ఫేకో... ఫేకస్య... ఫేకభ్యహ... ఇచ్చట సర్వం ఫేక్ చెయ్యబడును... మాములుగా అయితే, ఈ క్యాప్షన్ లోటస్ పాండ్ సొంతం... ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ సర్వం ఫేక్... ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేసే మాస్టర్ ఆర్ట్స్ లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్ సొంతం... సన్నీ లియోన్ కు వచ్చిన జగన్ కూడా, ఫోటోషాప్ చేసి జగన్ కు వచ్చారు అనే చెప్పే ఘనులు ఉన్నారు అక్కడ... బీహార్ లో రోడ్లు చూపించి, ఇది చంద్రబాబు పాలన అంటారు.... తమిళనాడులో ఫోటోలు తమిళ్ రాసి ఉన్న ఫోటోలు చూపించి, చూసారా మా రాజశేఖర్ రెడ్డి పాలనలో, ఎంత మందికి చదువు చెప్పించామో అంటారు... ఈ పైడ్ బ్యాచ్ కి తోడు, సాక్షి ఛానల్ ఉండనే ఉంది... అయితే, ఇప్పుడు ఈ ఫేక్ బ్యాచ్ కు తోడుగా, పవన్ కళ్యాణ్ ఫేక్ బ్యాచ్ కూడా తయారయ్యింది... ఎలాగూ, త్వరలో కలిసిపోతారు కదా, ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ, ఫేక్ చేసి పదేస్తున్నారు...
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఎలాంటి చౌకబారు పోస్ట్లు పెడుతున్నాడో చూస్తున్నాం... ఈ చౌకబారు పోస్ట్లకు, బుద్ధి ఉన్నవాడు ఎవడూ మద్దతు ఇవ్వడు... గాలి మంద తప్ప... అందుకే, మా పవన్ తోపు తురం అని కలరింగ్ ఇవ్వటానికి, ప్రముఖల పేరుతో ఫేక్ ట్విట్టర్ ఖాతాలు తెరిసారు... ఆ ఫేక్ ఖాతాలతో, పవన్ చేసే ప్రతి ట్వీట్ ఆహా ఓహో అనటం, మరో పక్క చంద్రబాబుని తిట్టించటం ఈ ఫేక్ బ్యాచ్ పని... సినీ హీరోలు, ప్రముఖులు, సెలబ్రిటీల పేరుతో ఈ ఫేక్ ఎకౌంటు లు ఓపెన్ చేసారు... ఇప్పటికే జగన బ్యాచ్ ఇలాంటివి తయారు చేసింది... ఇప్పుడు జనసేన బ్యాచ్ మరి కొన్ని ఫేక్ ఎకౌంటు లు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. ట్విట్టర్‌లో యాంకర్ రవి పేరిట, ఇలాంటి డ్రామాలు ఆడి దొరికిపోయారు.
యాంకర్ రవి కామెంట్ ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ అయ్యింది. హఠాత్తుగా బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ.. పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన రీతిలోనే.. అభ్యంతరకరంగా రవి ఓ ప్రశ్న సంధించాడు. దీనికి కూడా అనుకూలంగా, వ్యతిరేకంగా 59 రీట్వీట్స్, 499 లైక్‌లు వచ్చాయి. యాంకర్ రవి చేసిన ట్వీట్‌కు హీరో నితిన్ స్పందించాడు. అతన్ని వారిస్తున్నట్లు, డోస్ చాలన్న రీతిలో ఓ కామెంట్‌ను రీ ట్వీట్ చేశాడు. రవి ట్వీట్‌కు.. హీరో నితిన్ స్పందించడం... మరింత చర్చకు దారితీసింది. ట్విట్టర్ వేదికపై ఈ రచ్చ రంబోలా సాగుతుండటాన్ని గమనించిన కొందరు యాంకర్ రవి అభిమానులు, జర్నలిస్టులు.. ఆయన పేరిట పోస్ట్ అవుతున్న ట్వీట్లపై ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై అభ్యంతరకర పోస్టును ఎందుకు పెట్టావంటూ రవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. షాక్ అవ్వడం యాంకర్ రవి వంతు అయ్యింది. తన ప్రమేయం లేకుండా.. తన పేరుతో.. తన ఫోటోతో ట్విట్టర్‌లో కామెంట్లు ఎలా పోస్ట్ అయ్యాయని విస్తుపోయాడు. తన పేరిట నకిలీ ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయ్యిందని గుర్తించాడు.
అయినా తన పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ వాడుతూ.. అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని.. ఆపోస్టులపైనా, ఆపోస్టులు పెట్టిన వాళ్లపైనా లీగల్‌గా కేసువేసి ప్రొసీడ్ అవుతానన్నారు. అంతేకాదు.. తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్, నకిలీ ట్విట్టర్ అకౌంట్ల అడ్రస్‌ను వెల్లడించారు యాంకర్ రవి. వీటిని పరిశీలించి.. అసలు ఖాతా ఏదో, నకిలీ అకౌంట్ ఏదో గుర్తించాలని కోరుతున్నారు. అటు.. హీరో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా తన కుమారుడికి ఈ పేరుతో ట్విట్టర్ అకౌంట్ లేదని, ఎవరో నకిలీ అకౌంట్‌తో పోస్టులు చేస్తుండవచ్చని స్పష్టం చేశారు. యాంకర్ రవి వివరణ, హీరో నితిన్ తండ్రి చెబుతున్న విషయాలతో.. పవన్ కల్యాణ్ అభిమానుల పైత్యం మరోసారి బయటపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.