ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. పార్టీ చరిత్రలోనే ఈసారి జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి అనూహ్యా స్పందన వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

intiintiki tdp 31102017 2

75రోజులు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినప్పటికీ క్షేత్ర స్థాయిలో వెసులబాటును బట్టి మరో 15 రోజులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని పొడిగించుకునేందుకు పార్టీ అనుమతి నిచ్చింది. ప్రజల నుంచే కాకుండా పార్నీకేడర్ నుంచి, కార్యకర్తల నుంచి ముందెన్నడు లేనంతగా స్పందన వస్తుండమే విజయోత్సవ సభ నిర్వహించాలని సంకల్పించడానికి ప్రధాన కారణం. మొత్తం 72 లక్షల సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర పార్టీ జియో ట్యాగ్ చేయడం జరిగింది. మొత్తం కోటి 80లక్షల ఇళ్ళను నేరుగా సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆర్ధిక, ఆర్థికేతర సమస్యల పై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం శరవేగంగా క్రోడీకరణ చేస్తోంది.

intiintiki tdp 31102017 3

29లక్షల ఫిర్యాదులు అందడం కూడా ఒక రికార్డుగా భావిస్తున్నారు. ప్రతి 20 రోజులకోకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం పై సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం క్షేత్ర స్థాయి కేడర్ తో టచ్లో ఉంటున్నారు. ఎక్కడైనా లోటుపాటు జరిగిన పక్షంలో సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దాదాప అన్ని నియోజకవరా లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండగా ఓటర్లను కలుసుకునేందుకు స్థానిక నేతలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాలు, లబ్ది పొందుతున్న వైనం పై లోతుగా ఆరా తీస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు అప్పటికప్పుడు అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవటానికి ఉపయోగపడింది... ప్రతిపక్షం చెయ్యాల్సిన పని, అధికార పక్షం చేస్తుంది అని, ప్రజలు కూడా సంతోషపడుతున్నారు...

గత మూడు నెలలుగా దడదడలాడిస్తున్న ఆంధ్రా ఏసీబీకి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది... సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి కూడా మన ఆంధ్రా ఏసీబీని మెచ్చుకున్నారు... ఇప్పుడు పోలీస్ శాఖ పై ఏసీబీ దృష్టి సారించింది. సీఐడీ డీఎస్పీ ఎద్దుల హరినాధ రెడ్డి అక్రమాలతో ఖంగుతిన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, మాతృ సంస్థలోని అధికారుల అక్రమాల పై కన్నేసినట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు అవినీతిపరులైన డీఎస్పీ స్థాయి అధికారుల జాబితాను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

acb 31102017 2

మద్యం, ఇసుక, క్రికెట్ బెట్టింగ్ లు.. ఇలా ఆదాయం వచ్చేఅన్ని అక్రమాలను కొందరు డీఎస్సీ స్థాయి అధికారులు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో పోలీసు శాఖలోని డీఎస్పీ స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు విస్తృతమయ్యాయి. రాయలసీమ లోని కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పని చేసిన హరినాధ రెడ్డి రూ. కోట్లకు పడగలెత్తారు. ఏసీబీ అధికారుల దాడుల్లో రూ.50 కోట్లకు పైబడి హరినాధ రెడ్డి అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆరు మాసాల కిందట గుంటూరు జిల్లాకు చెందిన ఓ డీఎస్పీ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించినప్పడు బాధితులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

acb 31102017 3

మద్యం, ఇసుక, క్రికెట్ బెట్టింగ్ లు, ఇసుక మాఫియా, సివిల్ వివాదాల్లో కోట్లు కోట్లు సంపాదిస్తున్న అవినీతి పోలీసుల అంతు చూడాలని ఏసీబీ నిర్ణయించింది... ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మల్యేల ఒత్తిడిలు ఉంటాయి అని భావించి, దీనికి సంబంధించి ముందే ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది... ముఖ్యమంత్రి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం...

నవంబర్ 6 నుంచి ఒక పక్క పాదయాత్ర అంటూ, ఇక్కడ వైసిపి శ్రేణులు హడావిడి చేస్తూ, పనులు చేసుకుంటుంటే, 6 రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళిన జగన్, లండన్ లో, జాం జాం మంటూ ఎంజాయ్ చేస్తూ, రిలాక్స్ అవుతూ, టైం స్పెండ్ చేస్తున్నారు... నెల రోజుల క్రితం తన కుమార్తెను లండన్ లో, పై చదువులు కోసం చేర్పించి వచ్చిన సంగతి తెలసిందే.. పాదయాత్ర మొదలైతే 6 నెలల వరకు మళ్ళీ వెళ్ళటం కుదరదు అనే వంకతో, జగన్ కోర్ట్ పర్మిషన్ తీసుకుని లండన్ వెళ్లారు...

jagan uk 31102017 2

ఈ నెల 28 నుంచి, ఆరు రోజుల పాటు లండన్ లో పర్యటించి, తిరిగి వచ్చి పాదయాత్రలో పాల్గుననున్నారు... లండన్ వెళ్ళిన జగన్, అక్కడ ఉన్న ఫోటోలు ఇప్పుడు బయటకి వచ్చాయి... మన ముందు చారల చొక్కా ఎక్కువగా వేసుకునే జగన్, అక్కడ రంగు రంగుల బట్టలు, గ్లాస్సెస్ పెట్టుకుని, లండన్ వీధిల్లో తిరుగుతూ, అక్కడా అన్నీ చూస్తున్నారు.... జగన్ పెట్టుకున్న కళ్ళజోడు బాగుంది అంటూ, సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తున్నారు... పాదయాత్రలో కూడా వాడతారా అని, అంటున్నారు.... ఇదే గెట్ అప్ తో, పాదయాత్ర చేస్తారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి... అయితే, తాను ముఖ్యమంత్రి అయితే, మన రాష్ట్రాన్ని కూడా లండన్ లా తయారు చేస్తాను అని, అక్కడ తనను కలిసిన పార్టీ వాళ్ళతో జగన్ చెప్పారు...

jagan uk 31102017 3

అంతే కాదు పాదయాత్రకు సంబంధించి షాపింగ్ అంతా లండన్ లోనే చేస్తున్నారు... షూస్ దగ్గర నుంచి, నీ క్యాప్, పైన కిల్లర్స్ ఇలా అన్నీ అక్కడే కొన్నారు... ఇక్కడ ప్రాక్టీస్ చేసే టైం లేకపోవటంతో, అక్కడే నడక నడవటం, ఆహారపు అలవాట్లు, త్రెడ్ మిల్ మీద నడవటం ప్రాక్టీస్ చేస్తున్నారు.. మన దేశంలో ఫిజికల్ ట్రైనర్స్ అంటే ఇష్టపడని జగన్, లండన్ లోని ఫిజికల్ ట్రైనర్స్ దగ్గర, పాదయత్ర కోసం మెలుకువులు నేర్చుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి...

కడుపు నొప్పి, కాలునొప్పి, జ్వరం... ఇలా చిన్నా చితకా సమస్యలతో మందుల షాపల దగ్గరకు నిత్యం ఎందరో వస్తుంటారు. అక్కడ కౌంటర్లో ఉన్నవారు తమకు తెలిసిన మందులు ఇవ్వడంతో పాటు అది ఎంత డోస్, ఎన్ని రోజులు వాడాలో కూడా చెప్పేస్తుంటారు. ఇలా సొంత వైద్యం చేసుకోవడం ద్వారా ఎన్నో దుష్ఫలితాలు వస్తాయని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా పట్టించుకొనేవారే లేరు. డాక్టర్ దగ్గరకు వెళ్లే ఫీజ్ ఇవ్వాల్సివస్తుందని, చిన్న సమస్యలకు కూడా అంతంత ఇవ్వడం ఎందుకని భావించే వారే ఎక్కువ.

medicines 31102017 2

అయితే దీనివల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యదేచ్చగా మందులు అమ్మే విధానానికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం కాంప్రహెన్సివ్ డ్రగ్ మానిటరింగ్ సిస్టమ్ (సీడీఎంఎస్) అనే నూతన విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో రిజిస్టరయిన వైద్యులందరూ ఈ విధానంలోనే రోగులకు మందులను సూచించాల్సి ఉంటుంది. దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ ప్రిస్క్రిపన్ను రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయబోతున్నారు.

medicines 31102017 3

ఇది ఎలా పని చేస్తుంది అంటే... ఇష్టానుసారంగా మందులు ఇవ్వటం నివారించేందుకు రూ.1.2కోట్లు వెచ్చించి సీడీఎంఎస్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ సాఫ్ట్ వేర్ కు 64వేల మంది వైద్యులు, దాదాపుగా అంతే సంఖ్యలో ఉన్న కెమిస్ట్లు అనుసందానం అవుతారు. వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగిని పరీక్షించిన తరువాత సీడీఎంఎస్ యాప్ ఆన్ చేస్తారు. సూచించిన మందుల వివరాలకు సంబంధించి యాప్లో కంపెనీల పేరు వస్తాయి. వాటి నుంచి ఏ కంపెనీ బ్రాండ్ మందు కావాలో ఎంపిక చేసుకుంటారు. వైద్యుడి డిజిటల్ సిగ్నేచర్ తో ఉన్న మందుల జాబితానే ఫార్మసీల్లో పరిగణనలోకి తీసుకుని రోగికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో రోగి మొబైల్ ఫోనుకు వన్టైం పాస్వర్డ్ పంపుతారు. దీని సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మందులు కొనుగోలు చేయవచ్చు. ఫోన్ సదుపాయం లేని పక్షంలో ఆదార్ నంబరుతో రోగులను కెమిస్ట్ గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నిర్వహించిన స్మార్ పల్స్ సర్వే డేటాబేస్ కు సీడీఎంఎస్ అనుసంధానం చేస్తారు. ఇప్ప టికే 4.8 కోట్ల మంది వివరాలు మొబైల్ నంబర్లతో సహా ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read