నవ్యాంధ్ర ఆర్ధిక రాజధానిగా పేరు పొందిన, విశాఖ, ఐటి రంగంలో పెట్టుబడులని ఆకర్షిస్తుంది... ఐటి కంపెనీలను ఆకర్షించటానికి ప్రభుత్వం రుషికొండ దగ్గర, మిలీనియం టవర్ నిర్మాణం చేపట్టింది.. మిలీనియం టవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..

సన్ రైజ్ స్టార్ట్ అప్ విలేజ్ పక్కనే నాలుగు ఎకరాల్లో, 180 కోట్లతో, 7 అంతస్థుల్లో దీనిని నిర్మిస్తున్నారు. దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్పేస్, ఐటి కంపెనీలకు అందుబాటులోకి వస్తుంది.

ఇంటర్నట్ అఫ్ థింగ్స్ ను ఉపయోగించుకుని, హుద్ హుద్ లాంటి తుఫానులు వచ్చినా, దెబ్బ తినకుండా, ఈ టవర్ నిర్మాణం జరుగుతుంది.. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి, ఈ టవర్ అందుబాటులోకి రానుంది...

విశాఖపట్నం, అది మన నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని... మహా నగరం విశాఖ హుద్‌హుద్‌ తుపాన్‌ దెబ్బకు కుదేలైపోయింది. ఎదుగుతున్న సుందర నగర భవిత ఇక ఇప్పుడు అంధకారమే అనుకున్నారు అందరూ... కాని అక్కడ ఉన్నది చంద్రబాబు... అంత విద్వంసం సృష్టించిన ప్రచండమైన తుఫాను సైతం ఆశ్చర్యపోయే విధంగా, కేవలం 10 రోజుల్లో అంతా నార్మల్ అయిపొయింది... ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం మొత్తం, ఆ పది రోజుల పాటు, వైజాగ్ లోనే ఉండి, నష్ట నివారణ చర్యలు చేపట్టారు... సర్వం కోల్పోయిన ప్రజలకు భరోసా ఇచ్చారు...

కట్ చేస్తే... ఈ మూడు ఏళ్ళలో వైజాగ్, పడింది, లేచింది, నిలబడింది, ప్రకృతి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు పరిగెడుతుంది... స్వచ్ఛ భారత్ పథకం కింద అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ 2017 ర్యాంకులలో, దేశంలోనే ముడువ సుందర నగరంగా ర్యాంకు సాధించింది.... ఇది ఆంధ్రావాడి దమ్ము అంటే...

తుఫానుకి అతలాకుతలం అయిన విశాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏకంగా, రెండో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపించింది.

మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎప్పటికీ, శాంతి భద్రతలతో, పూర్తి ప్రశాంతంగా ఉండాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి... ఈ క్రింద వీడియో చూడండి, ఎక్కడ నుంచి, ఎక్కడకి వచ్చామో... వైజాగ్ సిటీ ఇలాగే కలకలలాడుతూ ఉండాలి.... జై ఆంధ్రప్రదేశ్.

ఆ రోజు, చంద్రబాబు పడిన కష్టం మరోసారి, ఈ వీడియో, ఫోటోలు చూసి, గుర్తుకు తెచ్చుకుందాం...

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచనను సాకారం చేయడానికి అవసరమైన కార్యప్రణాళికను వచ్చే సమావేశానికల్లా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు 123 మంది రాజధాని ప్రాంత రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన 12వ సీఆర్‌డీఏ ప్రాధికార సమావేశంలో ఆయన ఆమోదం తెలిపారు.

‘రాజధాని గ్రామాలలో ఉన్న రైతులు అమరావతికి అసలు పౌరులు. వారి ఉన్నతికి దోహదపడే కృషిని తక్షణం చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే తొలుత వారిని సింగపూర్ పంపిస్తున్నామని చెప్పారు. సింగపూర్‌లో ఉన్న ఉత్తమ అభ్యాసాలు, అవకాశాలపై అవగాహన పెంచి వ్యాపార, వాణిజ్య రంగాల్లో వారిని ప్రావీణ్యులను చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు.

సింగపూర్ తీసుకువెళ్లేందుకు జరిపిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 123 మంది రైతులు అర్హత సాధించగా, లాటరీ తీసి అందులో వందమందిని ఎంపిక చేశామని సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. మిగిలిన ఆ 23 మంది రైతులను నిరుత్సాహ పర్చకుండా వారిని కూడా సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనతో మరో రూ. 12 లక్షల అదనపు బడ్జెట్ కేటాయింపు అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చగా, ముఖ్యమంత్రి దానికి వెంటనే ఆమోదం తెలిపారు. ‘రాజధాని గ్రామాల్లోని రైతులు కష్టజీవులు. మూడేళ్ల క్రితం వరకు వారంతా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవించారు. నా మాట విని నమ్మి విలువైన భూములను ప్రభుత్వానికి అందించారు. వారంతా సంతోషంగా ఉండేలా చూడాలి. సంతృప్తిగా జీవించాలి. వారందరినీ పారిశ్రామికవేత్తలుగా మార్చాలి. అందుకు గల అన్ని అవకాశాలనూ వారికి అందుబాటులో తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘ఫార్మర్స్ ఫస్ట్’ అనే భావనతో ఈ యాత్ర తలపెట్టామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పగా, ‘సాధికారత దిశగా రాజధాని రైతు’ చేపట్టే యాత్రగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని రైతులు వ్యవసాయం నుంచి వాణిజ్య, పారిశ్రామికరంగం వైపు మరలే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలని చెప్పారు. అమరావతి గ్రామాల్లోని 32 వేల కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా, సమున్నతంగా ఎదిగేలా నిర్ణిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఆర్‌డీఏకు సూచించారు.

‘రాజధాని అభివృద్ధికి సమాంతరంగా రాజధాని రైతుల అభివృద్ధి కూడా జరగాలి. దీనిపై రానున్న సమావేశంలో నిర్ధిష్ట ప్రతిపాదనలతో రావాలి’ అని ఆదేశించారు. రాజధాని గ్రామాల్లోని వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులపై తాజా సమాచారం తీసుకోవాలన్నారు. వారిని చిన్నచిన్న బృందాలుగా ఏర్పరచి నైపుణ్య శిక్షణ, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై సరైన అవగాహన కల్పించాలని, ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకన్జీకి ఈ బాధ్యతలు అప్పగించి తగిన ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.

చంద్రబాబు అంటే కార్పొరేట్ వరల్డ్ లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు... అప్పటి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఇవాల్టి ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ దాకా, చంద్రబాబు చేసిన పనులు చూసి, ఎంతో మంది టెక్ కంపనీల్ సీఈఓలు ఆయన్ను ప్రశంసించిన సందర్భాలు చూశాం...

రెండు రోజుల నుంచి వైజాగ్ వేదికగా జరుగతున్న అంతర్జాతీయ బ్లాక్ చైన్ టెక్నాలజీ సదస్సులో, 25 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు చంద్రబాబు తీసుకున్న చొరవను అభినందించారు...

టెక్ మహింద్రా కంపెనీ సీఈఓ గుర్నాని, తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు... "గత హయాంలో సాఫ్ట్ వేర్ ప్రగతికి బాటలు వేశారు.. నేడు బ్లాక్ చైన్ టెక్నాలజీకి దారులు చూపుతున్నాడు... డిజిటల్ ఇండియా కి అసలుసిసలు భాష్యం ఇదే...ఇదే మాలాంటి వారికి స్పూర్తి" అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించారు...

మన రాష్ట్రంలో ఉండే కొంత మంది ఇది చూసైనా బుద్ధి తెచ్చుకున్తారేమో చూద్దాం... మొహాలు చూసో... బుగ్గలు నిమిరితోనో పెట్టుబడులు రావు... దానికి కావాల్సింది వేరే ఉంది... ఎన్ని జన్మలు ఎత్తినా, చంద్రబాబు స్థాయికి చేరుకోలేము అని విషయం గ్రహించి, ప్రజల సమస్యలు మీదా ఆ నాయకులు పోరాడతారని ఆశిద్దాం...

Advertisements

Latest Articles

Most Read