చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గునటానికి దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే... చంద్రబాబు అక్కడ నిమషం కూడా వేస్ట్ చెయ్యటం లేదు... అక్కడ మీటింగ్స్ లో గ్యాప్ వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెడుతున్నారు... ఉదయం, ధాన్యం కొనుగోళ్ళు పై టెలి కాన్ఫరెన్స్ నిర్వచించారు... అలాగే సాయంత్రం, దావోస్ నుంచి తూర్పు గోదావరిలో ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్చర్యపరిచారు.. అది ఎలాగంటే, ఈ పూర్తి కధనం చూడండి...
మొన్నటి వరకు సమాచార వ్యవస్థ లేని గిరిజన గ్రామం, నేడు దావోస్ తో మాటకలిపింది... తూర్పు గోదావరి జిల్లాలోని ఒక చిన్న గిరిజన గ్రామం అది.. పేరు జాజివలస గ్రామం.... దేనికైనా 10 కిలోమీటర్లు వరకు బయటకు వెళ్లాలి... సమాచార వ్యవస్థ లేని అవస్థ ఆ గ్రామ ప్రజలది... కాని ఈ రోజు ఆ గ్రామం, మంచు కప్పేసిన దావోస్ తో, జాజివలస గ్రామం కబుర్లు చెప్పింది... దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జిల్లాలోని రంపచోడవరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజివలస గిరిజనులతో మాట్లాడారు....
గూగుల్ ఎక్స్ ద్వారా జాజివలసకు టెలిఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఏర్పాటు చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించడంతో గిరిజనులు పులకరించి పోయారు. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ద్వారా గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో జాజివలసకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు... అంతే కాదు, అదే సమయంలో ఒక మహిళ, మాకు ఇల్లు లేదు అంటే, అదే వీడియో కాన్ఫరెన్స్ లో ఆమెకు ఇల్లు కూడా మంజూరు చేసారు చంద్రబాబు... కనీస సమాచార వ్యవస్థ లేని ఆ గ్రామానికి, ప్రపంచంతో సంధానం చేసారు.. ఇప్పుడు ఆ గ్రామం టివి, మొబైల్ & ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు... అక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేవు...