వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రోజు రోజుకి అసహనం పెరిగిపోతుంది... జగన్ పాదయత్రతో తమ జీవితాలు బాగుపడతాయని, ఎమ్మల్యేలు, మంత్రులు అయిపోవచ్చు అని కలలు కన్నారు... తీరా చూస్తే జగన్ పాదయత్ర చేస్తున్నట్టు, సాక్షి టీవీ చూస్తే తప్ప తెలియని పరిస్థితి... దీంతో, ఈ నాయకులకి పిచ్చి ఎక్కి, మదమెక్కిన వాగుడు వాగుతూ, ఎవర్ని, ఏమి అంటున్నారో కూడా తెలీకుండా ప్రవర్తిస్తున్నారు... ఒక పక్క జగనే స్వయంగా రెచ్చిపోతూ కాల్చేస్తే, ఉరి వేస్తా అంటుంటే, రోజా, కొడాలి నాని లాంటి వారు ఏకంగా బూతులు మాట్లాడుతూ, రెచ్చిపోతున్నారు... ఇప్పుడు అంబటి రాంబాబు వంతు..
ఈయనకి కోడెల శివప్రసాదరావు ప్రత్యర్ధి... కాని ఆయన సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్... పైగా ఇప్పుడు శాసనసభ కూడా జరుగుతుంది... ఈ సమయంలో అంబటి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో నంబర్ వన్ క్రిమినల్ ఎవరైనా ఉంటే అది, స్పీకర్ కోడెల అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు... కోడెలపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో ప్రజలకు తెలుసునని, చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్నుపోటుతో వాటిని ఎత్తి వేశారని అంబటి రెచ్చిపోయారు... రాజకీయంగా వ్యాఖ్యలు చెయ్యటం వేరు, ఇలా సాక్షాత్తు స్పీకర్ ని, ఇంత దిగజారి మాట్లడటం, అంబటి లాంటి వారికి తగదు... నిజానికి కోడెల కాదు, ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ క్రిమినల్ ఎవరు అనేది అందరికీ తెలిసిందే...
అయితే, ఈ వ్యాఖ్యలు శాసనసభ తీవ్రంగా స్పందించింది... స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ సీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశాన్ని సభలో చీఫ్ విప్ పల్లె ప్రస్తావించనున్నారు... మిగతా ఎమ్మల్యేలు కూడా, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలా కించపరచటం దారుణం అని, ఇలాంటి వాడిని వదిలి పెడితే, ఇంకా రెచ్చిపోయి, రేపటి నుంచి బూతులు కూడా తిడతారు అని, అది శాసనసభకే అవమానం అని అంటున్నారు... స్పీకర్ ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి...