హైదరాబాద్‌ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి తరలివచ్చే పరిశ్రమల కోసం, వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రెడీ అయ్యింది. మల్లవల్లిలో మొత్తం 100 ఎకరాలలో ఏపీఐఐసీ అధికారులు ఫుడ్‌పార్క్‌ కమ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పనులు చేపట్టారు. 57.45 ఎకరాలలో మెగా ఫుడ్‌పార్క్‌, 42.55 ఎకరాలలో ఇండస్ర్టియల్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు.

ఈ విజయదశమి రోజు వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లో 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యూనిట్లను ప్రారంభిస్తారు. ఈ 75 కంపెనీలు, దాదాపు 2,600 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వనున్నాయి.

అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర మొదలు పెడతా... నాడి మడమ తిప్పని వంశం అని చెప్పిన జగన్, మడం తిప్పారు... పాదయాత్ర వాయిదా పడింది... కోర్ట్ ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాల్సిందే అన్నందుకే జగన్ పాదయాత్ర వాయిదా వేసుకుని, ఆ నిభందనలు తొలగిన తరువాత పాదయాత్ర మొదలు పెడతారు అనుకున్నారు అందరూ... అందుకే వాయిదా పడింది అని వైసిపి పార్టీ ప్రచారం చేసింది...

అయితే ఇక్కడ వాస్తవం వేరే ఉంది అంటున్నారు... సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఒక జోతిష్యుడు మాటలు ఇప్పుడు జగన్ వింటున్నారని, అతను ఏమి చెప్తే జగన్ అదే చేస్తున్నారని, అతని సూచనమేరకే జగన్ పాదయాత్ర వాయిదా వేసారని అంటున్నారు...

ఈ సోషల్ మీడియా జోతిష్యుడు మాటలు ప్రకారం, అక్టోబర్ 27 జగన్ కు అస్సలు కలిసి రాదంట... ఆ రోజు కనుక జగన్ పాదయాత్ర మొదలు పెడితే, సియం కుర్చీ సంగతి తరువాత, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దొరకదు, అని సోషల్ మీడియా జోతిష్యుడు బెదిరించటంతో జగన్ వెనకడుగు వేశారంట... 27 కలిసి రాదు కాబట్టే, ఈ నెల 27న ఓపెన్ చెయ్యాల్సిన విజయవాడ ఆఫీస్ కూడా వాయిదా వేశారు అంటున్నారు....

మొత్తానికి జగన్ కు 27 గండం ఉందని, ఈ సోషల్ మీడియా జోతిష్యుడు, నల్ల బోర్డు మీద బొమ్మలు గీసి, జగన్ కు ప్రజంటేషన్ ఇచ్చి, 27న ఏది మొదలు పెట్టినా, నీ ఫ్యూచర్ ఇది అని 70 mm సినిమా చూపించాడు అంట... దీంతో జగన్ 27ను ఏ కార్యక్రమం పెట్టవద్దు అని ప్రశాంత్ కిషోర్ కి చెప్పాడు అంటున్నారు...

ఎలా అయినా 2019 ఎన్నికల్లో "నేనే సియం" అవ్వటానికి అన్ని అస్త్రాలు తీస్తున్న జగన్, పాదయత్ర అనే అస్త్రం తీసిన సంగతి తెలిసిందే... అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేసి తీరుతా అన్న జగన్ ఇప్పుడు, ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు...

ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కోర్ట్ కేసు దీనికి ప్రధాన కారణం అంటున్నారు... శుక్రువారం కోర్ట్ హాజరు నుంచి మినహియింపు ఇవ్వాలని అని జగన్ కోరగా, కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, కోర్ట్ జగన్ అభ్యర్ధనను తిరస్కరించింది..

దీంతో జగన్ ఆలోచనలో పడ్డాడు... పాదయాత్ర మొదలుపెట్టి, ప్రతి గురువారం సాయంత్రానికి ఆపేసి, శుక్రువారం కోర్ట్ కి వెళ్లి, మళ్ళీ శనివారమో, ఆదివారమో మళ్ళీ హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి వస్తే, అది అసలకే మోసం వస్తుంది అని, ప్రజల్లో చులకన అవుతామని, తెలుగుదేశం చెడుగుడు ఆడుకుంటుంది అని, జగన్ ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు... కోర్ట్ లో మరో సారి, శుక్రువారం నుంచి మినహాయింపు ఇవ్వాలని అడగి, అప్పుడు పాదయాత్ర గురించి నిర్ణయం తీసుకోనున్నారు... అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు... పాదయాత్ర వాయిదా.... తాత్కాలికమా ? నిరవధికమా ? అనేది తేలాల్సి ఉంది... కోర్ట్ శుక్రువారం నుంచి మినహాయింపు ఇవ్వకపోతే, బస్ యాత్ర అయినా ప్లాన్ చెయ్యాలి అనుకుంటున్నారు జగన్..

అయితే ఈ నెల 27న విజయవాడలో, వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది అని ముందు చెప్పారు... కాని అది కూడా వాయిదా పడింది... జగన్ కు అమరావతి రావటం ఇష్టం లేదని, మరో రెండు మూడు నెలలు ఇలాగే సాగదీసి, ఎన్నికల సంవత్సరంలో, విజయవాడ కార్యాలయం ఏర్పాటు చేసి, మమ అనిపించనున్నట్టు సమాచరం...

తిరుమల దర్శనం టికెట్ల పై జీఎస్టీ వేయటంతో భక్తుల పై భారం పెరిగిన సంగతి తెలిసిందే... అయితే, ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి చర్చించారు... దర్శనం టికెట్ల పై జీఎస్టీ ఎత్తివేతకు అరుణ్ జైట్లీ సుముఖత వ్యక్తం చేశారు.

దీంతో పాటు పలు అంశాల పై అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు... పోలవరం నిర్మాణానికి నిధుల ఇబ్బందులు లేకుండా చూడాలని అరుణ్ జైట్లీనీ కోరారు చంద్రబాబు.. అలాగే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మనహాయింపు ఇవ్వాలనికోరారు...

ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని, కాకినాడ పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు, రెవెన్యూ లోటు భర్తీ వంటి కీలక అంశాల పై, సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనలు అంగీకరించారు అరుణ్ జైట్లీ.

Advertisements

Latest Articles

Most Read