ప్రకాశం బ్యారేజ్, గుంటూరు జిల్లాని, కృష్ణ జిల్లాని కలిపే వారధి.... ఎవరైనా సరే బెజవాడ వస్తే, ప్రకాశం బ్యారేజిని సందర్శించి ఒక ఫోటో తీసుకోవాల్సింది.. అంత అందంగా ఉంటుంది ఆ ప్రదేశం.... బ్యారేజీ వద్ద నలువైపులా ఎత్తైన కొండలు, బ్యారేజీలో నిరంతరం నిల్వ ఉండే నీరు, నది మధ్యలో అక్కడక్కడా ఏర్పాటైన లంక భూముల్లో పచ్చని ప్రకృతి మైమరిపిస్తూ, పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికే ఈ బ్యారేజి ఒక ఐకాన్ అంటే అతిశయోక్తి కాదు... అటు ఐదు జిల్లాల రైతులకి ఆయువుపట్టు ... అంతటి విశిష్టత కలిగిన మన ప్రకాశం బ్యారేజి 60 వసంతాలు పూర్తి చేసుకుంది... పసిడి పంటల సిరులతో, గలగల పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మ ఒడిలో జరగనున్న షష్టిపూర్తి వైభవం...

ఇదీ చరిత్ర: 1832-33 సంవత్సరంలో తీవ్ర కరువుకు లక్షలాది మంది అశువులు బారటంతో అప్పటి ప్రభుత్వం కృష్ణా నది పై ఆనకట్టు నిర్మించాలని డెల్టాకు సాగునీరు అందించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా 1847వ సంవత్సరంలో సర్ ఆర్థర కాటన్ సిఫార్సులకు అనుగుణంగా, కెపెన్ ఓర్ ఆద్వర్యంలో ప్రకావం బ్యారేజి ఉన్న స్థానంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి 1852లో ప్రారంభించారు. ఈ ఆనకట్ట ద్వారా కృష్ణా, పశ్చిమ, తూర్పు డెల్టాలకు 5.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేవారు.

100 సంవత్సరాలు సేవలు అందించిన తరువాత 1952 సంవత్సరంలో వచ్చిన వరదలకు ఆనకట్టు గండిపడి కొంత భాగం కొట్టుకుపోవడంతో నూతన బ్యారేజి అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులచే 13.2.1952 సంవత్సరంలో శంఖుస్థాపన చేయబడి, 1957 నాటికి పూర్తిచేశారు. 24.12.1957 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బ్యారేజిని ప్రారంభిస్తూ ప్రకావం బ్యారేజిగా నామకరణం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సాగు, త్రాగునీరు అందిస్తూ, ఆయువుపట్టుగా నిలిచింది. 2009 సంవత్సరంలో 11.10 క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన పటిష్టమైన కట్టడం. ప్రకాశం బ్యారేజి పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు), 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కూడా ఉంటుంది. ఊహించని రీతిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను పవిత్రసంగమం వద్ద అనుసంధానం చేయడంతో పాటు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా అదనపు జలాలు వలన ప్రకాశం బ్యారేజి విశిష్టత మరింత పెరిగింది.

వెంకయ్య నాయుడు, మొన్నటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి కావాల్సిన సహాయం చేసిన కేంద్ర మంత్రి... తన సొంత శాఖలోనే కాక, మిగతా శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన పనులు చూసుకునే వారు... ఆయన ప్రాతినిధ్యం వహించిన పట్టణాభివృద్ధి శాఖలో చేతనైన సహాయం చేశారు... రాష్ట్రానికి ఇళ్ళ కేటాయింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజికి నిధులు, అమరావతికి స్మార్ట్ సిటీ హోదా... ఇలా ఎన్నో పనులు చూసుకునే వారు... ఇలా ఉండగానే ఉప-రాష్ట్రపతిగా వెళ్ళిపోయారు... దీని వెనుక చాలా ఊహాగానాలు వినిపించాయి... ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది... నష్టం మాత్రం రాష్ట్రానికి జరిగింది...

venkayya 23122017 2

ఉప రాష్ట్రపతి అంటే ఎదో రబ్బర్ స్టాంప్ అనుకున్నారు... చెప్పింది ఊ కొట్టి, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకున్నారు... రాజ్యసభని మైంటైన్ చేయటం అనుకున్నారు... కాని ఉప రాష్ట్రపతి హోదాలో అల్లాడిస్తున్నారు వెంకయ్య... పక్కన పడేసాం అనుకున్నారు కాని, వరుస పెట్టి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సమస్యల పై ఉప రాష్ట్రపతి హోదాలో రివ్యూ చేశారు... కేంద్ర మంత్రుల్ని, సీనియర్ అధికారులని పిలిపించుకుని అన్ని విషయాల పై చర్చించారు... ఉప రాష్ట్రపతి హోదాలో ఉంటూ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి, అదీ రాష్ట్ర బీజేపీ ప్రజా ప్రతినిధులను కూడా కూర్చోబెట్టుకుని, ఎలా సమీక్ష చేస్తారు అంటూ విమర్శలు వస్తున్నాయి... విమర్శలు, రూల్స్ ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, సమస్యల పై వెంకయ్య రంగలోకి దిగారు...

మొదటి రోజు పోలవరం పై సమీక్ష చేశారు... పోలవరం పురోగతిపై ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు సమక్షంలో సమీక్ష జరిగింది. ఢీల్లీలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్య విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు పరిశ్రమ పై రివ్యూ చేసారు... కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మంత్రి సోమిరెడ్డి పాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో కేంద్ర గనుల, ఉక్కు శాఖ మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్, ఆ శాఖ కార్యదర్శి అరుణ శర్మ త‌దిత‌రులో పార్లమెంటులో చర్చలు జరిపారు. ఈ నెల 27న మరో ధఫా సమావేశమై సమగ్రంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

పోలవరం విషయంలో సోము వీర్రాజు లాంటి రాష్ట్ర బీజేపీ నేతలు, అలాగే ఆయన స్నేహితులు అయిన వైసిపి పార్టీ నేతలు, అవినీతి జరిగిపోయింది అని గగ్గోలు పెట్టారు... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసింది కాబట్టే, పోలవరం లేట్ అవుతుంది అంటూ, ప్రజలని తప్పు దోవ పట్టించారు... ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అన్నీ ఆన్లైన్ లో ఉన్నాయి అని చెప్పినా వినలేదు... అయినా, బిల్లులు సమర్పించకుండా, వాతిని స్క్రూటినీ చెయ్యకుండా, ఎవరైనా నిధులు ఇస్తారా ? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి, బిల్లులు పెట్టి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నాబార్డ్ నుంచి పెట్టిన ఖర్చు రాబట్టుకుంటుంది..

polavaram 23122017 2

ఇలాంటి చోట అవినీతి ఎలా జరుగుతుందో, వీరికే తెలియాలి... ఇది ఇలా ఉండగానే, వీరికి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సీఈవో ఎస్‌కే హల్దర్‌ చెప్పిన మాటలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి... పోలవరం ప్రాజెక్టు సీఈవో ఎస్‌కే హల్దర్‌ గురువారం క్షేత్ర స్థాయి పర్యటన చేశారు... ఈ సందర్భంగా బిల్లులు గురించి మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులకు సంబంధించి నిధుల వినియోగ పత్రాల(యూసీ - యుటిలైజేషన్ సర్టిఫికేట్)తో పాటు బిల్లులు కూడా తమకు నేరుగా పంపిస్తున్నారని, వీటి పరిశీలన తమకు బాగా కష్టమవుతోందని చెప్పారు. ఇక యూసీలు పంపితే చాలని సూచించారు.

polavaram 23122017 3

బిల్లులు టైం పడతాయి అని, ప్రాజెక్ట్ తొందరగా ముందుకు వెళ్ళాలి అంటే, ఇవన్నీ జాప్యం అవుతాయి అని అన్నారు... ఒక పక్క బిల్లులు పంపిస్తేనే అవినీతి అని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ బ్యాచ్ ఇప్పుడు ఏమి అంటుందో ? ఇది కేంద్రానికి చంద్రబాబా పై ఉన్న నమ్మకం... కేవలం యుటిలైజేషన్ సర్టిఫికేట్ చాలు అని అంటున్నారు అంటే, మనం ఎంత పక్కాగా పని చేస్తున్నామో అర్ధమవుతుంది... ఇంకా ఈ సొల్లు ఆపి, మీరు కూడా కేంద్రంతో పోరాడితే అందరికీ మంచింది... ఆ వైసీపీ బ్యాచ్ తో కలిసి, వీళ్ళు చేస్తున్న పనులు ప్రజలు చూస్తూనే ఉన్నారు... పోలవరం, అమరావతి జోలికి వస్తే, ప్రజలు కప్పెడతారు జాగ్రత్త...

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పై సీబీఐ కోర్ట్ వెలువరిచిన సంచలన తీర్పు పై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చించుకుంటున్నారు... ముఖ్యంగా అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ చేసిన ఇన్వెస్టిగేషన్, ఆధారాలు, ఛార్జ్ షీట్లు గురించి మాట్లాడుకుంటున్నారు... ఇక్కడ కేసుల తీరు వేరు అయినా, స్వరూపం ఒక్కటే.. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పై ఆరు కేసులు ఉన్నాయి.. ఇప్పటికే ఒక కేసు రుజువు అయ్యి, జైలు శిక్ష కూడా అనుభవించారు... ఇవాళ రెండో కేసు తీర్పు వెలువడింది... అలాగే ఇంకా నాలుగు కేసులు ఉన్నాయి.. ఈ నాలుగు కేసుల్లో కూడా ఆయన దోషిగా తేలే అవకాశాలే ఎక్కువ... అంటే, ఆయన జీవితం అంతా ఇక జైలులోనే గడిసిపోయే అవకాశం ఉంది.. ఈ కేసుకి, మన జగన్ మోహన్ రెడ్డి కేసుకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి...

jd 23122017 2

నిందితులు తప్పించుకుంటారు అని తెలిసి, అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ జగన్ పై పక్కగా కేసులు పెట్టారు... పక్కా ఆధారాలు పెట్టారు... ఎంత ఒత్తిడి ఉన్నా, కేసు తీర్పు డిలే చెయ్యవచ్చు ఏమో కాని, జగన్ అవినీతి రుజువు చెయ్యటం మాత్రం పక్కా.... అందుకే జగన్ పై, దాదాపు 14 ఛార్జ్ షీట్లు వేశారు.... ప్రతి ఛార్జ్ షీట్ ఒక కేసుగా పరిగనిస్తారు... అన్నిట్లో సాక్షాలు పక్కగా ఉన్నాయి... ఎదో ఒక్క కేసులో తప్పించుకున్నా, 14 కేసుల్లోనూ తప్పించుకోవటం అసంభవం... ఇవన్నీ తెలిసే జగన్ జాగ్రత్త పడుతున్నాడు...

jd 23122017 3

అన్ని కేసులు కలిపి, ఒకే కేసుగా పరిగనించమని అనేక సార్లు కోర్ట్ కి విన్నవించుకున్నా, ఫలితం లేదు... అందుకే ప్రొసీడింగ్స్ డిలే చెయ్యటానికి ఏవేవో పిటిషన్స్ వేసి ఆలస్యం చేస్తున్నారు. ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఇవి కూడా రెండు మూడు వాయిదాల్లో కొట్టేసే అవకాశాలు ఎక్కువ...డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేస్తే మనోళ్లు అయిపోయినట్టే.. చార్జెస్ మొదలుపెడతారు.కేసులు కొలిక్కి వస్తాయి... ఏదో ఒకదాన్లో శిక్ష తప్పనిసరి.... ఇలాంటి ట్రిక్ లు వాడతారు అని తెలిసే, ఇంత అవినీతి చేసినవాడు తప్పించుకోకూడదు అని, అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ పక్కగా సెట్ చేసే పెట్టారు... ఎవ్వరు, ఏ స్థాయిలో జగన్ ను కాపాడటానికి చూసినా, అవి మహా అయితే కేసు డిలే చేసేదాకే కాని, కేసు నుంచి బయట పడైలేరు... ఏ రోజుకు అయినా జగన్ కు శిక్ష పడటం అనేది మాత్రం పక్కా... ఇంత చేసాడు కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లక్ష్మీనారయాణ అంటే కష్టం, ఒక బ్యాచ్ కి మాత్రం లక్ష్మీనారయాణ అంటే ఎక్కడ లేని ద్వేషం...

Advertisements

Latest Articles

Most Read