ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. పార్టీ చరిత్రలోనే ఈసారి జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి అనూహ్యా స్పందన వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
75రోజులు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినప్పటికీ క్షేత్ర స్థాయిలో వెసులబాటును బట్టి మరో 15 రోజులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని పొడిగించుకునేందుకు పార్టీ అనుమతి నిచ్చింది. ప్రజల నుంచే కాకుండా పార్నీకేడర్ నుంచి, కార్యకర్తల నుంచి ముందెన్నడు లేనంతగా స్పందన వస్తుండమే విజయోత్సవ సభ నిర్వహించాలని సంకల్పించడానికి ప్రధాన కారణం. మొత్తం 72 లక్షల సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర పార్టీ జియో ట్యాగ్ చేయడం జరిగింది. మొత్తం కోటి 80లక్షల ఇళ్ళను నేరుగా సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆర్ధిక, ఆర్థికేతర సమస్యల పై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం శరవేగంగా క్రోడీకరణ చేస్తోంది.
29లక్షల ఫిర్యాదులు అందడం కూడా ఒక రికార్డుగా భావిస్తున్నారు. ప్రతి 20 రోజులకోకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం పై సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం క్షేత్ర స్థాయి కేడర్ తో టచ్లో ఉంటున్నారు. ఎక్కడైనా లోటుపాటు జరిగిన పక్షంలో సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దాదాప అన్ని నియోజకవరా లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండగా ఓటర్లను కలుసుకునేందుకు స్థానిక నేతలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాలు, లబ్ది పొందుతున్న వైనం పై లోతుగా ఆరా తీస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు అప్పటికప్పుడు అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవటానికి ఉపయోగపడింది... ప్రతిపక్షం చెయ్యాల్సిన పని, అధికార పక్షం చేస్తుంది అని, ప్రజలు కూడా సంతోషపడుతున్నారు...