వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రోజు రోజుకి అసహనం పెరిగిపోతుంది... జగన్ పాదయత్రతో తమ జీవితాలు బాగుపడతాయని, ఎమ్మల్యేలు, మంత్రులు అయిపోవచ్చు అని కలలు కన్నారు... తీరా చూస్తే జగన్ పాదయత్ర చేస్తున్నట్టు, సాక్షి టీవీ చూస్తే తప్ప తెలియని పరిస్థితి... దీంతో, ఈ నాయకులకి పిచ్చి ఎక్కి, మదమెక్కిన వాగుడు వాగుతూ, ఎవర్ని, ఏమి అంటున్నారో కూడా తెలీకుండా ప్రవర్తిస్తున్నారు... ఒక పక్క జగనే స్వయంగా రెచ్చిపోతూ కాల్చేస్తే, ఉరి వేస్తా అంటుంటే, రోజా, కొడాలి నాని లాంటి వారు ఏకంగా బూతులు మాట్లాడుతూ, రెచ్చిపోతున్నారు... ఇప్పుడు అంబటి రాంబాబు వంతు..

ambati 2112017 2

ఈయనకి కోడెల శివప్రసాదరావు ప్రత్యర్ధి... కాని ఆయన సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్... పైగా ఇప్పుడు శాసనసభ కూడా జరుగుతుంది... ఈ సమయంలో అంబటి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో నంబర్‌ వన్‌ క్రిమినల్‌ ఎవరైనా ఉంటే అది, స్పీకర్‌ కోడెల అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు... కోడెలపై ఎన్ని క్రిమినల్‌ కేసులు ఉన్నాయో ప్రజలకు తెలుసునని, చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్నుపోటుతో వాటిని ఎత్తి వేశారని అంబటి రెచ్చిపోయారు... రాజకీయంగా వ్యాఖ్యలు చెయ్యటం వేరు, ఇలా సాక్షాత్తు స్పీకర్ ని, ఇంత దిగజారి మాట్లడటం, అంబటి లాంటి వారికి తగదు... నిజానికి కోడెల కాదు, ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ క్రిమినల్ ఎవరు అనేది అందరికీ తెలిసిందే...

ambati 2112017 3

అయితే, ఈ వ్యాఖ్యలు శాసనసభ తీవ్రంగా స్పందించింది... స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌ సీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు ప్రివిలేజ్‌ నోటీస్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశాన్ని సభలో చీఫ్‌ విప్‌ పల్లె ప్రస్తావించనున్నారు... మిగతా ఎమ్మల్యేలు కూడా, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలా కించపరచటం దారుణం అని, ఇలాంటి వాడిని వదిలి పెడితే, ఇంకా రెచ్చిపోయి, రేపటి నుంచి బూతులు కూడా తిడతారు అని, అది శాసనసభకే అవమానం అని అంటున్నారు... స్పీకర్ ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కర్నూలు జిల్లా పాదయాత్రలో మరోసారి పోలీసుల మీద చిందులు వేశారు... ఈ సారి ఏకంగా పోలీసు బాసులకు హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఉండదు, మరో సంవత్సరంలో నేనొస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం పని చెయ్యండి, ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పోలీస్ బాసులకు కూడా నేను అదే విషయం చెబుతున్నానని, ఎల్లప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం ఉండదన్నారు... త్వరలో నేను వస్తా... ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

jagan 21112017 2

నిజానికి జగన్ పాదయత్ర షడ్యుల్ ప్రకారం జరగాలి, ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలి... ఇది జగనే స్వయంగా పోలీసులకు పాదయత్ర ముందు పోలీసులకి రాసింది... జగన్ కు z క్యాటగిరీ బద్రత ఉంది అని, పోలీసులు తగు ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పారు... ఇప్పుడు జగన్ మాత్రం, అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ సభలు పెడుతున్నారు... ఇదే విషయం నిన్న పోలీసులు లేవనెత్తారు..అనుమతి లేకుండా హుసేనాపురంలో సమావేశం నిర్వహించవద్దు అని చెప్పినా వినలేదు... దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.... మేము రూల్ ప్రకారం పని చేస్తున్నామని, ఇలా చెయ్యకపోతే ఏదన్నా జరిగితే మమ్మల్నే నిందిస్తారని, ఇప్పుడేమో మాకే వార్నింగ్ లు ఇస్తున్నారని పోలీసులు బాధపడుతున్నారు...

jagan 211120173

నిజానికి జగన్, ఇలా ప్రవర్తించటం మొదటి సారి కాదు... వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ అంటూ అక్కడ పోలీసుల మీద రంకెలు వేసింది చూశాం... అలాగే దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు ఉన్న, కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ అహ్మద్ బాబుని, నిన్ను జైలుకి తీసుకుపోతా అన్నది చూశాం... ప్రభుత్వ డాక్టర్ ల దగ్గర బలవతంగా, చేతిలో రిపోర్ట్ లు లాక్కుంది చూశాం.. ఇది జగన్ విపరీత ప్రవర్తనకు అర్ధం పడుతుంది... తనకు తానూగా, అతీత శక్తి అనుకుంటూ, ముఖ్యమంత్రి అయిపోయాను అనుకునే భ్రమలో, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కర్నూల్ జిల్లలో కొనసాగుతుంది... అయితే ఈ ఈవెంట్ లో, చేస్తున్న స్కిట్ లు అన్నీ రివర్స్ అవుతున్నాయి... ప్రతి రోజు పాదయత్ర ప్రారంభానికి ముందు, స్థానికులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలు వినటం అనేది కాన్సెప్ట్... కాన్సెప్ట్ లో ప్రజల సమస్యలు కంటే, చంద్రబాబుని తిట్టటం అనేది ఇంపార్టెంట్ అని పీకే బ్యాచ్ స్క్రిప్ట్ లోని మెయిన్ పాయింట్... కాని, ఈ పైడ్ బ్యాచ్ లు చేసే స్కిట్ లు అన్నీ రివర్స్ అయ్యి, చివరకు సెల్ఫ్ గోల్ అవుతున్నాయి... మొన్నా మధ్య, ఒక 15 ఏళ్ళ పాప చేత వ్యవసాయం గురించి మాట్లాడిస్తూ, పొలాలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఏట్లో ఉన్నాయని అని సమాధానం చెప్పి దొరికిపోయిన విషయం తెలిసిందే...

ycp 20112017 2

అయితే ఇవాళ కూడా, సరైన ట్రైనింగ్ ఇవ్వలేదో, లేక జగన్ స్క్రిప్ట్ లో లేని ప్రశ్నలు అడిగారో కాని, ఈ సారి ఒక ముసలమ్మ ఆక్టింగ్ చెయ్యలేక దొరికిపోయింది... దీంతో స్కిట్ అట్టర్ ఫ్లోప్ అయ్యింది.... జగన్ తో ముఖాముఖిలో, ఒక ముసలమ్మ మాట్లాడుతూ, వికలాంగుల పెన్షన్ రావట్లేదు అని చెప్పెంది... రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 200 వచ్చేది అని, ఇప్పుడు పెన్షన్ ఎత్తేసారని చెప్పెంది... అయితే ఇక్కడ స్క్రిప్ట్ లో తప్పు ఏంటి అంటే, అప్పుడు వికలాంగుల పెన్షన్ 500 ఉంది... ఈ పాయింట్ పీకే బ్యాచ్ మిస్ అయ్యింది... అదే సందర్భంలో జగన్, నువ్వు పొదుపు సంఘంలో ఉన్నావా అంటే, ఆ అవ్వ ఉన్నాను అంది... తరువాత జగన్ అడిగిన ప్రశ్నతో అవ్వ షాక్ అయ్యింది...

ycp 20112017 3

ఎంత అప్పు తీసుకున్నావ్ అని జగన్ అడిగితే, అవ్వ చెప్పలేక ఖంగారు పడింది... అవుట్ అఫ్ సిలబస్ ప్రశ్న కదా... నాకు తెలీదు ఎంత అప్పో, వీరే వారు తీసుకున్నారు అంది... జగన్ తేరుకుని, నువ్వు పొదుపు సంఘం గ్రూప్ లో ఉన్నావా అంటే, ఉన్నాను అంది... మళ్ళీ జగన్, ఎంత అప్పు తీసుకుంది గ్రూప్ అంతా అంటే, మళ్ళీ అదే తడబాటు... పాపం ఆ అవ్వకు, చెప్పిన ప్రశ్నలు కాకుండా, జగన్ వేరే ప్రశ్నలు అడగటంతో, నాకు అవన్నీ తెలవవు అంది అవ్వ... జగన్ మాత్రం ఫ్లో ఆపలేదు... నాకు తెలీవు అంటున్నా, వడ్డీ బ్యాంకులు కట్టమంటున్నారు కదా అంటే, ఏమో సార్ అవన్నీ నాకు తెలీదు అంటే, పక్క నుంచి ఎవరో ఆ అవ్వకు అందించారు.. అప్పుడు, అవును సార్ కట్టమంటున్నారు అంది అవ్వ... వడ్డీ కట్టమంటారు, మాఫీ చెయ్యలేదు, నీ డబ్బులు ఇలా చేసారు కదా అని జగన్ మళ్ళీ అంటే, నాకు డబ్బులు ఇవ్వలేదు సార్, వేరే వాళ్లకి ఇచ్చాను అంది అవ్వ... కాని, జగన్ ఫ్లో మళ్ళీ మొదలు పెట్టి, ప్రభుత్వాన్ని తిట్టి, సిక్ట్ ముగించాడు.... పాపం, ఆ అవ్వకు పెర్ఫార్మన్స్ సరిగ్గా చేయ్యినందుకు పారితోషికం ఇస్తారో లేదో... ఇది ప్రజా సమస్యలు తెలుసుకునే పాదయాత్ర తీరు... ఈ పైడ్ ఆర్టిస్ట్ లతో, ఇంకో ఆరు నెలలు ఈ ఎంటర్టైన్మెంట్ తో అలరించనున్నారు, మన ప్రతిపక్ష నేత....

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పనులను ఈ వారంలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో కొంత భాగం కాంక్రీట్ పనులు, తవ్వకం పనులకు సంబంధించి కొత్త టెండర్లను పిలవడంతో పాటు డిసెంబర్ 15 కల్లా నిర్మాణ సంస్థలను ఖరారు చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణ సంస్థ అయిన ట్రాన్స్‌ట్రాయ్‌కు తాము వ్యతిరేకం కాదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తికావాలన్నదే అసలు ఉద్దేశమని ముఖ్యమంత్రి అన్నారు.

polavaram 20112017 2

ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించామని చెప్పారు. పోలవరం నుంచి గోదావరి నీటిని తమిళనాడుకు సైతం తీసుకువెళ్లాలని యోచిస్తున్న కేంద్రం దీనిపై అధ్యయనం జరపాల్సిందిగా మన రాష్ట్రాన్ని కోరిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గడిచిన వారం రోజుల్లో 26 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం పూర్తయ్యిందని, 10,891 క్యూబిక్ మీటర్ల మేర స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్‌ కాంక్రీట్ పనులు చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 4 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తికాగా, మరో 14.52 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుందని తెలిపారు. 384 ఆర్మ్ గిర్డర్ల ఫ్యాబ్రికేషన్ పూర్తి చేశామని, 20 హారిజంటల్ గిర్డర్లు సిద్ధమయ్యాయని వివరించారు.

polavaram 20112017 3

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మొత్తం 28 ప్రాధాన్య ప్రాజెక్టులలో మరో తొమ్మిది పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఎర్రకాలువ ఆధునీకరణ, పోగొండ రిజర్వాయరు, పెదపాలెం ఎత్తిపోతల పథకం, చినసాన ఎత్తిపోతల పథకం, మారాల రిజర్వాయరు, చెర్లోపల్లి రిజర్వాయరు, అవుకు టన్నెల్‌, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా సుమారు 7 వేల చెక్‌డ్యాంలు నిర్మించాల్సిన అవసరం వుందని లెక్క తేల్చిన అధికారులు ఇప్పటివరకు 3,020 చెక్‌డ్యాంలు నిర్మించగా, మరో 3,271 చెక్‌డ్యాంలు నిర్మాణంలో వున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

Advertisements

Latest Articles

Most Read