ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మరో మోసం ఇది... దాదాపు 44 బిలియన్ ల పెట్టుబడి, అంటే 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీని, ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర తీసుకోపోయారు... ప్రపంచంలోకెల్లా అగ్రగామి అయిన చమురు ఎగుమతుల సంస్థ సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరంకోని, మన రాష్ట్రానికి తీసుకురావటానికి గత సంవత్సర కాలం నుంచి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసారు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సౌదీ అరంకో అధిపతి నాసర్తో స్విట్జర్లాండ్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా సమావేశమై అంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన బంగాళాఖాతం తీరాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ విశాఖపట్టణాన్ని ప్రతిపాదించారు...
దేశంలో కీలకమైన రిఫైనరీలు ప్రస్తుతం బంగాళఖాతం తీరంలో ఉండగా అదే మార్గంలో తాము నూతన రిఫైనరీలు ఏర్పాటు చేయడంతో భారతదేశంతో తమ సుదీర్ధకాల వ్యాపార ప్రయోజనాలను సాధించడంతో పాటు అగ్నేయాసియా దేశాలలో కూడా సౌదీ అరేబియా చమురును సరఫరా చేయడానికి ఉపకరిస్తుందని అరంకో కూడా భావించింది... విశాఖపట్టణంలో రిఫైనరీతోపాటు కృష్ణా నదీ తీర ప్రాంతంలో పెట్రో రసాయానాల రంగంలో పెట్టుబడులు, పెట్రో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని, 'సౌదీ అరంకో సంస్థ' దాదాపు అంగీకరించింది... ఈ సంవత్సరం జనవరి 23న చంద్రబాబు, సౌదీ అరంకో, వైస్ ప్రెసిడెంట్ సైయద్ అల్ హద్రామిని కలిసి, ఫిబ్రవరి 24న జరిగే సిఐఐ సమ్మిట్ కు కూడా ఆహ్వానించారు.... దాదాపు, అదే టైంలో, ఎంఓయి కూడా అయిపోయేది...
అయితే, ఎవరి ఒత్తిడి ఏమో కాని, ఈ రోజు 'సౌదీ అరంకో సంస్థ', మహారాష్ట్రలోని రత్నగిరిలో రిఫైనరి పెడుతున్నట్టు ఎంఓయి కుదుర్చుకుంది... దాదాపు 44 బిలియన్ ల పెట్టుబడి, అంటే 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, ఇక్కడ పెట్టనుంది 'సౌదీ అరంకో సంస్థ'... ఎవరు ఒత్తిడి తెచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయమే అని, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి... ప్రధాని స్థాయిలో ఒత్తిడి వల్లే ఇలా జరిగిందేమో అంటున్నారు... ఇలాగే యాపిల్ సంస్థ కూడా, దాదాపు మన రాష్ట్రంలో తిరుపతికి వస్తుంది అని వార్తలు వచ్చాయి, ఎంఓయి కుదుర్చుకుంటుంది అనే టైంలో, యాపిల్ సంస్థ మహారాష్ట్ర వెళ్ళిపోయింది...ఇదే ప్రధాని మోడీ, మన రాష్ట్రం పై చూపించే ప్రత్యెక శ్రద్ధ.... ఇలాంటి వాటి పై మోడీని అడిగే దమ్ము, మన జగన్ కు, పవన్ కు ఉండదు... ఎదురు ముఖ్యమంత్రి పడి ఏడుస్తారు...