దేశంలో, రాష్ట్రంలో బాలికల మీద జరుగుతున్న ఆకృత్యాల పై, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తీవ్ర వేదనతో, రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసారు... "It started with a few cases of eve-teasing and harassment. Even then, many years ago in my youth, sexual molestation was not unheard of, but such cases were rare. Today, when I think of how far we've come as a society in dealing with such issues, I feel extreme disappointment. Waking up every day to the news of women and innocent children being molested, raped and killed at such an alarming rate has shaken me up. As the Chief Minister of Andhra Pradesh, I am extremely disturbed to hear about children becoming victims of such crimes in my own State. It has to be the darkest era where all boundaries of morality and humanity have been shattered!

cbn letter 06052018 2

Even this tremendous amount of shock has not been able to suppress the anger and rage that I feel inside. As a human being, my heart cries with horror and pain. As a Chief Minister, I will take every measure to make sure that the criminals are not spared and have to face the most severe punishment. But today, I write this letter for a bigger reason. I want to appeal to the morality of my people, I want all of us to wake up to the harsh reality and realize that it is our collective responsibility as a society, to ensure the safety of our loved ones. Our sons need to be raised to respect women, they need to learn the difference between right and wrong so that they go on to become responsible citizens of the country. Any kind of bad behaviour should be corrected at the young age itself. Boys and girls should be raised equally so that the boys don't grow up thinking that they are superior.

cbn letter 06052018 3

Women and children should not feel threatened moving around in the society, instead they should be free and safe in their environment. Children should be made aware of how they can be safe, and parents should be vigilant at all times. Women should know that if ever faced with harassment, they can alert the police, use self-defence techniques to protect themselves, and alert the people around them. The government will take all the measures to control crime rates in the State, but it is only together as a society that we can put an end to such incidents. Let us build a better and safer environment for our women and children to live in. Let us take the pledge to fight together and unite against the criminals to protect our women and children!"

విశాఖ నగరానికి మరో తలమానికమయ్యే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సోలార్ విద్యుత్ పై మొదటి నుంచి ద్రుష్టి సారించిన చంద్రబాబు, ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు... రిజర్వాయర్ల పై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థకు జి.వి.ఎం.సి. శ్రీకారం చుట్టింది. రూ. 11 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తేలియాడే సౌర విద్యుత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మడసర్లోవ రిజర్వాయరు ఇప్పటి వరకు నీటిని అందించింది. ఇప్పుడు విద్యుత్తు కూడా అందించడానికి సిద్ధమవుతోంది. అదెలాగంటే ఆ నీటి పై సోలార్ పలకలు అమర్చడానికి వీలుగా తేలియాడే పలకలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. జి.వి. ఎం.సి. ఆధ్వర్యంలో హైదరాబాదుకు చెందిన పి.ఇ.ఎస్. ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ ప్రాథమిక నిర్మాణ పనుల్ని ప్రారంభించింది. వీటిపై సౌర పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 2 మెగావాట్ల విద్యు త్తును ఉత్పత్తి చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఇక్కడి నుంచి పైనాపిల్ కాలనీ వద్దనున్న విద్యుత్తు గ్రిడ్కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన.

solar 06052018 1

కాగా జులై నెలాఖరు నాటికి ప్రాజెక్టు అమల్లోకి తేవల్సి ఉంది. తేలియాడే ప్లాస్టిక్, ఫైబర్ పెట్టెలకు సౌరఫలకాలు అమర్చడమే కాకుండా, కింద స్పీంగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి మట్టం తగ్గినప్పుడు అవి కూడా కిందకు దిగుతాయి. నీటి మట్టం తగ్గినా, పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడమే ఈ ప్రాజెక్టు విశేషం. అయితే వర్షం లేకపోవడం వల్ల సౌరపలకల పై దుమ్ముధూళి పొరలా పేరుకుపోయే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో ప్రాజెక్టు అమల్లోకి తేవాలని జి. వి. ఎం.సి. ప్రయత్నిస్తోంది. స్మార్ట్ సిటీగా మారుతున్న విశాఖపట్నం ఇప్ప టికే అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గజం స్థలం లక్షరూపాయలకు చేరుతున్న నేటి రోజుల్లో భవిష్యత్తులో భూమి అవసరం చాలా ఉంది. సౌర విద్యుత్తు కోసం చాలా భూమి వినియోగించాల్సి ఉంటుంది. ఆ భూమిని సోలార్ ప్యానళ్లతో నింపేస్తే ఏ విధంగానూ ఇతర వినియోగానికి సాధ్యం కాదు. కాబట్టి, రిజర్వాయర్లు, కాలువలపై సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పై ప్రభుత్వం దృష్టి సారించింది.

solar 06052018 1

ఇవీ లాభాలు... రిజర్వాయర్లపై తేలియాడే సౌర విద్యుత్తు వ్యవస్థ వల్ల పచ్చదనం పాడయ్యే అవకాశం ఉండదు. నిర్మాణాలకు, ఇతర అవసరాలకూ భూమి ఉపయోగపడుతుంది.... నీటిపై సూర్య కిరణాలు పడకపోవడం వల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. సూర్యకిరణాల వల్ల నాచుపెరిగి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు... ఇక వేసవి వేడి తీవ్రతకు నీరు ఆవిరై, రిజర్వా యర్లు అడుగంటిపోవడు తెలిసిందే... పై మూతలా పనిచేసే ప్యానళ్ల వల్ల నీరు ఆవిరయ్యే అవకాశం ఉండదు... నీటి నిల్వ ఉంటుంది. మన ఇంటి పై నీటి ట్యాంకరుకు మూత వేయడం ద్వారా నాచు పట్టకుండా, నీరు ఆవిరవకుండా ఎలా ఉంటుందో అలాంటి భద్రత ఉంటుంది.

జాతీయ స్థాయిలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను వ్యతిరేకిస్తూ మే 7న నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగనుంది.. అయితే ఈ సమావేశానికి, కొన్ని రాష్ట్రాల రాకుండా అడ్డుకుంటానికి, కేంద్రం అడ్డుపడుతుంది... కొన్ని రాష్ట్రాలని భయపెట్టి, ఈ సమావేశానికి రాకుండా ప్రయత్నాలు చేస్తుంది.. ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది... ఆర్థికమంత్రుల సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోందని.., ఈ బెదిరంపు ధోరణి సరైంది కాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఉపాధ్యక్షులు కుటుంబరావు విమర్శించారు.

amaravati 060502018

సదస్సుకు పశ్చిమబంగ, కేరళ, పంజాబ్‌, దిల్లీ, కర్ణాటక మంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రప్రభుత్వం వారిపై ఒత్తిడి తెచ్చి సదస్సుకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌పై పెంచుకున్న కక్షసాధింపునకు ఈ పరిణామం పరాకాష్ఠ అని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకూ తీవ్ర నష్టం కలిగేంచేలా ఉన్నాయన్నారు. ఈ విధివిధానాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు ఎదుర్కొనే లోటును పూడ్చాల్సిన ఆర్థిక సంఘం లోటు భర్తీ కుదరదంటూ ఆర్థిక సంఘం నిబంధన పెట్టిందని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయన్నారు.

amaravati 060502018

జనాభాకు వెయిటేజీ ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘానికి నివేదికనిచ్చారని, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయి పన్నును తిరిగి రాష్ట్రాలకు 100శాతం ఇవ్వాలని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూచించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రధాని అయ్యాక ఆయన పద్ధతి మారిందని విమర్శించారు. బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సిందేనన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో ‘న్యూ ఇండియా 2022’ ఆధారంగా నిధులు ఇవ్వాలంటున్నారని, దీనికి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు. మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాలపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయమై తెలుగుదేశం ఎంపీలు రానున్న పార్లమెంటు సమావేశాల్లో విధివిధానాల మార్పుపై పోరాటం చేస్తారన్నారు.

ఎవడికైనా సొంత పార్టీ నేతలను అంటే కోపం వస్తుంది.. ఈ వైసిపీ పార్టీకి ఏంటో, బీజేపీ నాయకులను అంటే, వీరికి కోపం వస్తుంది... కోపంతో ఆగుతారా అంటే, కొట్టటం దాకా చేస్తున్నారు... మొన్నటి మొన్న విజయసాయి రెడ్డి, ఇలాగే మోడీని అంటే కోపం తెచ్చుకున్నాడు... అసెంబ్లీలో మోడీని చంద్రబాబు తిట్టాడు అని, విజయసాయి రెడ్డి వెళ్లి రాజ్యసభలో నోటీసు ఇచ్చాడు... ఇదెక్కడి వింతో అర్ధం కావటం లేదు... బీజేపీ నాయకులు కూడా ఇంత బాధ పడటం లేదు... మోడీని ఒక్క మాట అన్నా, జగన్, విజయసాయి అస్సలు ఒప్పుకోవటం లేదు... అందుకే వాళ్ళ కార్యకర్తలు కూడా, మోడీని ఎవరన్నా తిడితే, వెళ్లి వారి మీద ఎగబడుతున్నారు... దాడి కూడా చేస్తున్నారు...

ashok babu 06052018 1

ఈ రోజు ఎపి ఎన్.జి.ఓ సంఘం అద్యక్షుడు అశోక్ బాబు పై, ఇలాగే దాడి చేసారు వైసిపీ గుండాలు... దాడి చేసింది మన రాష్ట్రంలో కూడా కాదు.. బెంగుళూరులో... కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించిన తెలుగు సంఘాల భేటీలో ఈ ఘటన జరిగింది... రాష్ట్రానికి నరేంద్ర మోడీ అన్యాయం చేసాడు అని, కర్ణాటకలో తెలుగు వారు అందరూ బీజేపీని ఓడించాలని, అశోక్ బాబు అక్కడ ఉన్న తెలుగువారితో అన్నారు. ఒక చోట మోడీని ఓడిస్తే, మిగిలిన రాష్ట్రాలతో ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుస్తుందని అశోక్ బాబు అన్నారు. వాజ్ పేయి హయాంలో అన్ని రాష్ట్రాలు హాపీగా ఉన్నాయని, కాని మోడీ హయాంలో ఆ పరిస్తితి లేకుండా పోయిందని అశోక్ బాబు అన్నారు.

ashok babu 06052018 1

అయితే, అశోక్ బాబు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని తెలుసుకున్న వైసిపీ నేతలు, ఆహ్వానం లేకున్నా, సమావేశం జరుగుతున్న సదరన్ హోటల్ వద్దకు వచ్చారు... మోడీని ఓడించమానటానికి నువ్వు ఎవరు అంటూ అశోక్ బాబు పై విరుచుకు పడ్డారు... మోడీని ఓడించమని చెప్పమని, చంద్రబాబు నిన్న పంపించాడా, అంటూ అశోక్ బాబు పై దాడి చేసారు.... మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చూస్తూ కూర్చోమని, వైసిపీ నాయకులు అక్కడ ఉన్న వారికి వార్నింగ్ ఇచ్చారు.. కాగా, గత కొంత కాలంగా, వైసిపీ ఆధ్వర్యంలో, కర్ణాటకలో, బీజేపీకి అనుకూలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. మొన్నటి దాకా, విజయసాయి రెడ్డి వీరిని స్వయంగా పర్యవేక్షించి, బీజేపీ తరుపున ప్రచారం చేపించి వచ్చారు... మొత్తానికి, మోడీని ఒక్క మాట అంటే, బీజేపీ కంటే ముందే, వైసిపీ నాయకులు వచ్చి ఎగబడుతున్నారు..

Advertisements

Latest Articles

Most Read