ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016కు గాను ప్రకటించిన నంది అవార్డులుకు పెద్ద ఎత్తున రాజకీయ, కుల విమర్శలు వస్తున్నాయి.... 2015, 2016 సంవత్సరానికి ఏ గోలా చెయ్యని బినామీ గాళ్ళు, కుల కుంపట్లో డొల్లే వారు, పేరు కోసం వెంపర్లాడి క్రిటిక్ అనే పేరుతో గోల చేసే వారు, బూతు సినిమాలు తీసే c గ్రేడ్ డైరెక్టర్ లు, హైదరాబాద్ లో కులికే మీడియా బినామీ మీడియా చానల్స్ కేవలం 2014 సంవత్సరానికి ప్రకటించిన నందుల మీదే గోల చేస్తున్నారు... ఎందుకంటే 2014 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు అవార్డు వచ్చింది అని... బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వాడు అని, బాలకృష్ణ చంద్రబాబు బావ మరిది అని, అన్నిటికి అంటే, బాలకృష్ణ పలానా సామజికవర్గం వాడు అని... అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వం ఏ పని చేసినా, విమర్శలు చెయ్యాలి, ఇష్యూ చెయ్యాలి అనే సైకో గ్యాంగ్ ఉంది మన దగ్గర... "మనం" అనే సినిమా కచ్చితంగా మంచి సినిమా.. దాంట్లో సందేహమే లేదు... కాని, అవార్డు ఇచ్చేప్పుడు ఇంకా ఎన్నో చూస్తారు... చివరకు ఎదో ఒకటి ఫైనల్ అవుతుంది... అందుకే మనం సెకండ్ బెస్ట్ ఫిలిం అయ్యింది... జ్యూరీ అది నిర్ణయించింది... దీంట్లో చంద్రబాబుకి ఏమి సంబంధం ? బాలయ్య కు ఏమి సంబంధం ? సామాజిక వర్గానిది ఏమి సంబంధం ?
తమకు అధికారం రాకుండా అడ్డుగా నిల్చున్నాడని పవన్ కళ్యాణ్‌ని, అతని వ్యక్తిగత జీవితాన్ని, అభిమానుల్నీ, మెగాఫ్యామిలీని పొద్దునలేస్తే అమ్మబూతులు తిడుతూ, ఎన్నికల సమయంలో తిరుపతిలో హోటల్లో తనిఖీల పేరుతో చిరంజీవి ఇంటి మహిళలని, కుటుంబాన్ని అవమానపరచి, ఆయన చిన్నకూతురి వివాహాన్ని రచ్చచేసి బజారుకీడ్చి, 2014 లో తెదేపాకి ఓట్లు వేశారని కాపు సామాజికవర్గాన్ని అసహ్యంగా రోజూ తిట్టే వైఎస్సార్ అభిమాన జగన్ భక్త వైసీపీ బృందం ... ఇవాళ అవార్డుల విషయంలో మెగాఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మొసలికన్నీళ్ళు కార్చడం ఏంటి ? ప్రజలు ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా ?
1983 నుంచి ఇప్పుడు వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఏళ్ళు అధికారంలో ఉంది ? బాలయ్య బాబుకి ఎన్ని నంది అవార్డులు వచ్చాయి ? అందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా బాలయ్యకు నంది అవార్డు ఎందుకు వచ్చింది ? చంద్రబాబుకి పక్షపాతం ఉంటే, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా చిరంజీవికి నంది అవార్డు ఎందుకు ఇచ్చేవారు ? తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకొనే ఆదిత్య 369 (1991 ) , భైరవ ద్వీపం ( 1994 ), తెలుగు సినిమా గతిని మార్చిన "సమర సింహ రెడ్డి" లాంటి సినిమాలకు అప్పుడు బాలయ్యకు నంది అవార్డు ఇవ్వకపోతే, ఇలాగే గోల చేసారా ? ఎన్టీఆర్ కొడుకుగా, చంద్రబాబు బావమిరిదిగా బాలకృష్ణ ఏనాడు అన్నా సెక్రటేరియట్ కు వెళ్ళే వాడా ? అలాంటి వాడి మీద ఇన్ని కుట్రలు చేస్తూ, నిందలు వెయ్యాలా ? దీంట్లో కుల ప్రస్తావన ఎందుకు.... నంది అవార్డు వచ్చిన వీరందరూ కమ్మ సామజిక వర్గం వారా ? "కమల్‌హసన్, రజనీకాంత్, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌లాల్, జయసుధ, బ్రహ్మానందం, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, అల్లు అర్జున్, మిక్కీ మేయర్, అనూప్ రూబెన్స్, వందేమాతరం శ్రీనివాస్, ఆర్.నారాయణమూర్తి, పిసీ రెడ్డి, బుర్రా సాయి మాధవ్, అవసరాల శ్రీనివాస్, చిత్ర, విజయ్ ఏసుదాసు, సమీర్ రెడ్డి, రమ్యకృష్ణ, అంజలి, అనుష్క, సతీశ్ వేగేశ్న, రీతూవర్మ, ఆది పినిశెట్టి, ప్రేమ్ రక్షిత్, సాబూ శిరిల్, రామ్-లక్ష్మణ్, రవిశంకర్, చిన్మయి, పులగం నారాయణ, ఏలేటి చంద్రశేఖర్, పీటర్ హెయిన్స్ "
బాలయ్య నంది అవార్డ్స్ జ్యూరీ కమిటీ లో బాలయ్య లేడు. ఆయన రఘుపతి వెంకయ్య అవార్డ్స్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్. బీజేపీ మాజీ మంత్రి కృష్ణంరాజుగారికీ, కాంగ్రెస్ మాజీ మంత్రి చిరంజీవిగారికీ, తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన ఉన్న జ్యూరీ, వారిద్దరూ తెలుగు సినిమారంగానికి అందించిన సేవలను సముచితంగా గౌరవిస్తూ రఘుపతి వెంకయ్య పురస్కారాలను ప్రకటించింది. ఇప్పటివరకూ నటీనటులు, దర్శకనిర్మాతలు, గాయనీగాయకులకు మాత్రమే అందించిన ఈ పురస్కారాన్ని మొదటిసారిగా - ఈ కంప్యూటర్లు, ఫోటోషాపులు, విఎఫెక్స్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో , సజీవకళ ఉట్టిపడేలా దాదాపు 2500 సినిమాలకి పోస్టర్లు, పబ్లిసిటీ మెటీరియల్ డిజైన్స్ చేసిన ఈశ్వర్‌గారికి 2015 సంవత్సరానికి ప్రకటించారు. ఈ అవార్డుల్లో కూడా రాజకీయం ఉందా ? వీళ్ళు కమ్మ సామాజిక వర్గం వారా ?. నంది అవార్డు కమిటీ మెంబెర్ గా బాలయ్య లేడు... చాలా మంది సినిమాల్లో వివిధ విభాగాల్లో పనిచేసిన వారు ఉన్నారు. అవేం తెలియని (పట్టని) ఎదవలు మైక్ వుంది కదా అని మాట్లాడటం, కీబోర్డ్ వుంది కదా అని విషపు రాతలు రాసేయడం. ఇప్పుడు అవార్డ్స్ గురించి చులకన గా మాట్లాడే మీరు , మీ హీరోలకి వచ్చిన అన్ని అవార్డ్స్ కూడా పైరవీలు చేసే తెచ్చుకున్నారా ? మనకి అవార్డు వస్తే మా హీరో వలన పక్క వాళ్ళకి వస్తే పైరవీ అంటారా ? తోటి హీరోలని గౌరవించడం నేర్చుకోండి.... లెజెండ్ సినిమాకు #SIIMA and #SICA అవార్డ్స్ కుడా వచ్చాయి, మరి అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ? చంద్రబాబు అంటే వీళ్ళకు అంత చేతగాని వాడిలా కనిపిస్తున్నారా ? రేపు ఇవే అవార్డ్స్ తెలంగాణా ఇస్తుంది, అప్పుడు ఎంత మంది నోర్లు లేగుస్తాయో చూద్దాం...