‘నన్ను కొంతమంది అడిగారు. మేము పెట్టుబడులు పెట్టాక రాజకీయ సమీకరణాలు మారితే మా పరిస్థితి ఏమిటి? అని’. ‘నేనొకటే చెప్తున్నాను. మీకా భయం లేదు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి ఉత్పన్నం కాదు. మేం దీర్ఘకాల వ్యూహాలతో పని చేస్తున్నాం. ఎనభై శాతం ప్రజా సంతృప్తి లక్ష్యంగా పాలన అందిస్తున్నాం. మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం, అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామని’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అబుదాబీలో ఐబిపిజి (IBPG), ఐసిఏఐ (ICAI)ల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత ఎన్నికలలో 1.6 % మెజారిటీతో గెలిచామని, ఇటీవల నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 16% అధికంగా వచ్చాయని, 57 % ఓట్స్ షేర్ సాధించామని, ఈ శాతాన్ని 80%కు తీసుకువస్తామని చెప్పారు. ప్రజల్లో 80% సంతృప్తి తీసుకొస్తున్నాం, రాజకీయ సుస్థిరతకు ఢోకా లేదు.
ఆ నమ్మకం తమకు ఉందని, ఇన్వెస్టర్లు నమ్మకంతో రావాలని, సుస్థిర ప్రభుత్వం ఉంటుందని, మళ్లీ తాము అధికారంలోకి రావటం తధ్యమని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘మీ పెట్టుబడులకు నాదీ భరోసా’ అని సభికుల కరతాళ ధ్వనుల మధ్య చంద్రబాబు స్పష్టం చేశారు.విద్యుత్ రంగంలో 22 మిలియన్ యూనిట్ల లోటుతో ప్రారంభం అయ్యామని, కేవలం 2 నెలల్లో మిగులు విద్యుత్ సాధించినట్లు చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో రెండవతరం సంస్కరణలకు వెళుతూ, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ రంగంలో తాము దేశానికే ఆదర్శంగా నిలిచామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీలో అపార అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ‘మీరందరూ వాటిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నా.నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంది. అమరావతిని కేవలం పాలనా నగరంగానే కాక నాలెడ్జ్,ఆర్థిక నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే ప్రఖ్యాత విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు అమరావతికి వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. పదహారు మెడికల్ కాలేజీలు వచ్చాయి. మరే సిటీకి ఇటువంటి సదుపాయాలు లేవని, అర్బన్ ట్రాన్సపోర్టేషన్ శ్రద్ద పెట్టినట్లు, అరగంటలో ఎక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, ఎలక్ట్రికల్ రవాణా వ్యవస్థ నెలకొల్పుతున్నట్లు చంద్రబాబు వివరించారు.
రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నాం. 1500 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 డాలర్ల కంటే తక్కువకే ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తున్నట్లు ప్రతి ఇల్లూ ఒక నాలెడ్జ్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రూ 5,000 కోట్ల వ్యయం కాగల ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ తన వినూత్న ఆలోచన వల్ల రూ 320 కోట్లకు తగ్గించగలిగినట్లు సీఎం చెప్పినప్పుడు సభికులు కరతాళ ధ్వనులు చేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరితో విడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతానని చెప్పారు. ‘ థింక్ అబౌట్ ఇండియా. భారత్ కు గొప్ప భవిష్యత్తు ఉంది. పెట్టుబడి పెట్టే వారికి ఆహ్వానం. ఇండియా రండి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి. ‘మనీ ఈజ్ నాట్ ఇస్యూ‘, మేకిన్ ఇంధ్రప్రదేశ్.. ‘మీకే సందేహాలున్నా వదిలేయండి,ఆంద్రప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉంది. ఆంద్రప్రదేశ్ మీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం’ అని చంద్రబాబు అన్నారు.