భారతీయ జనతాపార్టీని సిద్ధాంతపరంగా నియంత్రించే అత్యంత కీలకమైన విశ్వహిందూ పరిషత్ సీన్ ఇప్పుడు రివర్స్ అయ్యింది... ఒకప్పుడు ఆరెస్సెస్ .. బీజేపీని నియంత్రించేంది. ఇప్పుడు సంఘ్ ను తానే నియంత్రించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. దానికి వీహెచ్ పీలో ప్రవీణ్ భాయ్ తొగాడియాను శాశ్వతంగా సాగనంపటమే సాక్ష్యమని సంఘ్ లోని కొంత మంది పెద్దలు బహిరంగంగానే చెబుతున్నారు... వచ్చే ఎన్నికల్లో బిజెపికి 150 నుంచి 200 స్థానాలు మించి బిజెపికి రావు అనేది సంఘ్ కి స్పష్టత వచ్చింది... బీజేపీ పై కంటే, మోడి పై ప్రజల్లో ఎక్కువ కోపం ఉందని, అందుకే ప్రధాని అభ్యర్ధిని మార్చే కసరత్తు సంఘ్ ప్రారంభించింది అని తెలియటంతో, సంఘ్ ని తన కనుసన్నల్లో పెట్టుకోవాలని భావించారు మోడీ.. మోడీ పిలుపునిచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ ను ఆయన వ్యతిరేకించారు.. తన పై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న, విహెచ్పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాను బయటకు పంపే ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు..
గత మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. అంతర్జాతీయ స్థాయిలో వీహెచ్‌పీకి అధ్యక్ష ఎన్నికలు జరుగగా, రాఘవరెడ్డి అనే వ్యక్తిని తొగాడియా నామినేట్ చేశారు. ఎన్నికల్లో రాఘవరెడ్డి ఓటమిపాలు కావడంతోనే తొగాడియా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011 నుంచి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీహెచ్‌పీ పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త అధ్యక్షుడిగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు లభించగా, కోక్జెకు 131 ఓట్లు లభించాయి.
సుమారు 50 ఏళ్ల తర్వాత వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగగా, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. మరోవైపు హిందువుల హక్కుల కోసం జీవితాంతం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు తొగాడియా… హిందూత్వ అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ నుంచి ఆమరణ నిరహారదీక్ష చేయనున్నట్టు ప్రకటించారు... ఇక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ విష్ణు సదాశివ కోక్జే తన టీమ్‌ను ప్రకటించారు. ఇందులో తొగాడియా మద్దతుదారులు ఎవరికీ చోటు కల్పించ లేదు. వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అలోక్ కుమార్‌ను, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అశోక్ చౌగులే, ప్రధాన కార్యదర్శిగా మిలింద్ పరాండే, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా వినాయకరావు దేశ్‌పాండే, వేంకట కోటేశ్వరరావులను నియమించారు.దీనిబట్టి చూస్తే మోడీ హిందుత్వ సంస్థలపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.