భవానీ ఐలాండ్ సరి కొత్త అందాలు అందుకోబోతుంది. భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. దీనికి సంబంధించి నిర్మాణ పనులు అన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ట్రయిల్ రన్ నడుస్తుంది... ఈ నెలలోనే దీన్ని అధికారికంగా ప్రారంభించే అవకాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

bhavani island 16122017 2

ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. నది మధ్యలో, మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు. ఇది అత్యంత ఖర్చు కూడుకున్న భారీ ప్రాజెక్టు అయినప్పటికీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా చేపటామన్నారు. కోల్కత్తాకు చెందిన ప్రీమియం వరల్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించిందని వివరించారు.

bhavani island 16122017 3

ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.16 కోట్లు ఖర్చు అయ్యింది... దుర్గమ్మ వైభవం, అమరావతి చరిత్ర, మన రాష్ట్రానికి చెందిన ఘనమైన చరిత్రను లేజర్ షో రూపంలో పర్యాటకులకు చూపించనున్నారు... ఇప్పటికే బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ తో భవానీ ఐలాండ్ సందడిగా మారింది... ఇటీవల జరిగిన బోటు ప్రమాదంతో పర్యాటకులు కొంచెం వెనక్కి తగ్గినా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మళ్ళీ పర్యాటకం ఊపు అందుకుంది... ఇప్పుడు ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్స తో పర్యాటకులను మరింతగా ఆకర్షించే అవకాసం ఉంది.. ప్రస్తుతం జరుగతున్న ట్రయిల్ రన్ సక్సెస్ అవ్వగానే, దీన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు....

బ్రాండెడ్ క్రీడోపకరణాల కోసం ఆన్లైన్లో అన్వేషించాల్చిన పని ఇకలేదు. రాజధాని వాసుల ముంగిట్లోకే ప్రముఖ స్పోర్ట్స్ వేర్ యాక్సెసరీస్ బ్రాండ్ 'డెకాత్ల్ న్ " వచైస్తోంది. విజయవాడ నగర శివార్లలోని ఎనికేపాడులో సువిశాల మైదానంలో భారీ స్పోర్ట్స్ స్టోర్ ఈ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు బెంగళూరు, హైదరాబాద్లలో మాత్రమే ఈ సంస్థ తన స్టోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విజయవాడ కేంద్రంగా డెకాత్ల్ న్ తన స్టోర్ ను ఏర్పాటు చేస్తోంది.

decalthon 16122017 2

ఎనికేపాడులో ఎకరం స్థలాన్ని నెలకు రూ.10లక్షల లీజు ప్రాతిపదికన తీసుకుంది. ఈ స్థలంలో రూ.25 కోట్ల వ్యయంతో స్టోర్ ను నిర్మిస్తున్నారు. పనులు దాదాపు పూర్తి చేశారు. ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావాల్సి ఉంది. ఈ లోపు స్టోర్ లో ఉపకరణాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 20న స్టోర్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

decalthon 16122017 3

డెకాధాన్ వరల్డ్ బ్రాండ్ క్రీడోపకరణాల సంస్థ. ఫ్రాన్స్ కు చెందిన ఈ కంపెనీ అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో ఒకటి. క్రీడాకారులకు సౌకర్యంగా ఉండే స్పోర్ట్స్ వారే ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. క్రీడాకారులు ఉపయోగించే ఆట పరికరాలు ఇతర వస్తువులను కూడా ఈ సంస్థ అందిస్తుంది. క్రీడాకారులంతా ఈ సంస్థ అందించే దుస్తుల మీద అధికంగా ఆధారపడతారు. ఇవి బయటి మార్కెట్లో లబించవు. సంస్థ తన స్టోర్స్లో మాత్రమే విక్రయిస్తుంది. ఈ సంస్థ స్టోర్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఈ స్పోర్ట్స్లోవేర్, క్రీడోపకరణాలను కొనుగోలు చేయాలంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంస్థ ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్లలో మాత్రమే తన స్తోర్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా తన స్టోర్ను ఏర్పాటు చేస్తోంది.

కొన్ని రోజుల కృతం విజయవాడ మాచవరంలో, తెనాలకి చెందిన రౌడీషీటర్‌ కాళిదాసు హత్య కేసుని పోలీసులు చేధించారు... ఈ హత్య జరిగిన వెంటనే, ఈ హత్య చేసింది విజయవాడ తెలుగుదేశం నేత కాట్రగడ్డ శ్రీను అంటూ, వైసిపి నేతలు, సాక్షి మీడియా రచ్చ రచ్చ చేసింది... అయితే, పోలీసులు విచారణలో ఈ హత్య చేసింది వైసీపీకి చెందిన వారే అని తేలింది... ఈ హత్య కేసులో కూడా టెక్నాలజీ బాగా ఉపయోగపడింది... వీడియో ఎనలైటిక్స్‌ సహాయంతో, వీరు రెక్కీ నిర్వహించటం దగ్గర నుంచి, హత్య చేసి పారిపోయే దాకా, అన్నీ పక్కగా చేదించారు పోలీసులు.. వందకు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, వీడియో ఎనలైటిక్స్‌ ద్వారా పట్టుకున్నారు..

vij murder 16122017 2

గ్రూపు తగాదాలు, పాత కక్షలే సుబ్బు హత్యకు కారణమని తేల్చారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న తొమ్మిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు రౌడీషీటర్లు. నిందితుల్లో సురేంద్ర భార్య తెనాలిలో వైసీపీ తరపున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కౌన్సెలర్ స్థాయి నాయకులు హత్యలు చేస్తున్న వైసిపి నేతలు, దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు, ఎదురు తెలుగుదేశం నేతల పై ఆరోపణలు చెయ్యటం, నిజం అని నమ్మించటం, సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో పదే పదే ఈ హత్య తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు చేసినట్టు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించారు...

vij murder 16122017 3

ఈ హత్య కేసుకు సంబధించి విజయవాడ పోలీసు కమీషనర్ గౌతం సవాంగ్ ఘాటుగా స్పందిచారు... విజయవాడ నగరం మొత్తం నిఘాలో ఉంది. మాస్క్‌లు వేసుకున్నా, హెల్మెట్లు పెట్టుకున్నా వెంటనే దొరికిపోతారు. ఒక మనిషి అన్ని కోణాలనూ ఈ కెమెరాలు చూపిస్తాయి. ప్రోగ్రాంకి ఒక్క టాగ్‌ ఇస్తే నేరగాళ్లు ఎక్కడున్నారో తెలిసిపోతుంది అని కమీషనర్ అన్నారు... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేదించామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, నేరాలు కూడా జగకుండా చూస్తాం అని, మరిన్న పవర్ఫుల్ టెక్నాలజీ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి అని, జాగ్రత్తగా ఉండాలి అని, హెచ్చరించారు...

ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణా మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని పిలవకుండా ఎలా అవమాన పరిచిందో అందరూ చూస్తూనే ఉన్నారు... ఎంత మంది అది తప్పు అని చెప్పినా, కెసిఆర్ మాత్రం చంద్రబాబుని పిలవలేదు... ఆంధ్రప్రదేశ్ లో స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ, పార్టీలకు అతీతతంగా, దీన్ని ఖండించారు.. ఇది ప్రతి ఆంధ్రుడికి జరిగిన అవమానంగా భావించారు... ఇలా ప్రతి ఆంధ్రుడు అవమానంగా భావిస్తూ ఉండగానే, తెలంగాణా ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన, గరికపాటి నరసింహారావు గారిని ప్రవచనాలు చెప్పటానికి ఆహ్వానించింది... అయితే, ఆయన ప్రతి ఆంధ్రుడిలో ఉన్న భాదను వెళ్లగక్కారు... తెలంగాణా ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించారు...

garikapati 16122017 2

తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని నన్ను పిలిచారు బాగానే ఉంది, కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం ఆహ్వానించని తెలుగు మహాసభలకు, ఆంధ్ర కు చెందిన వాడిగా నేను వెళ్లడం భావ్యం కాదని ఆ ఆహ్వానాన్ని సవినయంగా తిరస్కరిస్తున్నాను అని, తెలంగాణా ప్రభుత్వానికి చెప్పి, నిఖార్సైన ఆంధ్రోడు అనిపించుకున్నారు గరికపాటి నరసింహారావు గారు... గరికపాటి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఆంధ్రుడు ఆయన్ని అభినందిస్తున్నారు...

garikapati 16122017 3

కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పగానే, సరిహద్దులకు అతీతంగా తెలుగువారందరూ పాల్గొనేలా చేసి రాష్ట్రాలుగా విడిపోయినా.. జాతిగా, సాంస్కృతికంగా కలిసే ఉన్నాం అన్న స్పృహను కల్పిస్తారు అని అందరూ భావించారు... కాని ఇక్కడ జరిగింది వేరు... కనీసం పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవకుండా, తెలుగు తల్లి పాట పాడకుండా, తెలుగు తల్లి విగ్రహం పెట్టకుండా, తెలుగు భాషకు సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని కనీసం గౌరవించకుండా, తీవ్ర అవమానాలు గురించేస్తూ, తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణా మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి, ఒక ఆంధ్రుడిగా గరికపాటి నరసింహారావు గారు చేసిన పనికి, మేము పడుతున్న ఆవేదనకు శభాష్ అనకుండా ఉండలేము... ఇప్పుడు మాకు తెలుగు మహా సభలు సమావేశాలు అవసరం కన్నా, తెలుగు తల్లి ఆత్మ గౌరవం ముఖ్యం... మీకు పాదాభివందనం చేస్తున్నాం గరికపాటి నరసింహారావు గారు...

Advertisements

Latest Articles

Most Read