4 ఏళ్ళ దాకా చంద్రబాబుతో ఎలాంటి ఇబ్బంది లేని పవన్, సడన్ గా మార్చ్ 11న ప్లేట్ మార్చేశాడు... చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది అన్నాడు.. ఆధారాలు అడిగితే, ఎవరో అనుకుంటుంటే ఆ విషయం చెప్పా అన్నాడు.. ఇక అప్పటి నుంచి, ప్రతి రోజు కన్ఫ్యూషన్... ఒక్క మాట పై నిలకడ ఉండదు... సడన్ గా మోడీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. నేషనల్ మీడియాకు ఎక్కి మోడీ నాకు ఆదర్శం అన్నాడు.. ఒక పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్నా అన్నాడు, మరో పక్క డబ్బులు ఇస్తే చాలు, ఏదైతే ఏంటి అన్నాడు...

pk 13052018 2

ఇలా ఒకదానికి ఒకదానికి పొంతన లేకుండా, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట.. ఎందుకు బీజేపీ కి లొంగాడో ఎవరికీ తెలియదు... ఈ లోపు సడన్ గా, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో, పుట్టిన రోజు నాడు ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే, అదే రోజు చౌకాబారు ట్వీట్లు మొదలు పెట్టాడు... ఎవరో శ్రీ రెడ్డి అనే అమ్మాయి చేత, 10 కోట్లు ఖర్చు పెట్టి, చంద్రబాబు గేమ్ ఆడిస్తున్నాడు అన్నాడు.. టీవీ చానల్స్ బ్యాన్ చెయ్యాలి అన్నాడు, కేసులు పెడతా అని, లాయర్లతో ఆవేశంగా మాట్లాడుతున్న ఒక వీడియో బయటకు వదిలారు.. చివరకు ఆ కేసులు ఏమయ్యాయో తెలియదు... బ్యాన్ లు ఏమయ్యాయో తెలియదు... కొన్ని రోజులకి పుస్తాకాల ట్వీట్ లు వచ్చాయి... మొత్తానికి ప్రత్యేక హోదా అనే మాట లేదు.. మోడీ అనే మాట పవన్ నోటి వెంట లేదు... షడ్యుల్ చేసిన పర్యటనలు కూడా రద్దు అయ్యాయి... సినిమా ఫుంక్షన్ లకి మాత్రం వెళ్ళాడు.. చివర్లో చింతలబస్తీ దేవ్ వచ్చి, కామెడీ పండించాడు...

pk 13052018 3

అయితే, ఇన్ని రోజులు పవన్ ఖాలీగా ఉన్నాడు.. బయటకు రావటానికి పర్మిషన్ లేదు.. బయటకు వస్తే, బీజేపీని ఎదో ఒకటి అనాలి... అలా అంటే, కర్ణాటక ఎన్నికల్లో ఉన్న కోటి మంది తెలుగు వారికి, మరి కాస్త బీజేపీ పై కోపం పెరుగుతుంది... అందుకే, పవన్ ను నెల రోజుల పాటు, బయటకు రానియ్యకుండా ఆపారు ఢిల్లీ పెద్దలు.. కర్ణాటక ఎన్నికలు, అలా అయ్యయో లేదో, ఇలా బయటకు వచ్చాడు... బస్సు యాత్ర చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి... ఇప్పటికే బీజేపీ, 15 తరువాత చుక్కలు చూపిస్తాం అంటుంది... అందుట్లో ఒక చుక్క పవన్... మొత్తానికి, అమిత్ షా డైరక్షన్ లో, కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే వస్తున్నాడు పవన్... అలా అలా బీజేపీని తిడుతూ, చంద్రబాబు ప్రభుత్వం పై, ఎవరో ఎదో అన్నారు, నేను అదే చెప్తున్నా అనే ఆరోపణలు చేస్తాడు... ఎలాగూ గెలిసేది లేదని పవన్ కు కూడా తెలుసు.. అందుకే, చిందరవందర చేసి, చంద్రబాబు వైపు ప్రజలు వెళ్ళకుండా, బీజేపీ కి చంద్రబాబు చేస్తున్న డ్యామేజి నుంచి, బయట పడేయటానికి, బస్సు యాత్రలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తున్నాడు.. ఇదన్నా సవ్యంగా చేస్తాడో, లేక అన్నిటి లాగే, మధ్యలో ఆపేస్తాడో చూడాలి... అంతా గుజరాత్ నేతల దయ...

Advertisements

Latest Articles

Most Read