హైదరాబాద్ లో నివసించే ఐవైఆర్ కృష్ణా రావు, అమరావతి పై విషం చిమ్ముతూ ఒక పుస్తకం రాస్తే, ఆ పుస్తకం ఆవిష్కరణకు హైదరాబాద్ లో నివసించే పవన్ కళ్యాణ్ విజయవాడ వచ్చారు... అమరావతి పై నిలువెల్లా విషం చిమ్ముతూ, మాట్లాడారు... ఇదే సభలో కాంగ్రెస్ మాజీ నేత, వైఎస్ఆర్ ప్రియ శిష్యుడు, జగన్ కు శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పాల్గున్నారు... ఉండవల్లి ఈ సభలో మాట్లాడుతూ, ఎంతో వెకిలిగా రాజధాని రైతుల త్యాగాలు ఎగతాళి చేస్తే, అంతే వెకిలిగా ఏ మాత్రం సిగ్గు అనేది లేకుండా, రైతుల త్యాగాలను వెకిలి నవ్వులతో పవన్, ఐవైఆర్ అపహాస్యం చేసారు...
ఉండవల్లి మాట్లాడుతూ, 33 వేల ఎకరాలు త్యాగం చేసారు, త్యాగం చేసారు అని పదే పదే మాట్లడుతున్నారు, త్యాగం చెయ్యటం అంటే, మొత్తం ఇచ్చేయటం... త్యాగం అంటే పోయినట్లే అనే దానర్థం. సీఎం చంద్రబాబు టీవీల్లో చెబుతుంటే అసలు త్యాగం చేయాల్సిన ఖర్మ రాజధాని రైతులకు ఎందుకు పట్టింది? రైతుల దగ్గర భూములు అన్నీ మీకు ఎమన్నా ఫ్రీ గా ఇచ్చారా, అంటూ ఎంతో వెటకారంగా మాట్లాడారు... దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంతే వెకిలిగా నవ్వటం, నిజంగా ఆక్షేపనీయం... వీరికి కనీసం అవగాహన లేకుండా చేస్తున్న వెటకారాలు ఇవి...
త్యాగం అంటే ఎకరాకు 25% అబివృద్ధి చేసిన భూమి తీసుకుని మిగతాది ప్రభుత్వానికి ఇవ్వడం, నీకు ఇది కూడా అర్ధం కాకపొతే ఎలా ఉండవల్లి ? నువ్వు నీ ఎదవ లాగిక్ లు, పైగా భూసమీకరణ రైతులకు రుణమాఫీ తో పాటు పేకేజీ కూడా ఇచ్చారు, 90% మందికి పైగా స్వచ్చందం గా ఇచ్చారు, తమ తరువాతి తరాలు బాగుపడతాయి అని... రైతులు తమ భూములు ఇస్తున్నారు అంటే, అది త్యాగం కాదా ? రైతుకి, భూమితో ఉండే అనుబంధం తెలియదా ? అంత అనుబంధం ఉంచుకుని కూడా, మాకు మరింత మేలు చేకూరుతుంది అని, మా బిడ్డలు బాగుంటారని, మన రాష్ట్రానికి మంచి రాజధాని వస్తుంది అని, రాష్ట్ర ప్రభుత్వానికి భూమి ఇస్తే దాన్ని త్యాగం అనరా ? మీరు, మీ ఇంట్లో ఉన్న భూమి ఒక ప్రాజెక్ట్ కట్టటానికి ఇవ్వమంటే ఇస్తారా ? మరి అది రైతన్నల త్యాగం కాదా ? ఉండవల్లి అంటే అన్నీ వదిలేసిన వాడు అని అందరికీ తెలుసు... ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి, 25 సంవత్సరాలు ప్రజా సేవ చేస్తా అంటున్న పవన్, ఇలా వెకిలి నవ్వులు నవ్వుతూ, రైతన్నల త్యాగాన్ని అపహాస్యం చెయ్యవచ్చా ? ఎందుకు అండి మీకు అమరావతి అంటే అంత మంట...