వాళ్ళు అన్ని విషయాల్లో ఆరి తేరిన ఐఏఎస్ లు... ఎంతో కష్టపడి చదివి, ఐఏఎస్ అయ్యి, ఈ భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి మన ముందుకు రాబోతున్న ఐఏఎస్ లు... అలాంటి వారికి, ఒక ముఖ్యమంత్రి వెళ్లి పాఠాలు చెప్పటం మామూలు విషయం కాదు... అదీ వరుసుగా రెండో సారి... ఇది చంద్రబాబు... ఐఏఎస్ ఆఫీసర్లలో ఉన్న క్రేజ్...
ముస్సొరిలోని ఐ ఏ ఎస్ ల శిక్షణా కేంద్రములో యువ ఐఏఎస్ ల నుద్దేశించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి,చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి లాల్‌బహదూర్‌శాస్ర్తి అకాడమీలో ట్రైనీ ఐఏఎస్‌లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వారికి సలహాలు సూచనలు ఇవ్వడంతోపాటు వారడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి యువ ఐ ఏ ఎస్ లు సలహాలు సూచనలు ఇస్తే అమలు పరుస్తానన్న అయన ఐ ఏ ఎస్ లు భాద్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రధానంగా మూడు అంశాలపై ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత పాలనా పగ్గాలు అందుకోవడం.. రాజధాని నిర్మించే అరుదైన అవకాశం రావడం.. పరిపాలనలో సాంకేతిక వినియోగంపై మాట్లాడారు.
ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్‌కు వస్తారని ముఖ్య మంత్రి అన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బాగా కష్టపడి పనిచేస్తే మీరనుకున్న లక్ష్యానికి చేరువవడమే కాకుండా వ్యక్తిగతంగానూ ప్రజలకు ఉపయోగపడేలాగుంటుందని తెలిపారు. ఇప్పటివరకు పబ్లిక్ మీటింగులలోనే మాట్లాడే వాడినని, ఇప్పుడు ఐ ఏ ఎస్ ల ముందు మాట్లాడడం సంతోషంగా వుందని అన్నారు. నా 9 సంవత్సరాల ఉమ్మడి రాష్త్ర పాలన కాలంలో సంస్కరణలలోకాని, సంక్షేమ పధకాలలో కానీ నావిజయం వెనుక ఐ ఏ ఎస్ ల పాత్ర ఎంతో వుందన్నారని పొగిదారు. దేశంలో మేథావి విద్యార్థులంతా సివిల్స్‌కు పోటీ పడతారని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే డబ్సు సంపాదన కష్టం కాదన్నారు.
రాష్త్రము విడిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక లోటు ఎదుర్కొంటున్నప్పటికి ఆంధ్ర ప్రదేశ్ కి సహజ వనరులు సమృద్ధిగా వున్నాయని, వీటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎ పి కి వున్నా సముద్ర తీర ప్రాంతము మరే రాష్ట్రమునకు లేదని అభిప్రాయ పడ్డారు. ఇది భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు ముఖ ద్వారము అవుతుందని తెలిపారు. ఎపి కొత్త రాజధాని అమరావతికి కృష్\నా నది పరివాహక ప్రాంతము ఎపికి అదనపు బలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను అభివ్రుద్ధిపధంలో నడపడమే తన లక్ష్యమని ముఖ్య మంత్రి అన్నారు.