ఇండిగో ఎయిర్ లైన్స్, చెప్పినట్టే, మన రాష్ట్రంలో భారీ ప్రణాళికతో అడుగు పెడుతుంది... ఇప్పటికే తిరుపతి, రాజమహేంద్రవరం షడ్యుల్ ప్రకటించిన ఇండిగో, గన్నవరం నుంచి భారీ షడ్యుల్ ప్రకటించింది. ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి దేశంలోని మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుండి ఇక్కడికి రోజుకు పది విమాన సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రయాణ షెడ్యుల్‌ను విడుదల చేయడంతోపాటు టికెట్‌ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఇండిగో నూతనంగా కొనుగోలు చేసిన 74 సీటింగ్‌ కెపాసిటి కలిగిన ఏటీఆర్‌ 72–600 విమానాలను నడపనుంది.

gannaram 23122017

ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ గతేడాది కాలంగా సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలోనే సర్వీసులు ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సర్వీసులను నడిపేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇండిగో ఏటీఆర్‌ రాకతో గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు గణనీయంగా పెరగడంతోపాటు ప్రయాణికుల ఆదరణ కూడా పెరుగుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

gannaram 23122017

సర్వీసుల వివరాలు: హైదరాబాద్‌ నుంచి ఉదయం 7.35కు, మధ్యాహ్నం 13.50, రాత్రి 20.10కు విమానాలు ఇక్కడికి చేరుకుంటాయి. తిరిగి ఇక్కడి నుండి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 18.45, రాత్రి 21.35కు హైదరాబాద్‌కు బయలుదేరతాయి. ఇక్కడి నుంచి ఉదయం 8 గంటలకు విమానం బయలుదేరి 9.35కు బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి 10.15కు బయలుదేరి 11.50కు ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి ఉదయం 15.15కు విమానం బయలుదేరి 16.35కు చెన్నైకు చేరుకుంటుంది. తిరిగి చెన్నై నుంచి 16.55కు బయలుదేరి 18.25కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.

గాలి జనార్ధనరెడ్డి... జగన్ మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చిన అన్నయ్య... ఇద్దరూ కలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసి కొల్లగొట్టారో అందరికీ తెలిసిందే... ఇద్దరూ జైలు జీవితం అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు... అయితే జగన్ మాత్రం ప్రతి రొజూ బయటే తిరుగుతున్నా, గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం, 4 ఏళ్ళ నుంచి ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చింది లేదు... మొన్న తన కూతురి పెళ్లి హంగామా అప్పుడు మీడియాలో వార్తలు గుప్పుమన్నా, తాను మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదో... అయితే, మొన్న 2జీ స్కాం అనేది లేదు అని సిబిఐ కోర్ట్ ఇచ్చిన తీర్పు పుణ్యమో, లేక ఢిల్లీ నుంచి వచ్చిన అభయమో, లేక దేవుడు ఇచ్చిన తమ్ముడు కూడా తొందర్లోనే ఫ్రీ అవుతారు అనే నమ్మకమో, మొత్తానికి 4 ఏళ్ళ తరువాత మీడియా ముందుకు వచ్చారు.. అదీ తన మూడవ ప్రత్యర్ధి అయిన ABN రాధాక్రిష్ణ దగ్గరకు వచ్చారు...

gali 23122017 2

అయితే గాలి జనార్ధన్ రెడ్డి మాట తీరు, వేషం పూర్తిగా మారిపోయాయి... ఒకప్పుడు చంద్రబాబు స్థాయి నాయకుడిని "కొజ్జా" అన్న నోటితో, చాలా సౌమ్యంగా పద్యాలు పాడుతున్నారు... ఏమి తెలియని అమాయకుడిగా కనిపిస్తున్నారు.. ఎప్పుడూ సూట్ లో కనిపించే మైనింగ్ డాన్, లుంగీ కట్టాడు... ఇక నుంచి ఇదే తన వేషం అంటున్నాడు... ఇవన్నీ చూస్తున్న ప్రజలకు, 1999లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గుర్తుకువచ్చాడు... 1999కి ఎలక్షన్స్ ముందు దాకా రాజశేఖర్ రెడ్డి అంటే ఒక రౌడీ, ఒక ఫ్యాక్షనిస్ట్, మత కల్లోలాలు చేసే వ్యక్తిగా పేరు ఉండేది. 1999 ఓటమి తరువాత, పూర్తిగా ఇమేజ్ మెక్ ఓవర్ లోకి వచ్చాడు వైఎస్ఆర్... ప్రజలకి చాలా మంచి వాడులా, సౌమ్యుడిలా కనిపించే ప్రయత్నం చేసి, మొత్తానికి సక్సెస్ అయ్యి, ముఖ్యమంత్రి అయ్యారు... తరువాత జరిగిన రక్త చరిత్ర తెలిసిందే... దాదాపు 200 మందిని చంపించి, పరిటాల రవి, కపట్రాల్ల లాంటి వారిని అతి కిరాతకంగా చంపించి, తన అసలు నైజాన్ని బయట పెట్టారు.... ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి ఇంటర్వ్యూ చుసిన వారికి కూడా, అప్పటి రాజశేఖర్ రెడ్డి నైజం గుర్తుకువచ్చింది...

gali 23122017 3

అంతే కాదు ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో చాలా ప్రశ్నలు ఉన్నాయి... "భక్త రామదాసుకే 11ఏళ్లు జైలు తప్పలేదు.. నాది పెద్ద విషయం కాదు" అంటూ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు... 2జీ స్పెక్ట్రమ్ కేసులో తీర్పును చూశాక ధైర్యం వచ్చిందనీ, తాను ఏ తప్పూ చేయలేదని హృదయంపై చేయి పెట్టుకుని చెప్పగలనని అంటున్నారు... రాజశేఖర్ రెడ్డి చనిపోవడం వల్లే ఈ కష్టాలు వచ్చాయని అనుకుంటున్నారా..?’ అన్న ప్రశ్నలకు కూడా గాలి జనార్ధనరెడ్డి సమాధానం ఇచ్చారు... ఈ పూర్తి ఇంటర్వ్యూ రేపు ఓపెన్ హార్ట్ లో రాత్రి 8.30 కి రానుంది...

గుజరాత్ ఎన్నికల ఫలితాలు రాగానే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ఎలా పేట్రేగిపోయాడు అందరూ చూసారు... అసలు అక్కడ బీజేపీ గెలిస్తే, ఇక్కడ ఈయన చంద్రబాబు మీద ఎందుకు రేచ్చిపోయాడో ఎవరికీ అర్ధం కాలేదు... అది బీజేపీ అభిప్రాయమా , సోము వీర్రాజు మనసులో ఉన్నది అంతా కక్కాడా అన్నది తెలీకి పోయినా, వీర్రాజు మాత్రం విర్ర వీగారు... ఎంతలా అంటే, కనీసం వార్డ్ మెంబెర్ కూడా గెలవలేని వ్యక్తి, నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయిస్తాను అనే దాకా... సహజంగా ఈ మాటలకు ఇబ్బంది పడ్డ కొంత మంది టిడిపి నాయకులు సోము పై రియాక్ట్ అయ్యారు... అయితే వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి, అలాంటి వారిని లైట్ తీసుకోమన్నారు.... వారి అజెండా వేరు అని, ట్రాప్ లో పడొద్దు అని చెప్పారు...

veerraju 22122017 2

ఇది ఇలా ఉండగానే, సొంత పార్టీ నేతలే సోము వ్యాఖ్యలను తప్పు బట్టారు... ఇవాళ ఏకంగా మీడియా ముందుకు వచ్చి, వీర్రాజుని లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు... ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు సోము వీర్రాజు పై బీజేపీ అధిష్టానికి ఫిర్యాదు చెయ్యటానికి ఢిల్లీ వెళ్లారు... పత్రికా సమావేశాలు, డిబేట్లలో చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాళ్ల వ్యక్తిగతమేనని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ పరువు, ప్రతిష్టలను మంటగలపాలని చూస్తున్నారని, ఈ విషయంపై జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

veerraju 22122017 3

ఈ సందర్భంగా శుక్రవారం ఉంగరాల చినబాబు మీడియాతో మాట్లాడుతూ పార్టీకి సంబంధం ఉన్న, లేని వ్యక్తులు బీజేపీ నాయకుల గురించి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి వాళ్ల వ్యక్తిగతమని అన్నారు. వారిపై జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. వారు మీడియాలో కనబడాలనే ఉద్దేశంతో కాంట్రవర్స్ వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్లకు అలా మాట్లాడే అర్హత లేదని ఉంగరాల అభిప్రాయపడ్డారు. ఏదైనా బీజేపీ అధిష్టానం చెప్పిన మాటే ఫైనల్ అని, ఇలాంటి వారి వ్యాఖ్యలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు అని, సోము వీర్రాజు గాలి తీసిపడేసారు సొంత పార్టీ నేత...

ఆంగ్లేయుల పాలనలో ప్రారంభమైన జనవరి 1 నూతన సంవత్సర వేడుకలను అన్ని ఆలయాల్లో నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది... సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాల్లోకి పాశ్చాత్య సంస్కృతి విస్తరించకుండా దేవాదాయశాఖ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేకంగా తోరణాలు కట్టడంతో పాటు ముగ్గులు వేసి పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇకపై అలాంటి వేడుకలు, కార్యక్రమాలు ఆలయాల్లో జరగడానికి వీల్లేదని స్పష్టంచేస్తూ ఆ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ap state 23122017 2

చైత్రమాసంలో వచ్చే ఉగాదినే కొత్త సంవత్సరాదిగా భావించాలని, ఆ రోజే వేడుకలు, కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేసింది. పాశ్చాత్య సంప్రదాయాలకు పట్టంకడుతూ గుడికి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలపడం, వారు సమర్పించిన కానుకలను పుష్పాలంకరణలకు ఖర్చు చేయడం సరికాదని తన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆలయాల ఈవోలు, జిల్లాల సహాయ కమిషనర్లకు ఈ ఆదేశాలను పంపింది. భక్తులు రొజూ లాగానే, వచ్చి దేవుడు దర్శనం చేసుకోవచ్చు అని, ఆలయాల్లో మాత్రం, ఆంగ్ల నూతన సంవత్సరం కోసం ఎలాంటి ఏర్పాట్లు చెయ్యవద్దు అని పెర్కున్నారు...

ap state 23122017 3

అయితే ఈ సూచనలను అన్ని ఆలయాల్లో తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్న దేవాదాయశాఖ అందులో ‘తప్పనిసరి’ అనే పదాన్ని కొట్టివేసింది. కాగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలు గడిచినా ఆంగ్లేయులు అలవాటు చేసిన క్రీస్తు శకాన్ని మనం ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నామని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు కార్యదర్శి డాక్టర్‌ చిలకపాటి విజయరాఘవాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఉగాది రోజు మాత్రమే కొత్త సంవత్సరం జరుపుకోవాలని పెర్కున్నారు...

Advertisements

Latest Articles

Most Read