రాక రాక జ‌నంలోకి ఓ స‌భ‌కి వ‌స్తారు ముఖ్య‌మంత్రి. వ‌చ్చిన ఆ స‌భ‌లోనూ తానేం చేశారో చెప్ప‌రు. ప‌వ‌న్ పెళ్లిళ్ల‌పై ఏడుస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ బాగున్నాడు. ఆయ‌న‌ని పెళ్లి చేసుకుని విడిపోయిన భార్య‌లు వారి కుటుంబాలు బాగానే ఉన్నాయి. ప‌వ‌న్ పెళ్లిళ్ల వ‌ల్ల ఎవ‌రికీ లేని స‌మ‌స్య జ‌గ‌న్ రెడ్డికి ఎందుకో ఎవ్వ‌రికీ అంతుబ‌ట్ట‌ని విష‌యం. ఇంకో అరిగిపోయిన రికార్డు మ‌ళ్లీ వేశాడు. ద‌త్త‌పుత్రుడు, ద‌త్త తండ్రి. నువ్వు సింగిల్ సింహానికి అని జూలు విదిల్చుతున్న‌ప్పుడు ఆ ద‌త్తులు క‌లిస్తే జ‌గ‌న్ రెడ్డికి ఏంటో స‌మ‌స్య తెలియ‌దు. మీ ఇద్ద‌రు (టిడిపి+జ‌న‌సేన‌) క‌లిసి పోటీ చేయొద్ద‌ని ఏడుస్తాడు. వైకాపా ఎలా పోటీ చేయాల‌నేది నీ ఇష్ట‌మైన‌ప్పుడు, వాళ్ల పార్టీల అధినేత‌లుగా క‌లిసి పోటీచేస్తారో, విడివిడిగా పోటీ చేస్తారో వాళ్లిష్టం. ఎదుట పార్టీలు ఎలా పోటీ చేయాలో కూడా వైకాపా అధినేత డిసైడ్ చేస్తుండ‌డం ఆయ‌న అభ‌ద్ర‌తాభావానికి, ఓట‌మికి సంకేతం అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ నుంచి టీడీపీ, జనసేన క‌ల‌యిక‌పై జ‌గ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు సాగించ‌డం ఎంత‌గా ఈ పొత్తు భ‌య‌పెడుతోంది అర్థ‌మైపోయింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు చూస్తుంటే, త‌న వీపు త‌న‌కి క‌న‌ప‌డ‌దే సామెత అతికిన‌ట్టు స‌రిపోతుంది. ప్ర‌తీస‌భ‌లోనూ విప‌క్షాల‌పైనా, మీడియాపైనా ఏడుస్తూనే కాలం గ‌డిపేస్తుంటారు. ఈటీవీ, ఏబీఎన్, టివి5తో ఏ మీడియా సంస్థ‌లేని మీ బిడ్డ యుద్ధం చేస్తున్నానంటాడు. సాక్షి ఎవ‌రిది? ఎన్టీవీ ఎవ‌రి ప‌క్షం? టీవీ9 ఎవ‌రి చుట్ట‌మో మాత్రం చెప్ప‌డు. సొంత బాబాయ్ ని ఇంట్లోనే గొడ్డ‌లితో త‌మ్ముడు న‌రికేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ గుండె-గొడ్డ‌లిపోటు క‌థ‌ల‌న్నీ ముందుగా తెలిసిన వ్య‌క్తి జ‌గ‌న్ రెడ్డి అని ఏబీఎన్ ఆర్కే ఉతికి ఆరేస్తున్నాడు. సీబీఐ గొడ్డ‌లి వేటు విచార‌ణ‌లన్నీ త‌న ఇంటి చుట్టూ తిరుగుతుంటే, ఒక క‌న్నుని మ‌రో క‌న్ను ఎందుకు పొడుషుకుంటుంది అని అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తాడు. జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి స‌భావేదిక‌ల‌పై నుంచి త‌న గొడ్డ‌లిపోటు సంగ‌తి మాట్లాడ‌దు.  చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనంటూ సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు జ‌నంలోనూ మార్పు వ‌చ్చేసింది. సొంత బాబాయ్ ని చంపేసి..చంద్ర‌బాబుపైకి నెట్టేసి సాక్షిలో నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అని రాసిన సంగ‌తి జ‌నాలు ప‌ట్టేశారు. ఇప్పుడు గొడ్డ‌లిపోటు కూడా త‌న ఇంటిదేన‌ని తెలిసిన జ‌గ‌న్ రెడ్డి, చంద్ర‌బాబుని వెన్నుపోటు అనే అర్హ‌త కూడా లేద‌ని ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో ఖండిస్తున్నారు.

పిల్లి గుడ్డిదైతే ఎల‌క ముడ్డి చూపింద‌ని సామెత‌. ద‌ర్యాప్తు చేసే సీబీఐని మేనేజ్ చేయ‌గ‌లిగితే అన్న దొరికితే, నిందితుడైన త‌మ్ముడు ఎన్ని వేషాలైనా వేస్తాడ‌నేదానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో అనుమానితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో దాగుడుమూత‌లు ఆడుతున్నాడు. సీబీఐ విచార‌ణ‌కి రావాల‌ని ఆదేశిస్తే  త‌న‌కు వీలుకాద‌ని లేఖ రాసిన అవినాష్ రెడ్డి తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  త‌న‌కు షార్ట్ నోటీసుతో విచారణకు పిలిచారని లేఖ‌లో వివ‌రించిన అవినాష్ రెడ్డి తాను విచార‌ణ‌కి హాజ‌రు కాలేన‌ని పేర్కొన్నాడు.  వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నాన‌ని, అత్యవసర పనులు ఉన్నాయని సీబీఐకి లేఖ‌లో కోరాడు.  విచార‌ణ‌కి హాజ‌రు కావాలంటే నాలుగు రోజులు సమయం కావాలని కోరాడు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన సీబీఐ అధికారులు,  వెంటనే విచారణకు హాజరుకావాలని ఆదేశించార‌ని స‌మాచారం. అవినాష్ లెటర్ పై ఢిల్లీ సీబీఐ హెడ్ క్వార్ట‌ర్స్ కి సమాచారం ఇచ్చిన ద‌ర్యాప్తు అధికారులు వారి ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. చివరకు మళ్ళీ విచారణ 19వ తేదీకి వాయిదా వేసారు...

క‌ర్ణాట‌క‌లో దారుణ ప‌రాజ‌యంతో ద‌క్షిణాదిలో బీజేపీ చాప్ట‌ర్ ముగిసింది. క‌ర్ణాట‌క‌లో మ‌ళ్లీ గెలిచి ద‌క్షిణాదిలో మ‌రిన్ని రాష్ట్రాల‌లో పాగా వేయాల‌ని స‌ర్వ‌శ‌క్తులూ వొడ్డిన బీజేపీ క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. కేర‌ళ‌లో క‌మ‌లానికి సీన్ లేదు. త‌మిళ తంబీలు రానివ్వ‌రు. తెలంగాణ‌లో కాస్తా కూస్తో ఆశ‌లున్నా, క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో డైల‌మా నెల‌కొంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ ర‌హ‌స్య మిత్రులు చాలా బ‌లంగా ఉన్నారు. అక్క‌డ కేసీఆర్‌ని కొట్టాలంటే బీజేపీకి ఎవ‌రో ఒక‌రి మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. ఎంఐఎం, క‌మ్యూనిస్టులు అంతా కారు సారుతోనే ఉన్నారు. కాంగ్రెస్‌తో క‌ల‌వ‌లేరు. త‌మ ఆర్థిక‌, రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వాడుతున్న జ‌గ‌న్ రెడ్డికి తెలంగాణ‌లో ఓటుబ్యాంకులేదు. తెలంగాణ‌లో తెలుగుదేశానికి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అక్క‌డ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు మెజారిటీకి స‌రిప‌డా గెలిచి అధికారం ద‌క్కించుకోలేరు. కానీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారం ద‌క్కేలా చేయ‌గ‌ల‌రు. ఇంకొక బ‌ల‌మైన పార్టీకి అధికారం ద‌క్క‌కుండా చేసే స‌త్తా తెలుగుదేశానికి ఉంది. బీజేపీ తెలంగాణ‌లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఢిల్లీ పెద్ద‌లు వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక్క‌టే బీజేపీకి ఆప్ష‌న్‌గా క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో దారుణ ప‌రాజ‌యం త‌రువాత తెలంగాణ‌లో బీజేపీ త‌మ వ్యూహాల‌ను పునఃస‌మీక్షించుకోవాల‌నుకుంటోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ ఆశ‌లు మొల‌కెత్తాయి. కాంగ్రెస్ కూడా టిడిపి ఓటు బ్యాంకుతో చాలా సీట్లు గెల‌వొచ్చ‌ని, టిడిపితో టై అప్ కోసం య‌త్నించ‌వ‌చ్చిన రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నా.

Advertisements

Latest Articles

Most Read