ప్రశాంత్ కిషోర్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్, పరిచయం చేసిన పేరు... నిజానికి, జగన్ కు ప్రశాంత్ కిషోర్ ని పరిచయం చేసింది బీజేపీ అనే ఊహాగానాలు అప్పట్లో ఉన్నా, ఇప్పుడు అదే నిజం అనే వార్తలు వస్తున్నాయి... జగన్ ఎలాగూ తన బుర్రతో వ్యూహాలు పన్న లేడు, సీనియర్ లు చెప్పిన మాట వినడు, అందుకే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి, జాకీలు వేసి మరీ జగన్ ను పైకి లేపే ప్రయత్నం చేసాడు.. మనోడు మాత్రం, రోజు రోజుకీ పాతాళానికి పడిపోతున్నాడు... ప్రశాంత్ కిషోర్ బీహార్ బుర్ర, మన ఆంధ్రాలో పని చెయ్యలేదు... ప్రశాంత్ కిషోర్ వచ్చిన మొదట్లోనే, తను చేసిన ఫేక్ పనులని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టేశారు... పీకే ఏమి చేసినా, ఫేక్ అనే ప్రచారం ఏపి ప్రజల్లో ఉంది... ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్, మళ్ళీ మోడీతో కలిసి పని చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి...

modi jagan pk 26022018 1

ఎలాగూ జగన్, బీజేపీతో కలిసిపోతాడు కాబట్టి, ఇద్దరికీ పని చేయ్యనున్నాడు పీకే... 2019 ఎన్నికలకు పని చేయటానికి , ఆరు నెలలుగా ప్రధాని మోడీతో రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్... గడచిన నెల రోజుల్లోనే 2 సార్లు వీళ్లద్దరూ భేటీ అయ్యారు అనే సమాచారం నేషనల్ మీడియాలో వచ్చింది... ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని ప్రశాంత్ కిషోర్ ను కోరారు మోడీ... ఆరు నెలలుగా ఇద్దరి మధ్య జరుగుతున్న మాటామంతీతో త్వరలోనే మోడీ టీంలోకి జాయిన్ కానున్నాడు ప్రశాంత్ కిషోర్..

modi jagan pk 26022018 1

2012 నుంచి పీకేతో మోడీకి పరిచయం... 2012లో బీజేపీ గుజరాత్ కోసం పని చేశారు... ఆ తర్వాత 2014 ఎన్నికల కోసం గుజరాత్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు మోడీ... గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు... మోడీ ప్రచార వ్యూహంలో కీలక వ్యక్తిగా ఎదిగారు... ఇప్పుడు జగన్ కి ఎలా ఫేక్ చేసి ప్రచారం చేసాడో, అప్పట్లో మోడీ ని కూడా ఇలాగే ఫేక్ చేసి, పైకి లేపాడు పీకే... అప్పట్లో అంటే, ప్రజలకు ఇంత అవగాహన లేదు కాబట్టి, వీరి ఆటలు సాగినియ్యి... ఇప్పుడు ప్రజలకి ఏది వాస్తవమో, ఏది అవస్తావామో ఇట్టే తెలిసిపోతుంది... వీరు ఎంత ఫేక్ ప్రచారాలు చేసినా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు... సో ఈ విధంగా కూడా, జగన్, బీజేపీ బంధం, ప్రశాంత్ కిషోర్ రూపంలో మరోసారి బయట పడింది...

సిఐఐ భాగస్వామ్య సదస్సులో హాజరయ్యేందుకు విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం, కిర్లంపూడి లేవుట్లోని తన కుమారు డికి చెందిన ఇంట్లో బస చేశారు. ముఖ్యమంత్రి ఉదయం అక్కడికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి మెలసి పనిచేయాలని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని కేంద్రంతో కూర్చుని పరిష్కరించుకోవాలని వెంకయ్య, చంద్రబాబుకి సూచించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం మంచిది కాదని చంద్రబాబుకు వెంకయ్యనాయుడు సూచించారు.

venaiah 26022018 2

రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ, చొరవ తీసుకుంటున్నందుకు వెంకయ్యకు ధన్యవాదాలు చెప్తూనే, కొన్ని విషయాలు తెగేసి చెప్పినట్టు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేరిస్తేనే, అందరికీ మంచింది అని, దీని పరి రాజీ లేదని చెప్పారు... కేంద్రంలో బీజేపీతో కలిసింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని, అవి నేరవేరనప్పుడు, ప్రజల ఆకాంక్ష ప్రకారం ముందుకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు... రాష్ట్రంలో ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా, కేంద్రం వైపు నుంచి ఎలాంటి సానుకూల చర్చలు లేవని, చంద్రబాబు తెలిపారు...

venaiah 26022018 3

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ తదితరులతో తాను మాట్లాడతానని, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని వెంకయ్యనాయుడు పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెంకయ్యనాయుడు ఇది వరకూ ప్రయత్నం చేశారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల చివరి రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీలతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకి తాను కేంద్ర మంత్రిగా ఉండగా కొంత ప్రయత్నం చేశానని, దానికి కొనసాగింపుగానే ఈ సమావేశం నిర్వహించానని ఆయన అప్పట్లో చెప్పారు.

చంద్రబాబుకి ఇంగ్లీష్ మాట్లాడం రాదు, నేను ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాను అంటాడు ఒక మహానుభావుడు... ఇంకొకడు, నీ మొఖం చూసి ఎవడూ పెట్టుబడులు పెట్టరు అంటాడు... వీళ్ళు వెనక్కి తరిగి చూసుకుంటే, 33 స్కాములు, 66 చార్జ్ షీట్లు.. కాని ఏమి చేస్తాం ప్రజాస్వామ్య దేశం కదా, అందరినీ భరించాలి... మన ముఖ్యమంత్రి వీళ్ళ లాగా కాదు... వీల్లందరికీ ఆయన పనితనం తోనే సమాధానం చెప్తారు... నిన్న మరో సారి, తాను ఏంటో దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో మంది మేధావుల మధ్య నిరూపించుకున్నారు. ఇంగ్లీష్ అనేది ఒక బెంచ్-మార్క్ కాదు, నాలెడ్జి మేటర్స్ , అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ల్స్ మేటర్స్, ఎక్స్పీరియన్స్ మేటర్స్ అనేది మరో సారి నిరూపించారు చంద్రబాబు...

cbn 26022018 2

టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించడమే కాదు.. దానిని విజయవంతంగా అమలుచేసి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సమగ్ర ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, ఈ- ఆఫీస్‌, ఈ-కేబినెట్‌, బయోమెట్రిక్‌, ఈ-క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వచ్చే మార్చి నెలాఖరులోగా కాగిత రహిత పాలన వచ్చేస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఫైలింగ్‌, ఈ-ఆఫీస్‌, బయోమెట్రిక్‌ అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు (సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌) రెండోరోజు.. ‘రేపటి కోసం సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ ఫర్‌ టుమారో)’ అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.

cbn 26022018 3

ప్రసంగం చివరకి వచ్చేసరికి, క్రికెట్ లో, సచిన్ ఫార్మ్ లో ఉంటే ఎలా రేచ్చిపోతాడో, అలా ఆయనలో ఉన్న మార్కెటింగ్ గురు బయటకి వచ్చాడు... అక్కడ ఉన్న పెట్టుబడిదారులను ఉద్దేశిస్తూ... మీరు మా అమరావతి రండి, మా రాష్ట్రం రండి.. జరుగుతున్నది చూడండి... పెట్టుబడులు పెట్టండి... మీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాను... 24/7 పవర్, వాటర్... పవర్ సెక్టార్ లో మమ్ముల్ని కొట్టినోడు లేడు... ప్రతి ఇంటింకి ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ ఇస్తున్నాం... ప్రతి ఇంటిని ఒక నాలెడ్జి ప్లేస్ గా తీర్చిదిద్దుతున్నాం... మాకు సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు... వ్యవసాయం,పారిశ్రామికం రెండు బాలన్స్ చేస్తున్నాం... ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము టాప్... ఇవన్నీ నేను చెప్పటం కాదు, మా గ్రోత్ రేట్ చూడండి... డబల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉన్న ఏకైక రాష్ట్రం మాది.... వచ్చే సంవత్సరం కూడా మేము డబల్ డిజిట్ గ్రోత్ సాధిస్తాం... మేము పోటీ పడేది ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్కడ ఉన్నా వాటితో... అమరావతి ని వరల్డ్ టాప్ 10 సిటీస్ లో ఉంచటమే నా ధ్యేయం... నేను తప్పకుండా అది సాధించి తీరుతా అంటూ, తాను సియంని అనే విషయం మర్చిపోయి, తన రాష్ట్రం గురించి ఒక మార్కెటింగ్ అజేంట్ లా పెట్టుబడి దారులకి, వివరించారు..

ఇంత సుదీర్ఘంగా చంద్రబాబు చేసిన ప్రసంగం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది... చంద్రబాబుకు తన రాష్ట్రాన్ని అభివృధి చెయ్యటానికి ఎంత తాపత్రయపడుతున్నారో అక్కడ ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు గుర్తించారు. తన ప్రసంగం ముగియగానే, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది... ఒక నాయకుడి నాయకత్వ లక్షణాలు బయట పడేది ఇలాంటి సందర్భాల్లోనే కదా.... ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఉండటం ఎంతో గర్వకారణం అని టీవీల ముందు కూర్చున్న ప్రజలు, ప్రశంసించారు....

వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు మరో సరి కొత్త టెక్నాలజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... అదే "అలెక్సా"...

alexa 260222018 2

నిన్న చంద్రబాబు విశాఖ సిఐఐ సమ్మిట్ లో ఇచ్చిన ప్రెజంటేషన్ లో, అమెజాన్‌ తయారుచేసిన అలెక్సోను సభికుల ముందు ఉంచారు. వాయిస్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ ద్వారా అలెక్సో స్పందించిన తీరు సభికులతోపాటు విద్యార్థులను కట్టిపడేసింది. సీఎం డ్యాష్‌బోర్డుకు వాయిస్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ ద్వారా కనెక్ట్‌ చేసి.. అలెక్సోను ఆహ్వానించిపుడు కొద్దిసేపు మౌనం వహించి తరువాత తనదైన భాషలో అర్థంచేసుకుని, అడిగినదానికి సమాధానం చెప్పింది.. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న అలెక్సా సాఫ్ట్‌వేర్‌.. భవిష్యత్తులో ప్రజలు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

alexa 260222018 3

భవిష్యత్తు పాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి విస్తరిస్తుందో వివరిస్తూ ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచదేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇంటి నుంచే ఈ సాఫ్ట్‌వేర్‌తో నేరుగా మాట్లాడొచ్చని, ఆఖరికి నీటి సమస్యలు, ఇతర ఏ సమస్యల గురించి చెప్పినా ‘అలెక్సా’ నేరుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తుందని వివరించారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ వద్ద తప్పితే మరెక్కడా లేదని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా రూపొందిస్తున్నామని, ఎవరైనా వచ్చి వినూత్న ఆలోచనల్ని పంచుకోవచ్చని సీఎం పిలుపునిచ్చారు... ఈ కింద వీడియోలో, 6వ నిమషం నుంచి చూడండి...

Advertisements

Latest Articles

Most Read