జగన్ ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో చెప్పటానికి ఇదొక ఉదాహరణ... జగన్ అంటే, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు అని చెప్పే ఉదంతం... తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, తన మీద భరోసా లేదని తెలిసిన జగన్, చివరకు ఈ పని చేస్తున్నారు... సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కంట్రోల్ చెయ్యలేని జగన్, ఇక రాష్ట్రాన్ని ఏమి చెయ్యగలడు... జగన్ మీద విశ్వాసం లేక ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు... ఇంకా దాదాపు 25 మంది వచ్చేయటానికి రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి... అయితే, రాజ్యసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో, జగన్ కు ప్రస్తుతం ఉన్న 44 మంది ఎమ్మెల్యేలకు, ఒక రాజ్యసభ సీటు వస్తుంది... అయితే, జగన్ పై విశ్వాసం లేక, ఇప్పటికే కొంత మంది టిడిపిలో చేరి పోవటానికి రెడీగా ఉన్నారు..

jagan mla 06032018 2

ఈ నేపధ్యంలో, జగన్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ఎమ్మల్యేలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు... ముగ్గురు ఎమ్మెల్యేల టిడిపిలోకి వెళ్తే, టిడిపి రాజ్యసభ సీటు గెలుస్తుంది... అందుకే ముగ్గురు వెళ్ళినా, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మల్యేలతో, క్రాస్ వోటింగ్ కి జగన్ ప్లాన్ చేసారు... మరో బీజేపీ ఎమ్మల్యే జగన్ కు వోట్ వెయ్యటానికి ఒప్పుకోలేదని సమాచారం... అయితే, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, దాదాపు 12 మంది వైసిపీ ఎమ్మల్యేలు, టిడిపిలో చేరతారనే వార్తలు వస్తున్నాయి... దీంతో, ఎలాగైనా ఒక్క రాజ్యసభ సీటు గెలిచి, మోడీ ముందు తాను బలవంతుండని అని జగన్ నిరుపించుకోవటం కోసం, క్యాంప్ రాజకీయాలకు తెర లేపారు...

jagan mla 06032018 3

ఇందులో భాగంగా పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు చేజారకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి విదేశాలకు పంపాలని వైసీపీ నిర్ణయించింది. ఎవరికి టచ్‌లోకి రానివ్వకుండా వైసీపీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. టీడీపీ మూడో అభ్యర్థిని పెడితే ఏం చేయాలనే దానిపై వైసీపీ వ్యూహం రచిస్తోంది... ఎంత విదేశాలకు పంపినా, వారి మనసులో జగన్ మీద భరోసా ఉండాలిగా ? చూద్దాం ఏమవుతుందో ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాల పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో టిడిపి, బిజెపి నేతలు సోమవారం రాత్రి పూట ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రెండు రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఫోన్ చేశారు. మార్చి 5న, ఏపీకి నిదుల కేటాయింపు అంశంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. కానీ, ఈ సమావేశానికి మాత్రం అమిత్‌షా గైరాజరయ్యారు... అయితే ఈ సమావేశంలో, యనమల లేవనెత్తిన రెండు అంశాలకు, ఆర్ధిక మంత్రి జైట్లీ చేతులెత్తేశారు... చేద్దాం చూద్దాం, ఆయన్ని అడగండి, ఈయన్ను అడగండి అంటూ, తప్పించుకున్నారు...

yanamala 0602018 2

జీఎస్‌టీ కౌన్సిల్‌ తొలి సమావేశంలో ఇక మీదట ఏ రాష్ట్రాలకూ పన్నురాయితీలు కల్పించడం ఉండదని మీరు చెప్పినందునే మేం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాం. 22వ జీఎస్‌టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీని వాపసు ఇస్తున్నారు. అందువల్ల ఆ ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కచ్చితంగా కల్పించాల్సిందేనని...’’ యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జైట్లీ కొన్ని ఇబ్బందులను ఏకరువుపెట్టారు. అందుకు యనమల బృందం స్పందిస్తూ తామేం కొత్తగా ఏమీ అడగడంలేదని, ఈశాన్య రాష్ట్రాలకు ఏవైతే పన్ను రాయితీలిస్తారో అవి ఇస్తే చాలని స్పష్టం చేశారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించడానికి వాణిజ్యశాఖ తయారు చేసిన సర్క్యులర్‌ ఇప్పటికే కేబినెట్‌ సెక్రెటేరియట్‌కు వెళ్లిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌ పేరును కూడా చేర్చాలని యనమల కోరారు. అందుకు జైట్లీ స్పందిస్తూ తాను సురేష్‌ ప్రభుతో మాట్లాడి దీనిపై ఒక స్పష్టత ఇస్తానని చెప్పారు.

yanamala 0602018 3

అలాగే, ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90% వాటా ఇచ్చినట్లుగానే మాకూ ఇస్తామని చెప్పినందున, ఇవ్వాల్సిన 30% తేడా మొత్తాన్ని దేశీయ ఆర్థిక సంస్థల నుంచి ఇప్పించాలని యనమల కోరారు. నాబార్డు ద్వారానో, హడ్కో ద్వారానో ఆ మొత్తాన్ని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ విధానమైతే బాగుంటుందో ఖరారు చేయండి, దాని ప్రకారం ఇస్తామని అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. ఇలా తీసుకొనే రుణం ఎవరి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసుకోవాలని తాను ఇదివరకే చెప్పానని, దానిపై మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అది కేంద్రమే చేయాలని ఏపీ బృందం చెప్పింది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుపై స్పష్టత రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలు, తెలుగుదేశం సమన్వయకమిటీ సభ్యులతో ఈరోజు ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత వచ్చేంత వరకు పోరాటం ఆపొద్దని ఎంపీలకు స్పష్టం చేశారు. జైట్లీతో గత రాత్రి సమావేశ వివరాలను ఎంపీ తోటనరసింహ ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశానికి అమిత్‌షా హాజరుకాకపోవడంతో రెండు అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని.. మిగిలినవి వాయిదా వేశారని ఎంపీలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

cbn 0602018 2

దీని పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు.. హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గత రాత్రి అరుణ్ జైట్లీతో సమావేశానికి ఎందుకు రాలేదని చంద్రబాబు ప్రశ్నించారు... కేవలం రెండు అంశాలు చర్చించటానికి, ఇంత హడావిడి చేసారని, అవి కూడా స్పష్టత లేకుండా చేస్తాం, చూస్తాం అన్నారని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు... వీరు ఇలాంటివి చేస్తారు కాబట్టే, మీరు రాకపోవటం మంచిదైందని ఒక ఎంపీ అన్నారు..

cbn 0602018 3

రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు, పార్లమెంటులో హోదా కోసం నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని సూచించారు.. అన్నీ సాధించే వరకూ టీడీపీ వైఖరిలో మార్పు ఉండదని, ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలని కోరారు. .. దేశవ్యాప్తంగా ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలకు చంద్రబాబు పేరుతో ఉన్న లేఖలు అందజేయాలని, అవసరమైతే పార్టీల నేతలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్న భావన ఎంపీల్లో ఉందన్నారు. అరుణ్‌ జైట్లీతో సమావేశంలో ఈఏపీలు మినహా పారిశ్రామిక రాయితీల గురించి మాట్లాడలేదన్న టెలికాన్ఫరెన్స్ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

సోము వీర్రాజు ఎంతటి ఘనుడో అందరికీ తెలిసిందే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటం కోసం, విశ్వప్రయత్నాలు చేస్తూ ప్రతి రోజు పేట్రేగిపోవటం చూస్తున్నాం... రాష్ట్రానికి న్యాయం చెయ్యమని ఎవరన్నా అడిగితే, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు... అయితే, ఈ రోజు ఆ పూనకం, విష్ణుకుమార్ రాజుకి ఎక్కించారో ఏమో కాని, ఈ రోజు విష్ణుకుమార్ రాజు నానా హంగామా చేసారు... మా మోడీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యద్దు అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు... రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అయ్యా అంటే, ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎదురు వార్నింగ్లు ఇస్తున్నారు...

vishnu 06032018 2

ఈ ఉదయం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర వైఖరి పై టీడీపీ చేస్తున్న ఆందోళనలు పై నిప్పులు చెరిగుతూ ఊగిపోయారు... తాము నోరు తెరిస్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని, పరిస్థితి అంతదూరం రానీయకుండా తన నేతలను చంద్రబాబు కట్టడి చేయాలని, చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తున్నారు... విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటికే ఎంతో సాయం అందిందని, ఏపీకి ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అన్నారు... తామూ లెక్కలు తీయగలమని, చాలా అంశాలపై తమ వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు మోదీని నిత్యమూ తూలనాడుతుంటే, చంద్రబాబు చూస్తూ ఊరకున్నారని అన్నారు.

vishnu 06032018 3

కాగా, నిన్న విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి రైలు ఆకృతిలో ప్లెక్సీలు తయారు చేయించి, వాటి మధ్య నిలబడి, 'మోదీ మెడలు వంచుతాం' అంటూ వినూత్న నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే. ధానిని కించపరిచే వాళ్లపై సుమోటోగా కేసు నమోదు చేయాలని, చంద్రబాబు వెంటనే వాసుపల్లి గణేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు... అయినా కేంద్రాన్ని మన హామీలు నెరవేర్చండి అని నిరసనలు చేస్తే, రాజు గారికి ఇంత కోపం ఎందుకో... వారి ఫ్రెండ్ జగన్ గారి పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, మోడీని బట్టలు ఊడదీసి కొడతాం అంటే, ఒక్కరు మాట్లాడలేదు... కెసిఆర్ మోడీ గాడు అంటే దిక్కు లేదు... మా హక్కులు నెరవేర్చండి అంటే, రాజు గారికి పూనకం వస్తుంది...

Advertisements

Latest Articles

Most Read